📖 0/604 చదివిన పేజీలు
📄 313
وَأَنَا ٱخۡتَرۡتُكَ فَٱسۡتَمِعۡ لِمَا يُوحَىٰٓ  ۝١٣ إِنَّنِيٓ أَنَا ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّآ أَنَا۠ فَٱعۡبُدۡنِي وَأَقِمِ ٱلصَّلَوٰةَ لِذِكۡرِيٓ  ۝١٤ إِنَّ ٱلسَّاعَةَ ءَاتِيَةٌ أَكَادُ أُخۡفِيهَا لِتُجۡزَىٰ كُلُّ نَفۡسِۭ بِمَا تَسۡعَىٰ  ۝١٥ فَلَا يَصُدَّنَّكَ عَنۡهَا مَن لَّا يُؤۡمِنُ بِهَا وَٱتَّبَعَ هَوَىٰهُ فَتَرۡدَىٰ  ۝١٦ وَمَا تِلۡكَ بِيَمِينِكَ يَٰمُوسَىٰ  ۝١٧ قَالَ هِيَ عَصَايَ أَتَوَكَّؤُاْ عَلَيۡهَا وَأَهُشُّ بِهَا عَلَىٰ غَنَمِي وَلِيَ فِيهَا مَـَٔارِبُ أُخۡرَىٰ  ۝١٨ قَالَ أَلۡقِهَا يَٰمُوسَىٰ  ۝١٩ فَأَلۡقَىٰهَا فَإِذَا هِيَ حَيَّةٌ تَسۡعَىٰ  ۝٢٠ قَالَ خُذۡهَا وَلَا تَخَفۡۖ سَنُعِيدُهَا سِيرَتَهَا ٱلۡأُولَىٰ  ۝٢١ وَٱضۡمُمۡ يَدَكَ إِلَىٰ جَنَاحِكَ تَخۡرُجۡ بَيۡضَآءَ مِنۡ غَيۡرِ سُوٓءٍ ءَايَةً أُخۡرَىٰ  ۝٢٢ لِنُرِيَكَ مِنۡ ءَايَٰتِنَا ٱلۡكُبۡرَى  ۝٢٣ ٱذۡهَبۡ إِلَىٰ فِرۡعَوۡنَ إِنَّهُۥ طَغَىٰ  ۝٢٤ قَالَ رَبِّ ٱشۡرَحۡ لِي صَدۡرِي  ۝٢٥ وَيَسِّرۡ لِيٓ أَمۡرِي  ۝٢٦ وَٱحۡلُلۡ عُقۡدَةً مِّن لِّسَانِي  ۝٢٧ يَفۡقَهُواْ قَوۡلِي  ۝٢٨ وَٱجۡعَل لِّي وَزِيرًا مِّنۡ أَهۡلِي  ۝٢٩ هَٰرُونَ أَخِي  ۝٣٠ ٱشۡدُدۡ بِهِۦٓ أَزۡرِي  ۝٣١ وَأَشۡرِكۡهُ فِيٓ أَمۡرِي  ۝٣٢ كَيۡ نُسَبِّحَكَ كَثِيرًا  ۝٣٣ وَنَذۡكُرَكَ كَثِيرًا  ۝٣٤ إِنَّكَ كُنتَ بِنَا بَصِيرًا  ۝٣٥ قَالَ قَدۡ أُوتِيتَ سُؤۡلَكَ يَٰمُوسَىٰ  ۝٣٦ وَلَقَدۡ مَنَنَّا عَلَيۡكَ مَرَّةً أُخۡرَىٰٓ  ۝٣٧
20:13
وَأَنَا ٱخۡتَرۡتُكَ فَٱسۡتَمِعۡ لِمَا يُوحَىٰٓ  ۝١٣
మరియు నేను నిన్ను (ప్రవక్తగా) ఎన్నుకున్నాను. నేను నీపై అవతరింపజేసే దివ్యజ్ఞానాన్ని (వహీని) జాగ్రత్తగా విను
20:14
إِنَّنِيٓ أَنَا ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّآ أَنَا۠ فَٱعۡبُدۡنِي وَأَقِمِ ٱلصَّلَوٰةَ لِذِكۡرِيٓ  ۝١٤
నిశ్చయంగా, నేనే అల్లాహ్ ను! నేను తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కావున నన్నే ఆరాధించు మరియు నన్ను స్మరించడానికి నమాజ్ ను స్థాపించు
20:15
إِنَّ ٱلسَّاعَةَ ءَاتِيَةٌ أَكَادُ أُخۡفِيهَا لِتُجۡزَىٰ كُلُّ نَفۡسِۭ بِمَا تَسۡعَىٰ  ۝١٥
నిశ్చయంగా, తీర్పు ఘడియ రానున్నది, ప్రతి వ్యక్తీ తాను చేసిన కర్మల ప్రకారం ప్రతిఫలం పొందటానికి; నేను దానిని గోప్యంగా ఉంచాలని నిర్ణయించాను
20:16
فَلَا يَصُدَّنَّكَ عَنۡهَا مَن لَّا يُؤۡمِنُ بِهَا وَٱتَّبَعَ هَوَىٰهُ فَتَرۡدَىٰ  ۝١٦
కావున దానిని విశ్వసించకుండా, తన మనోవాంఛలను అనుసరించేవాడు, నిన్ను దాని (ఆ ఘడియ చింత) నుండి మరలింపనివ్వరాదు; అలా అయితే నీవు నాశనానికి గురి కాగలవు
20:17
وَمَا تِلۡكَ بِيَمِينِكَ يَٰمُوسَىٰ  ۝١٧
మరియు ఓ మూసా! నీ కుడిచేతిలో ఉన్నది ఏమిటి
20:18
قَالَ هِيَ عَصَايَ أَتَوَكَّؤُاْ عَلَيۡهَا وَأَهُشُّ بِهَا عَلَىٰ غَنَمِي وَلِيَ فِيهَا مَـَٔارِبُ أُخۡرَىٰ  ۝١٨
