PDF —
8 వచనం Medinan PDF
Built right in your browser — download starts automatically

సూరా అజ్-జల్జలా pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అజ్-జల్జలా pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అజ్-జల్జలా అనువాదం. సూరా అజ్-జల్జలా (Medinan) 8 వచనం.



8 వచనం · Medinan · తెలుగు
bismillah
ﮅﮆﮇﮈﮉ
99:1 భూమి తన అతి తీవ్రమైన (అంతిమ) భూకంపంతో కంపింపజేయబడినప్పుడు
ﮊﮋﮌﮍ
99:2 మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడ వేసినప్పుడు
ﮎﮏﮐﮑﮒ
99:3 మరియు మానవుడు: దీనికి ఏమయింది?" అని అన్నప్పుడు
ﮓﮔﮕﮖ
99:4 ఆ రోజు అది తన సమాచారాలను వివరిస్తుంది
ﮗﮘﮙﮚﮛ
99:5 ఎందుకంటే, నీ ప్రభువు దానిని ఆదేశించి ఉంటాడు
ﮜﮝﮞﮟﮠﮡﮢ
99:6 ఆ రోజు ప్రజలు తమ తమ కర్మలు చూపించబడటానికి వేర్వేరు గుంపులలో వెళ్తారు
ﮣﮤﮥﮦﮧﮨﮩ
99:7 అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు
ﮪﮫﮬﮭﮮﮯﮰ
99:8 మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers