సూరా అల్-ఖారిఆ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)
సూరా అల్-ఖారిఆ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-ఖారిఆ అనువాదం. సూరా అల్-ఖారిఆ (Meccan) 11 వచనం.
Related
- సూరా అల్-ఖారిఆ అనువాదంతెలుగు
- సూరా అల్-ఖారిఆ mp3వినండి
- Quran Index తెలుగు114
More సూరా PDF
సూరా అల్-ఖారిఆ

ﭴﭵ
101:1
ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం
ﭶﭷﭸ
101:2
ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం
ﭹﭺﭻﭼﭽ
101:3
మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు
ﭾﭿﮀﮁﮂﮃ
101:4
ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు
ﮄﮅﮆﮇﮈ
101:5
మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి
ﮉﮊﮋﮌﮍ
101:6
అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో
ﮎﮏﮐﮑﮒ
101:7
అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు
ﮓﮔﮕﮖﮗ
101:8
మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో
ﮘﮙﮚ
101:9
అతని నివాసం అధః పాతాళమే
ﮛﮜﮝﮞﮟ
101:10
మరియు అది ఏమిటో నీకేం తెలుసు
ﮠﮡﮢ
101:11
అదొక భగభగమండే అగ్ని (గుండం)
పవిత్ర ఖురాన్
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