(మూసా) అన్నాడు: ఇది నా చేతికర్ర, దీనిని ఆనుకొని నిలబడతాను మరియు దీనితో నా మేకల కొరకు ఆకులు రాల్చుతాను. మరియు దీని నుండి నాకు ఇంకా ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి
20:19
قَالَ أَلۡقِهَا يَٰمُوسَىٰ  ۝١٩
(అల్లాహ్) అన్నాడు: ఓ మూసా! దానిని భూమి మీద పడవేయి
20:20
فَأَلۡقَىٰهَا فَإِذَا هِيَ حَيَّةٌ تَسۡعَىٰ  ۝٢٠
అప్పుడు అతను దానిని పడవేశాడు. వెంటనే అది పాముగా మారిపోయి చురుకుగా చలించసాగింది
20:21
قَالَ خُذۡهَا وَلَا تَخَفۡۖ سَنُعِيدُهَا سِيرَتَهَا ٱلۡأُولَىٰ  ۝٢١
(అల్లాహ్) ఆజ్ఞాపించాడు: దానిని పట్టుకో, భయపడకు. మేము దానిని దాని పూర్వస్థితిలోకి మార్చుతాము
20:22
وَٱضۡمُمۡ يَدَكَ إِلَىٰ جَنَاحِكَ تَخۡرُجۡ بَيۡضَآءَ مِنۡ غَيۡرِ سُوٓءٍ ءَايَةً أُخۡرَىٰ  ۝٢٢
మరియు నీ చేతిని చంకలో పెట్టి తీయి, దాని కెలాంటి బాధ కలుగకుండా, అది తెల్లగా మెరుస్తూ బయటికి వస్తుంది, ఇది రెండవ అద్భుత సూచన
20:23
لِنُرِيَكَ مِنۡ ءَايَٰتِنَا ٱلۡكُبۡرَى  ۝٢٣
ఇదంతా మేము నీకు మా గొప్ప సూచనలను చూపటానికి
20:24
ٱذۡهَبۡ إِلَىٰ فِرۡعَوۡنَ إِنَّهُۥ طَغَىٰ  ۝٢٤
నీవు ఫిర్ఔన్ వద్దకు పో! నిశ్చయంగా అతడు మితిమీరి పోయాడు
20:25
قَالَ رَبِّ ٱشۡرَحۡ لِي صَدۡرِي  ۝٢٥
(మూసా) ఇలా మనవి చేసుకున్నాడు: ఓ నా ప్రభూ! నా హృదయాన్ని వికసింపజేయి
20:26
وَيَسِّرۡ لِيٓ أَمۡرِي  ۝٢٦
మరియు నా వ్యవహారాన్ని నా కొరకు సులభం చేయి
20:27
وَٱحۡلُلۡ عُقۡدَةً مِّن لِّسَانِي  ۝٢٧
నా నాలుకలోని ముడిని (ఆటంకాన్ని) తొలగించు
20:28
يَفۡقَهُواْ قَوۡلِي  ۝٢٨
(దానితో) వారు నా మాటలను సులభంగా అర్థం చేసుకోవటానికి
20:29
وَٱجۡعَل لِّي وَزِيرًا مِّنۡ أَهۡلِي  ۝٢٩
మరియు నా కొరకు నా కుటుంబం నుండి ఒక సహాయకుణ్ణి నియమించు
20:30
هَٰرُونَ أَخِي  ۝٣٠
నా సోదరుడైన హారూన్ ను
20:31
ٱشۡدُدۡ بِهِۦٓ أَزۡرِي  ۝٣١
అతని ద్వారా నా బలాన్ని దృఢపరచు
20:32
وَأَشۡرِكۡهُ فِيٓ أَمۡرِي  ۝٣٢
మరియు అతనిని నా వ్యవహారంలో సహాయకారిగా (భాగస్వామిగా) చేయి
20:33
كَيۡ نُسَبِّحَكَ كَثِيرًا  ۝٣٣
మేము నీ పవిత్రతను బాగా కొనియాడటానికి
20:34
وَنَذۡكُرَكَ كَثِيرًا  ۝٣٤
మరియు నిన్ను అత్యధికంగా స్మరించటానికి
20:35
إِنَّكَ كُنتَ بِنَا بَصِيرًا  ۝٣٥
నిశ్చయంగా, నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ కని పెట్టుకునే ఉంటావు
20:36
قَالَ قَدۡ أُوتِيتَ سُؤۡلَكَ يَٰمُوسَىٰ  ۝٣٦
(అల్లాహ్) సెలవిచ్చాడు: ఓ మూసా! వాస్తవంగా, నీవు కోరినదంతా నీకు ఇవ్వబడింది
20:37
وَلَقَدۡ مَنَنَّا عَلَيۡكَ مَرَّةً أُخۡرَىٰٓ  ۝٣٧
మరియు వాస్తవానికి మేము నీకు మరొకసారి ఉపకారం చేశాము


📚Juz 16 📄313 / 604



Mishary Rashid Alafasy
Mahmoud Khalil Al-Husary
Abdurrahman As-Sudais
Mohamed Siddiq Al-Minshawi
Abdul Basit Abdul Samad
Ali Al-Hudhaify
Ahmed ibn Ali al-Ajamy
Abu Bakr Ash-Shaatree
Muhammad Ayyoub
Abdullah Basfar
Abdullah Al-Juhani
Maher Al Muaiqly
0:00
0:00
-

పవిత్ర ఖురాన్


Tuesday, August 25, 2026

Don't forget us in your sincere prayers