Wa qul lilmu`minaati yaghdudna min absaarihinna wa yahfazna furoojahunna wa laa yubdeena zeenatahunna illaa maa zahara minhaa walyadribna bikhumurihinna `alaa juyoobihinna wa laa yubdeena zeenatahunna illaa libu`oolatihinna aw aabaaa`i hinna aw aabaaa`i bu`oolati hinna aw abnaaa`ihinaa aw abnaaa`i bu`oolatihinnna aw ikhwaanihinnna aw baneee ikhwaanihinna aw banee akhawaatihinna aw nisaaa`i hinna aw maa malakat aimaanuhunna awit taabi`eena ghairi ilil irbati minar rijaali awit tiflillazeena lam yazharoo `alaa `awraatin nisaaa`i wala yadribnna bi arjulihinna min zeenatihinn; wa toobooo ilallaahi jammee`an aiyuhal mu`minoona la`allakum tuflihoon
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
మరియు విశ్వసించిన స్త్రీలతో కూడా వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. మరియు వారి అలంకరణను ప్రదర్శించవద్దని చెప్పు - (దానంతట అదే) ప్రదర్శనమయ్యేది తప్ప. వారిని, తమ తల మీది దుప్పటిని రొమ్ముల వరకు కప్పుకోమని చెప్పు. వారు తమ అలంకారాన్ని తమ భర్తలకు, తమ తండ్రులకు, తమ భర్తల తండ్రులకు, తమ కుమారులకు, తమ భర్తల కుమారులకు, తమ సోదరులకు, తమ సోదరుల కుమారులకు, తమ సోదరీమణుల కుమారులకు, తమ (తోటి స్త్రీలకు, తమ బానిస స్త్రీలకు, లేక కామ ఇచ్ఛలేని మగ సేవకులకు, లేక స్త్రీల గుప్తాంగాలను గురించి తెలియని బాలురకు తప్ప. ఇతరుల ముందు ప్రదర్శించకూడదని మరియు కనబడకుండా ఉన్న తమ అలంకారం తెలియబడేటట్లుగా, వారు తమ పాదాలను నేలపై కొడుతూ నడవకూడదని చెప్పు. మరియు ఓ విశ్వాసులారా! మీరందరూ కలసి అల్లాహ్ ను క్షమాపణకై వేడుకుంటే, మీరు సాఫల్యం పొందవచ్చు)
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
और (ऐ रसूल) ईमानदार औरतों से भी कह दो कि वह भी अपनी नज़रें नीची रखें और अपनी शर्मगाहों की हिफाज़त करें और अपने बनाव सिंगार (के मक़ामात) को (किसी पर) ज़ाहिर न होने दें मगर जो खुद ब खुद ज़ाहिर हो जाता हो (छुप न सकता हो) (उसका गुनाह नही) और अपनी ओढ़नियों को (घूँघट मारके) अपने गरेबानों (सीनों) पर डाले रहें और अपने शौहर या अपने बाप दादाओं या आपने शौहर के बाप दादाओं या अपने बेटों या अपने शौहर के बेटों या अपने भाइयों या अपने भतीजों या अपने भांजों या अपने (क़िस्म की) औरतों या अपनी या अपनी लौंडियों या (घर के) नौकर चाकर जो मर्द सूरत हैं मगर (बहुत बूढे होने की वजह से) औरतों से कुछ मतलब नहीं रखते या वह कमसिन लड़के जो औरतों के पर्दे की बात से आगाह नहीं हैं उनके सिवा (किसी पर) अपना बनाव सिंगार ज़ाहिर न होने दिया करें और चलने में अपने पाँव ज़मीन पर इस तरह न रखें कि लोगों को उनके पोशीदा बनाव सिंगार (झंकार वग़ैरह) की ख़बर हो जाए और ऐ ईमानदारों तुम सबके सब ख़ुदा की बारगाह में तौबा करो ताकि तुम फलाह पाओ
يَغْضُضْنَ (యగ్దుద్న): తమ చూపులను తగ్గించుకోవాలి, అనగా చూడకూడని వాటిని చూడకుండా కళ్ళు దించుకోవాలి.
فُرُوجَهُنَّ (ఫురూజహున్న): తమ గుప్తాంగాలను — అనగా వ్యభిచారం నుండి మరియు అనావృతం (తెరవకుండా) కాపాడుకోవాలి.
