PDF —
44 వచనం Meccan PDF
Built right in your browser — download starts automatically

సూరా అల్-మఆరిజ్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అల్-మఆరిజ్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-మఆరిజ్ అనువాదం. సూరా అల్-మఆరిజ్ (Meccan) 44 వచనం.

← అల్-హాక్కాసూరా అల్-మఆరిజ్ నూహ్ →


44 వచనం · Meccan · తెలుగు
bismillah
ﮮﮯﮰﮱﯓ
70:1 ప్రశ్నించేవాడు, ఆ అనివార్యమైన శిక్షను గురించి ప్రశ్నించాడు
ﯔﯕﯖﯗﯘ
70:2 సత్యతిరస్కారులకు విధించబడే దాని గురించి; దానిని ఎవ్వడూ తొలగించలేడు
ﯙﯚﯛﯜﯝ
70:3 అది ఆరోహణ మార్గాలకు యజమానుడైన అల్లాహ్ తరఫు నుండి వస్తుంది
ﯞﯟﯠﯡﯢﯣﯤﯥﯦﯧﯨﯩ
70:4 యాభై వేల సంవత్సరాలకు సమానమైన (ప్రమాణం గల) ఒక రోజులో, దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్) ఆయన వద్దకు అధిరోహిస్తారు
ﯪﯫﯬﯭ
70:5 కావున (ఓ ముహమ్మద్!) నీవు సహనం వహించు, ఉత్తమమైన సహనంతో
ﯮﯯﯰﯱ
70:6 వాస్తవానికి, వారు (ప్రజలు) అది (ఆ దినం) దూరంగా ఉందని అనుకుంటున్నారు
ﯲﯳﯴ
70:7 కాని మాకది అతి దగ్గరలో కనిపిస్తోంది
ﯵﯶﯷﯸﯹ
70:8 ఆ రోజు ఆకాశం మరిగే సీసం వలే (నూనే వలే) అయి పోతుంది
ﯺﯻﯼﯽ
70:9 మరియు కొండలు ఏకిన ఉన్ని వలె అయి పోతాయి
ﯾﯿﰀﰁﰂ
70:10 మరియు ప్రాణ స్నేహితుడు కూడా తన స్నేహితుని (క్షేమాన్ని) అడగడు
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛ
70:11 వారు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆ రోజు అపరాధి తన సంతానాన్ని పరిహారంగా ఇచ్చి అయినా శిక్ష నుండి తప్పించుకోగోరుతాడు
ﭜﭝﭞ
70:12 మరియు తన సహవాసిని మరియు తన సోదరుణ్ణి
ﭟﭠﭡﭢ
70:13 మరియు తనకు ఆశ్రయమిచ్చిన దగ్గరి బంధువులను
ﭣﭤﭥﭦﭧﭨﭩ
70:14 మరియు భూమిలో ఉన్న వారినందరినీ కూడా ఇచ్చి అయినా, తాను విముక్తి పొందాలని కోరుతాడు
ﭪﭫﭬﭭﭮ
70:15 కాని అలా కానేరదు! నిశ్చయంగా, ఆ మండే అగ్నిజ్వాల (అతని కొరకు వేచి ఉంటుంది)
ﭯﭰﭱ
70:16 అది అతని చర్మాన్ని పూర్తిగా వలచి కాల్చి వేస్తుంది
ﭲﭳﭴﭵﭶ
70:17 అది (సత్యం నుండి) వెనుదిరిగి మరియు వెన్ను చూపి, పోయేవారిని (అందరినీ) పిలుస్తుంది
ﭷﭸﭹ
70:18 మరియు (ధనాన్ని) కూడబెట్టి, దానిని దాచేవారిని
ﭺﭻﭼﭽﭾﭿ
70:19 నిశ్చయంగా, మానవుడు ఆత్రగాడుగా (తొందరపడేవాడిగా) సృష్టించబడ్డాడు
ﮀﮁﮂﮃﮄ
70:20 తనకు కీడు కలిగినప్పుడు వాడు ఆందోళన చెందుతాడు
ﮅﮆﮇﮈﮉ
70:21 మరియు తనకు మేలు కలిగినపుడు స్వార్థపరునిగా ప్రవర్తిస్తాడు
ﮊﮋﮌ
70:22 నమాజ్ ను ఖచ్ఛితంగా పాఠించేవారు తప్ప
ﮍﮎﮏﮐﮑﮒ
70:23 ఎవరైతే తమ నమాజ్ ను సదా నియమంతో పాటిస్తారో
ﮓﮔﮕﮖﮗﮘ
70:24 మరియు అలాంటి వారు, ఎవరైతే తమ సంపదలలో (ఇతరులకు) ఉన్న హక్కును సమ్మతిస్తారో
ﮙﮚﮛ
70:25 యాచకులకు మరియు లేమికి గురి అయిన వారికి
ﮜﮝﮞﮟﮠ
70:26 మరియు అలాంటి వారికి, ఎవరైతే తీర్పుదినాన్ని సత్యమని నమ్ముతారో
ﮡﮢﮣﮤﮥﮦﮧ
70:27 మరియు ఎవరైతే తమ ప్రభువు శిక్షకు భయపడుతారో
ﮨﮩﮪﮫﮬﮭ
70:28 నిశ్చయంగా, వారి ప్రభువు యొక్క ఆ శిక్ష; దాని పట్ల ఎవ్వరూ నిర్భయంగా ఉండలేరు
ﮮﮯﮰﮱﯓ
70:29 మరియు ఎవరైతే, తమ మర్మాంగాలను కాపాడుకుంటారో
ﯔﯕﯖﯗﯘﯙﯚﯛﯜﯝﯞ
70:30 తమ భార్యలు (అజ్వాజ్), లేదా ధర్మసమ్మతంగా తమ ఆధీనంలో ఉన్న (బానిస) స్త్రీలతో తప్ప - అలాంటప్పుడు వారు నిందార్హులు కారు
ﯟﯠﯡﯢﯣﯤﯥﯦ
70:31 కాని ఎవరైతే వీటిని మించి పోగోరుతారో, అలాంటివారే మితిమీరి పోయేవారు
ﯧﯨﯩﯪﯫﯬ
70:32 మరియు ఎవరైతే తమ అమానతులను మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో
ﯭﯮﯯﯰﯱ
70:33 మరియు ఎవరైతే తమ సాక్ష్యాల మీద స్థిరంగా ఉంటారో
ﯲﯳﯴﯵﯶﯷ
70:34 మరియు ఎవరైతే తమ నమాజులను కాపాడుకుంటారో
ﯸﯹﯺﯻﯼ
70:35 ఇలాంటి వారంతా సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు
ﯽﯾﯿﰀﰁﰂ
70:36 ఈ సత్యతిరస్కారులకు ఏమయ్యింది? వీరెందుకు హడావిడిగా, నీ ముందు ఇటూ అటూ తిరుగుతున్నారు
ﰃﰄﰅﰆﰇﰈ
70:37 కుడి ప్రక్క నుండి మరియు ఎడమ ప్రక్క నుండి గుంపులుగా
ﰉﰊﰋﰌﰍﰎﰏﰐﰑ
70:38 ఏమీ? వారిలో ప్రతి ఒక్కడూ, తాను పరమ సుఖాలు గల స్వర్గవనంలో ప్రవేశింప జేయబడతానని ఆశిస్తున్నాడా
ﰒﰓﰔﰕﰖﰗﰘ
70:39 అలా కానేరదు! నిశ్చయంగా, మేము వారిని దేనితో పుట్టించామో వారికి బాగా తెలుసు
ﰙﰚﰛﰜﰝﰞﰟﰠ
70:40 కావున! నేను తూర్పుల మరియు పడమరల ప్రభువు శపథం చేసి చెబుతున్నాను. నిశ్చయంగా, మేము అలా చేయగల సమర్థులము
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙ
70:41 వారికి బదులుగా వారి కంటే ఉత్తమమైన వారిని వారి స్థానంలో తీసుకురావటానికి; మరియు మమ్మల్ని మించి పోయేవారు ఎవ్వరూ లేరు
ﭚﭛﭜﭝﭞﭟﭠﭡﭢ
70:42 కావున వారిని - వారితో వాగ్దానం చేయబడిన ఆ దినానికి చేరే వరకు - వ్యర్థపు మాటలలో మరియు విలాస వినోదాల్లో విడిచిపెట్టు
ﭣﭤﭥﭦﭧﭨﭩﭪﭫﭬ
70:43 ఆ రోజు వారు తమ సమాధుల నుండి లేచి, తమ గమ్యస్థానాలకు చేరుకోవటానికి తొందర పడుతూ వేగంగా బయటికి వస్తారు
ﭭﭮﭯﭰﭱﭲﭳﭴﭵﭶﭷ
70:44 వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి, అవమానం వారిని క్రమ్ముకొని ఉంటుంది. అదే వారికి వాగ్దానం చేయబడిన దినం

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers