Wa izaa tallaqtumun nisaaa`a fabalaghna ajala hunna fa amsikoohunna bima`roofin law sarrihoo hunna bima`roof; wa laa tumsikoo hunna diraa rallita`tadoo; wa mai yaf`al zaalika faqad zalama nafsah; wa laa tattakhizooo aayaatillaahi huzuwaa; wazkuroo ni`matal laahi `alaikum wa maaa anzala `alaikum minal kitaabi wal ikmati ya`izukum bih; wattaqul laaha wa`lamooo annal laaha bikulli shai`i `Aleem
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
మరియు మీరు స్త్రీలకు విడాకులిచ్చినప్పుడు, వారి కొరకు నిర్ణయించబడిన గడువు (ఇద్దత్) సమీపిస్తే వారిని సహృదయంతో మీ వద్ద ఉంచుకోండి, లేదా సహృదయంతో విడిచి పెట్టండి. కేవలం వారికి బాధ కలిగించే మరియు పీడించే ఉద్దేశ్యంతో వారిని ఉంచుకోకండి మరియు ఆ విధంగా చేసేవాడు వాస్తవానికి తనకు తానే అన్యాయం చేసుకన్నట్లు. మరియు అల్లాహ్ ఆదేశాలను (ఆయాత్ లను) పరిహాసంగా తీసుకోకండి. మరియు అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాన్ని మరియు మీపై అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు వివేకాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన (అల్లాహ్) మీకు ఈ విధంగా బోధిస్తున్నాడు. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసని తెలుసుకోండి
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
और जब तुम अपनी बीवियों को तलाक़ दो और उनकी मुद्दत पूरी होने को आए तो अच्छे उनवान से उन को रोक लो या हुस्ने सुलूक से बिल्कुल रुख़सत ही कर दो और उन्हें तकलीफ पहुँचाने के लिए न रोको ताकि (फिर उन पर) ज्यादती करने लगो और जो ऐसा करेगा तो यक़ीनन अपने ही पर जुल्म करेगा और ख़ुदा के एहकाम को कुछ हँसी ठट्टा न समझो और ख़ुदा ने जो तुम्हें नेअमतें दी हैं उन्हें याद करो और जो किताब और अक्ल की बातें तुम पर नाज़िल की उनसे तुम्हारी नसीहत करता है और ख़ुदा से डरते रहो और समझ रखो कि ख़ुदा हर चीज़ को ज़रुर जानता है
أَجَلَهُنَّ: వారి ఇద్దత్ (వేచి ఉండే కాలం) ముగింపు సమయం.
فَأَمْسِكُوهُنَّ: వారిని ఉంచుకోండి, అంటే తిరిగి స్వీకరించండి (రజూ).
بِمَعْرُوفٍ: ధర్మశాస్త్రం ప్రకారం మరియు మంచి పద్ధతిలో.
سَرِّحُوهُنَّ: వారిని వదిలేయండి, విడిచిపెట్టండి.
ضِرَارًا: హాని కలిగించే ఉద్దేశంతో.
لِّتَعْتَدُوا: మీరు అతిక్రమించడానికి, అన్యాయం చేయడానికి.
هُزُوًا: ఆట, పరిహాసం, ఎగతాళి.
الْحِكْمَةِ: జ్ఞానం, అంటే సున్నహ్ (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు).
2) ఆయత్ యొక్క వివరణ:
ఓ విశ్వాసులారా! మీరు మీ భార్యలకు విడాకులు ఇచ్చినప్పుడు, వారి ఇద్దత్ కాలం ముగియడానికి సమీపించినప్పుడు, మీకు రెండు మార్గాలు ఉన్నాయి: మీరు వారిని మంచి పద్ధతిలో తిరిగి స్వీకరించవచ్చు, అంటే వారి హక్కులను పూర్తిగా నెరవేర్చే ఉద్దేశంతో ధర్మశాస్త్రం మరియు సమాజ ఆచారం ప్రకారం వారిని ఉంచుకోవచ్చు. లేదా వారిని గౌరవంగా వదిలేయవచ్చు, అంటే ఎటువంటి హాని కలిగించకుండా వారి ఇద్దత్ కాలం పూర్తయ్యే వరకు వదిలేయవచ్చు, తద్వారా వారు తమ స్వంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
కానీ వారిని హాని కలిగించడానికి, వారిపై అన్యాయం చేయడానికి, వారి హక్కులను ఉల్లంఘించడానికి తిరిగి స్వీకరించకూడదు. అజ్ఞాన కాలంలో కొందరు పురుషులు ఇలా చేసేవారు: వారు భార్యకు విడాకులు ఇచ్చి, ఇద్దత్ ముగియడానికి ముందు తిరిగి స్వీకరించి, ఆమెను ఎక్కువ కాలం బంధించి ఉంచేవారు, ఆమెకు హాని కలిగించేవారు. ఇది పూర్తిగా నిషేధించబడింది. ఎవరైనా ఇలా చేస్తే, వారు తమకు తామే అన్యాయం చేసుకున్నట్లు, ఎందుకంటే వారు తమను తాము దైవ శిక్షకు గురిచేసుకుంటారు.
అల్లాహ్ ఆయతులను, ఆయన ఆదేశాలను ఆట, పరిహాసంగా తీసుకోకూడదు. కొందరు విడాకులు ఇచ్చి, "నేను ఆడుతూ చెప్పాను" అని చెప్పేవారు — ఇలాంటి ప్రవర్తన అనుమతించబడదు. బదులుగా, అల్లాహ్ మీపై చూపిన అనుగ్రహాలను గుర్తు చేసుకోండి — అందులో అతిపెద్దది ఇస్లాం మార్గదర్శకత్వం. మరియు మీపై అవతరింపజేయబడిన ఖుర్ఆన్ మరియు జ్ఞానాన్ని (సున్నహ్) గుర్తు చేసుకోండి. అల్లాహ్ ఈ బోధనల ద్వారా మీకు హితవు చెబుతున్నాడు — మంచి చేయడానికి ప్రోత్సహిస్తూ, చెడు నుండి దూరంగా ఉండమని హెచ్చరిస్తూ. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి, ఆయన ఆదేశాలను పాటించండి, నిషేధాలను విడిచిపెట్టండి. మరియు తెలుసుకోండి — అల్లాహ్ ప్రతి విషయం గురించి పూర్తిగా తెలిసినవాడ
మరియు మీరు స్త్రీలకు విడాకులిచ్చినప్పుడు, వారి కొరకు నిర్ణయించబడిన గడువు (ఇద్దత్) సమీపిస్తే వారిని సహృదయంతో మీ వద్ద ఉంచుకోండి, లేదా సహృదయంతో విడిచి పెట్టండి. కేవలం వారికి బాధ కలిగించే మరియు పీడించే ఉద్దేశ్యంతో వారిని ఉంచుకోకండి మరియు ఆ విధంగా చేసేవాడు వాస్తవానికి తనకు తానే అన్యాయం చేసుకన్నట్లు. మరియు అల్లాహ్ ఆదేశాలను (ఆయాత్ లను) పరిహాసంగా తీసుకోకండి. మరియు అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాన్ని మరియు మీపై అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు వివేకాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన (అల్లాహ్) మీకు ఈ విధంగా బోధిస్తున్నాడు. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసని తెలుసుకోండి
విడాకులు రెండు సార్లే! ఆ తర్వాత (భార్యను) సహృదయంతో తమ వద్ద ఉండనివ్వాలి, లేదా ఆమెను మంచితనంతో సాగనంపాలి. మరియు సాగనంపేటప్పుడు మీరు వారికిచ్చిన వాటి నుండి ఏమైనా తిరిగి తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేము అనే భయం ఆ ఇద్దరికీ ఉంటే తప్ప! కాని అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమనే భయం ఆ దంపతులకు ఉంటే స్త్రీ పరిహారమిచ్చి (విడాకులు / ఖులా తీసుకంటే) అందులో వారికి ఎలాంటి దోషం లేదు. ఇవి అల్లాహ్ విధించిన హద్దులు, కావున వీటిని అతిక్రమించకండి. మరియు ఎవరైతే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమిస్తారో, అలాంటి వారే దుర్మార్గులు
ఒకవేళ అతడు (మూడవసారి) విడాకులిస్తే, ఆ తర్వాత ఆ స్త్రీ అతనికి ధర్మసమ్మతం కాదు, ఆమె వివాహం వేరే పురుషునితో జరిగితే తప్ప! ఒకవేళ అతడు (రెండవ భర్త) ఆమెకు విడాకులిస్తే! అప్పుడు ఉభయులూ (మొదటి భర్త, ఈ స్త్రీ) తాము అల్లాహ్ హద్దులకు లోబడి ఉండగలమని భావిస్తే వారు పునర్వివాహం చేసుకోవటంలో దోషం లేదు మరియు ఇవి అల్లాహ్ నియమించిన హద్దులు. వీటిని ఆయన గ్రహించే వారికి స్పష్టపరుస్తున్నాడు
మరియు మీరు స్త్రీలకు విడాకులిచ్చినప్పుడు, వారి కొరకు నిర్ణయించబడిన గడువు (ఇద్దత్) సమీపిస్తే వారిని సహృదయంతో మీ వద్ద ఉంచుకోండి, లేదా సహృదయంతో విడిచి పెట్టండి. కేవలం వారికి బాధ కలిగించే మరియు పీడించే ఉద్దేశ్యంతో వారిని ఉంచుకోకండి మరియు ఆ విధంగా చేసేవాడు వాస్తవానికి తనకు తానే అన్యాయం చేసుకన్నట్లు. మరియు అల్లాహ్ ఆదేశాలను (ఆయాత్ లను) పరిహాసంగా తీసుకోకండి. మరియు అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాన్ని మరియు మీపై అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు వివేకాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన (అల్లాహ్) మీకు ఈ విధంగా బోధిస్తున్నాడు. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసని తెలుసుకోండి
మరియు మీరు మీ స్త్రీలకు (మొదటి సారి లేక రెండవసారి) విడాకులిస్తే, వారు తమ నిరీక్షణా వ్యవధిని (ఇద్దత్ ను) పూర్తి చేసిన తరువాత, తమ (మొదటి) భర్తలను ధర్మసమ్మతంగా పరస్పర అంగీకారంతో వివాహం చేసుకోదలిస్తే, మీరు వారిని ఆటంకపరచకండి. మీలో ఎవరికి అల్లాహ్ యందు మరియు అంతిమ దినము నందు విశ్వాసముందో, వారికి ఈ బోధన చేయబడుతోంది. ఇది మీకు నిష్కళంకమైనది మరియు నిర్మలమైనది. మరియు అల్లాహ్ కు అంతా తెలుసు, కాని మీకు ఏమీ తెలియదు
(విడాకుల తరువాత) పూర్తి రెండు సంవత్సరాల పాల గడువు పూర్తి చేయవలెనని (తల్లిదండ్రులు) కోరినట్లయితే, తల్లులు తమ పిల్లలకు పాలివ్వాలి. బిడ్డ తండ్రిపై, వారికి తగు రీతిగా భోజనం మరియు వస్త్రాలిచ్చి పోషించవలసిన బాధ్యత ఉంటుంది. శక్తికి మించిన భారం ఏ వ్యక్తిపై కూడా మోపబడదు. తల్లి తన బిడ్డ వలన కష్టాలకు గురి కాకూడదు. మరియు తండ్రి కూడా తన బిడ్డ వలన (కష్టాలకు గురి కాకూడదు). మరియు (పాలిచ్చే తల్లిని పోషించే బాధ్యత తండ్రిపై ఉన్నట్లు తండ్రి చనిపోతే) అతని వారసులపై కూడా ఉంటుంది. మరియు (తల్లిదండ్రులు) ఇరువురు సంప్రదించుకొని పరస్పర అంగీకారంతో (రెండు సంవత్సరాలు పూర్తికాక ముందే) బిడ్డ చేత పాలు విడిపిస్తే, వారిరువురికి ఎలాంటి దోషం లేదు. మరియు మీరు మీ బిడ్డలకు వేరే స్త్రీ ద్వారా పాలు ఇప్పించే ఏర్పాటు చేయదలిస్తే, మీపై ఎలాంటి దోషం లేదు. కాని మీరు ఆమెకు (తల్లికి) ఇవ్వ వలసింది ధర్మసమ్మతంగా చెల్లించాలి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు చేసేదంతా నిశ్చయంగా, అల్లాహ్ చూస్తున్నాడని తెలుసుకోండి
సూరా అల్-బఖరా వచనం 231 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు మీరు స్త్రీలకు విడాకులిచ్చినప్పుడు, వారి కొరకు నిర్ణయించబడిన గడువు (ఇద్దత్) సమీపిస్తే…
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.