زِينَتَهُنَّ (జీనతహున్న): తమ అలంకారాలను — అనగా ఆభరణాలు, అందం చేసే వస్తువులు.
خُمُرِهِنَّ (ఖుమురిహిన్న): తలలపై కప్పే బురఖాలు/శాలువలు (ఖిమార్ యొక్క బహువచనం).
جُيُوبِهِنَّ (జుయూబిహిన్న): చొక్కా మెడ కన్నం, ఛాతీ భాగం (జైబ్ యొక్క బహువచనం).
بُعُولَتِهِنَّ (బుఊలతిహిన్న): వారి భర్తలు.
أُولِي الْإِرْبَةِ (ఉలిల్ ఇర్బా): స్త్రీల పట్ల కోరిక/ఆసక్తి లేని పురుషులు.
يَظْهَرُوا (యజ్హరూ): ఎరుగుట, తెలుసుకొనుట — ఇక్కడ అర్థం: స్త్రీల గుప్తాంగాల గురించి ఇంకా తెలియని చిన్న పిల్లలు.
أَرْجُلِهِنَّ (అర్జులిహిన్న): వారి కాళ్ళు.
تُفْلِحُونَ (తుఫ్లిహూన): మీరు విజయం పొందుతారు, సాఫల్యం చెందుతారు.
ఆయత్ యొక్క వివరణ:
అల్లాహ్ తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు ఇలా ఆదేశిస్తున్నాడు: విశ్వాసులైన స్త్రీలకు కూడా చెప్పు — వారు తమ చూపులను కాపాడుకోవాలి, అనగా పరపురుషుల వైపు, లేదా చూడకూడని వైపు చూడకూడదు. తమ గుప్తాంగాలను వ్యభిచారం నుండి మరియు అనావృతం నుండి రక్షించుకోవాలి. తమ అలంకారాలను — అనగా ఆభరణాలు, అందాన్ని పెంచే వస్తువులు — బయటి పురుషులకు చూపకూడదు; కానీ సహజంగా కనిపించే బాహ్య వస్త్రాలు మరియు వాటితో పాటు కనిపించే వాటిని మినహాయించి, వాటిని దాచడం ఇబ్బందికరం కాబట్టి అనుమతించబడింది. అలాగే వారు తమ తలలపై ఉన్న శాలువలను మెడ కన్నం మరియు ఛాతీ భాగంపై వేలాడదీయాలి, తద్వారా తల, ముఖం, మెడ మరియు ఛాతీ భాగం పూర్తిగా కప్పబడతాయి.
ఆ తరువాత అల్లాహ్ తెలిపాడు: స్త్రీలు తమ అలంకారాన్ని ఎవరికీ చూపకూడదు — కానీ తమ భర్తలకు, తండ్రులకు, భర్తల తండ్రులకు, తమ కుమారులకు, భర్తల కుమారులకు, తమ సహోదరులకు, సహోదరుల కుమారులకు, సహోదరీల కుమారులకు, తమ స్త్రీలకు (విశ్వసనీయులైన స్త్రీలకు), తమ బానిసలకు, స్త్రీల పట్ల కోరిక లేని పురుషులకు (ఉదాహరణకు బుద్ధిహీనులు, వృద్ధులు), మరియు స్త్రీల గుప్తాంగాల గురించి ఇంకా తెలియని చిన్న పిల్లలకు మాత్రమే చూపవచ్చు. ఈ వర్గాలకు అనుమతి ఇవ్వడానికి కారణం — వారు ఇళ్ళలో తరచుగా రాకపోకలు ఉంటాయి, మరియు స్త్రీలకు వారితో సంబంధాలు అవసరం.
మరియు విశ్వసించిన స్త్రీలతో కూడా వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. మరియు వారి అలంకరణను ప్రదర్శించవద్దని చెప్పు - (దానంతట అదే) ప్రదర్శనమయ్యేది తప్ప. వారిని, తమ తల మీది దుప్పటిని రొమ్ముల వరకు కప్పుకోమని చెప్పు. వారు తమ అలంకారాన్ని తమ భర్తలకు, తమ తండ్రులకు, తమ భర్తల తండ్రులకు, తమ కుమారులకు, తమ భర్తల కుమారులకు, తమ సోదరులకు, తమ సోదరుల కుమారులకు, తమ సోదరీమణుల కుమారులకు, తమ (తోటి స్త్రీలకు, తమ బానిస స్త్రీలకు, లేక కామ ఇచ్ఛలేని మగ సేవకులకు, లేక స్త్రీల గుప్తాంగాలను గురించి తెలియని బాలురకు తప్ప. ఇతరుల ముందు ప్రదర్శించకూడదని మరియు కనబడకుండా ఉన్న తమ అలంకారం తెలియబడేటట్లుగా, వారు తమ పాదాలను నేలపై కొడుతూ నడవకూడదని చెప్పు. మరియు ఓ విశ్వాసులారా! మీరందరూ కలసి అల్లాహ్ ను క్షమాపణకై వేడుకుంటే, మీరు సాఫల్యం పొందవచ్చు)
ఎవ్వరికీ నివాస స్థలం కాకుండా మీకు ప్రయోజనకరమైన వస్తువులున్న ఇండ్లలో ప్రవేశిస్తే, మీపై ఎట్టి దోషం లేదు. మరియు మీరు వ్యక్తపరిచేది మరియు మీరు దాచేది అంతా అల్లాహ్ కు బాగా తెలుసు
విశ్వసించిన పురుషులతో, వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. ఇది వారికి ఎంతో శ్రేష్ఠమైనది. నిశ్చయంగా, అల్లాహ్ వారి చేష్టలను బాగా ఎరుగును
మరియు విశ్వసించిన స్త్రీలతో కూడా వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. మరియు వారి అలంకరణను ప్రదర్శించవద్దని చెప్పు - (దానంతట అదే) ప్రదర్శనమయ్యేది తప్ప. వారిని, తమ తల మీది దుప్పటిని రొమ్ముల వరకు కప్పుకోమని చెప్పు. వారు తమ అలంకారాన్ని తమ భర్తలకు, తమ తండ్రులకు, తమ భర్తల తండ్రులకు, తమ కుమారులకు, తమ భర్తల కుమారులకు, తమ సోదరులకు, తమ సోదరుల కుమారులకు, తమ సోదరీమణుల కుమారులకు, తమ (తోటి స్త్రీలకు, తమ బానిస స్త్రీలకు, లేక కామ ఇచ్ఛలేని మగ సేవకులకు, లేక స్త్రీల గుప్తాంగాలను గురించి తెలియని బాలురకు తప్ప. ఇతరుల ముందు ప్రదర్శించకూడదని మరియు కనబడకుండా ఉన్న తమ అలంకారం తెలియబడేటట్లుగా, వారు తమ పాదాలను నేలపై కొడుతూ నడవకూడదని చెప్పు. మరియు ఓ విశ్వాసులారా! మీరందరూ కలసి అల్లాహ్ ను క్షమాపణకై వేడుకుంటే, మీరు సాఫల్యం పొందవచ్చు)
మీలోని పెండ్లికాని వారికి మరియు శీలవతులైన మీ బానిస పురుషులు మరియు బానిస స్త్రీలకు వివాహాలు చేయించండి. ఒకవేళ వారు పేదవారయితే, అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని సంపన్నులగా చేయవచ్చు! మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు
ఎవరికైతే, పెండ్లి చేసుకునే శక్తి లేదో వారు, అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని ధనవంతులుగా చేసే వరకు శీలశుద్ధతను పాటించాలి. మరియు మీ బానిసలలో ఎవరైనా స్వేచ్ఛాపత్రం వ్రాయించుకోగోరితే వారి యందు మీకు మంచితనం కనబడితే, వారికి స్వేచ్ఛాపత్రం వ్రాసి ఇవ్విండి. అల్లాహ్ మీకు ఇచ్చిన ధనం నుండి వారికి కూడా కొంత ఇవ్వండి. మీరు ఇహలోక ప్రయోజనాల నిమిత్తం, మీ బానిస స్త్రీలు శీలవతులుగా ఉండగోరితే వారిని వ్యభిచారానికి బలవంతపెట్టకండి, ఎవరైనా వారిని బలవంతపెడితే! నిశ్చయంగా, అల్లాహ్ వారిని (ఆ బానిస స్త్రీలకు) బలాత్కారం తరువాత క్షమించేవాడు, అపార కరుణా ప్రదాత
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.