Wa izaa kunta feehim fa aqamta lahumus Salaata faltaqum taaa`ifatum minhum ma`aka walyaakhuzooo aslihatahum fa izaa sajadoo fal yakoonoo minw waraaa`ikum waltaati taaa`ifatun ukhraa lam yusalloo falyusallo ma`aka walyaakhuzoo hizrahum wa aslihatahum; waddal lazeena kafaroo law taghfuloona `anaslihatikum wa amti`atikum fa yameeloona `alaikum mailatanw waahidah; wa laa junaaha `alaikum in kaana bikum azam mimmatarin aw kuntum mmardaaa an tada`ooo aslihatakum wa khuzoo hizrakum; innal laaha a`adda lilkaafireena `azaabam muheenaa
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
మరియు నీవు (ఓ ప్రవక్తా!) వారి (ముస్లింల) మద్య ఉండి (పోరాటం జరుగుతూ ఉండగా) నమాజ్ చేయించటానికి వారితో నిలబడితే, వారిలోని ఒక వర్గం నీతో పాటు నిలబడాలి. మరియు వారు అస్త్రధారులై ఉండాలి. వారు తమ సజ్దాను పూర్తి చేసుకొని వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇంకా నమాజ్ చేయని రెండో వర్గం వచ్చి నీతో పాటు నమాజ్ చేయాలి. వారు కూడా జాగరూకులై ఉండి, తమ ఆయుధాలను ధరించి ఉండాలి. ఎందుకంటే, మీరు మీ ఆయుధాల పట్ల, మరియు మీ సామగ్రి పట్ల, ఏ కొద్ది అజాగ్రత్త వహించినా మీపై ఒక్కసారిగా విరుచుకు పడాలని సత్యతిరస్కారులు కాచుకొని ఉంటారు. అయితే, వర్షం వల్ల మీకు ఇబ్బందిగా ఉంటే! లేదా మీరు అస్వస్థులైతే, మీరు మీ ఆయుధాలను దించి పెట్టడం పాపం కాదు. అయినా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారుల కొరకు అవమానకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచాడు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
और (ऐ रसूल) तुम मुसलमानों में मौजूद हो और (लड़ाई हो रही हो) कि तुम उनको नमाज़ पढ़ाने लगो तो (दो गिरोह करके) एक को लड़ाई के वास्ते छोड़ दो (और) उनमें से एक जमाअत तुम्हारे साथ नमाज़ पढ़े और अपने हरबे तैयार अपने साथ लिए रहे फिर जब (पहली रकअत के) सजदे कर (दूसरी रकअत फुरादा पढ़) ले तो तुम्हारे पीछे पुश्त पनाह बनें और दूसरी जमाअत जो (लड़ रही थी और) जब तक नमाज़ नहीं पढ़ने पायी है और (तुम्हारी दूसरी रकअत में) तुम्हारे साथ नमाज़ पढ़े और अपनी हिफ़ाज़त की चीजे अौर अपने हथियार (नमाज़ में साथ) लिए रहे कुफ्फ़ार तो ये चाहते ही हैं कि काश अपने हथियारों और अपने साज़ व सामान से ज़रा भी ग़फ़लत करो तो एक बारगी सबके सब तुम पर टूट पड़ें हॉ अलबत्ता उसमें कुछ मुज़ाएक़ा नहीं कि (इत्तेफ़ाक़न) तुमको बारिश के सबब से कुछ तकलीफ़ पहुंचे या तुम बीमार हो तो अपने हथियार (नमाज़ में) उतार के रख दो और अपनी हिफ़ाज़त करते रहो और ख़ुदा ने तो काफ़िरों के लिए ज़िल्लत का अज़ाब तैयार कर रखा है
فَأَقَمْتَ لَهُمُ الصَّلَاةَ: నువ్వు వారికి నమాజును నిర్వహించి ఇమామత్ చేశావు.
طَائِفَةٌ: ఒక బృందం, ఒక వర్గం.
أَسْلِحَتَهُمْ: వారి ఆయుధాలను.
حِذْرَهُمْ: వారి జాగ్రత్తను, రక్షణను.
مَيْلَةً وَاحِدَةً: ఒకేసారి ఒకే దాడి.
جُنَاحَ: పాపం, దోషం.
أَذًى: హాని, ఇబ్బంది.
مُهِينًا: అవమానకరమైనది, అగౌరవపరచేది.
ఆయత్ వ్యాఖ్యానం:
ఓ ప్రవక్తా! యుద్ధభూమిలో నువ్వు వారి మధ్య ఉండి, వారికి నమాజు నిర్వహించాలని నిర్ణయించుకున్నప్పుడు, సైన్యాన్ని రెండు బృందాలుగా విభజించు. మొదటి బృందం నీ వెంట నమాజు చేయాలి, వారు తమ ఆయుధాలను తమతో పాటు ఉంచుకోవాలి. రెండవ బృందం శత్రువు వైపు కాపలా ఉండాలి. మొదటి బృందం నీతో ఒక రకాత్ పూర్తి చేసిన తర్వాత, వారు తమ నమాజును స్వయంగా పూర్తి చేసుకుని, శత్రువు ఎదురుగా వెళ్ళి నిలబడాలి. అప్పుడు కాపలాలో ఉన్న రెండవ బృందం వచ్చి నీతో నమాజు చేయాలి — వారు ఇంతకుముందు నమాజు చేయలేదు కాబట్టి నీతో చేరి ఒక రకాత్ చేయాలి. వారు కూడా తమ జాగ్రత్తను, ఆయుధాలను తప్పక ఉంచుకోవాలి.
సత్యాన్ని తిరస్కరించేవారు — అవిశ్వాసులు — మీరు మీ ఆయుధాల గురించి, మీ సామగ్రి గురించి అశ్రద్ధ చేస్తే, ఒకేసారి మీపై దాడి చేసి మిమ్మల్ని అంతమొందించాలని ఆశిస్తున్నారు. కానీ వర్షం వల్ల ఇబ్బంది కలిగినా, లేదా మీరు అనారోగ్యంతో ఉన్నా, నమాజు సమయంలో ఆయుధాలు దించి పెట్టడంలో మీపై ఎలాంటి పాపం లేదు. అయితే శత్రువు నుండి జాగ్రత్తగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ అవిశ్వాసుల కోసం అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు.
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
నమాజు యొక్క ప్రాముఖ్యత: యుద్ధభూమిలో కూడా నమాజు ఆగకూడదు. భయం, ప్రమాదం ఉన్నప్పటికీ నమాజు నిర్వహించే ఏర్పాటు చేయాలని ఇస్లాం బోధిస్తుంది. ఇది నమాజు ఎంత గొప్ప ఆరాధన అని చూపిస్తుంది.
జాగ్రత్త మరియు వివేకం: ముస్లింలు తమ రక్షణ కోసం జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల కుట్రలను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలి. ఇస్లాం మతం బలహీనతను కాదు, బలాన్ని మరియు వివేకాన్ని ప్రోత్సహిస్తుంది.
సౌలభ్యం మరియు దయ: అల్లాహ్ తన దాసులపై దయ చూపుతాడు. వర్షం, అనారోగ్యం వంటి కారణాల వల్ల ఆయుధాలు దించి పెట్టడానికి అనుమతి ఇచ్చాడు. ఇస్లాం కఠినమైనది కాదు, మానవ స్వభావాన్ని అర్థం చేసుకునే మతం.
అల్లాహ్ వాగ్దానం: అవిశ్వాసులకు అవమానకరమైన శిక్ష సిద్ధంగా ఉంది. విశ్వాసులు అల్లాహ
మరియు నీవు (ఓ ప్రవక్తా!) వారి (ముస్లింల) మద్య ఉండి (పోరాటం జరుగుతూ ఉండగా) నమాజ్ చేయించటానికి వారితో నిలబడితే, వారిలోని ఒక వర్గం నీతో పాటు నిలబడాలి. మరియు వారు అస్త్రధారులై ఉండాలి. వారు తమ సజ్దాను పూర్తి చేసుకొని వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇంకా నమాజ్ చేయని రెండో వర్గం వచ్చి నీతో పాటు నమాజ్ చేయాలి. వారు కూడా జాగరూకులై ఉండి, తమ ఆయుధాలను ధరించి ఉండాలి. ఎందుకంటే, మీరు మీ ఆయుధాల పట్ల, మరియు మీ సామగ్రి పట్ల, ఏ కొద్ది అజాగ్రత్త వహించినా మీపై ఒక్కసారిగా విరుచుకు పడాలని సత్యతిరస్కారులు కాచుకొని ఉంటారు. అయితే, వర్షం వల్ల మీకు ఇబ్బందిగా ఉంటే! లేదా మీరు అస్వస్థులైతే, మీరు మీ ఆయుధాలను దించి పెట్టడం పాపం కాదు. అయినా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారుల కొరకు అవమానకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచాడు
మరియు అల్లాహ్ మార్గంలో వలస పోయేవాడు భూమిలో కావలసినంత స్థలాన్ని, సౌకర్యాలను పొందుతాడు. మరియు ఎవడు తన ఇంటిని వదలి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కొరకు, వలస పోవటానికి బయలుదేరిన తరువాత, అతనికి చావు వస్తే! నిశ్చయంగా, అతని ప్రతిఫలం అల్లాహ్ వద్ద స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత
మరియు మీరు భూమిలో ప్రయాణం చేసేటపుడు నమాజులను సంక్షిప్తం (ఖస్ర్) చేస్తే, అది పాపం కాదు. (అంతే గాక) సత్యతిరస్కారులు మిమ్మల్ని వేధిస్తారు అనే భయం మీకు కలిగినపుడు కూడా! ఎందుకంటే సత్యతిరస్కారులు నిశ్చయంగా, మీకు బహిరంగ శత్రువులు
మరియు నీవు (ఓ ప్రవక్తా!) వారి (ముస్లింల) మద్య ఉండి (పోరాటం జరుగుతూ ఉండగా) నమాజ్ చేయించటానికి వారితో నిలబడితే, వారిలోని ఒక వర్గం నీతో పాటు నిలబడాలి. మరియు వారు అస్త్రధారులై ఉండాలి. వారు తమ సజ్దాను పూర్తి చేసుకొని వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇంకా నమాజ్ చేయని రెండో వర్గం వచ్చి నీతో పాటు నమాజ్ చేయాలి. వారు కూడా జాగరూకులై ఉండి, తమ ఆయుధాలను ధరించి ఉండాలి. ఎందుకంటే, మీరు మీ ఆయుధాల పట్ల, మరియు మీ సామగ్రి పట్ల, ఏ కొద్ది అజాగ్రత్త వహించినా మీపై ఒక్కసారిగా విరుచుకు పడాలని సత్యతిరస్కారులు కాచుకొని ఉంటారు. అయితే, వర్షం వల్ల మీకు ఇబ్బందిగా ఉంటే! లేదా మీరు అస్వస్థులైతే, మీరు మీ ఆయుధాలను దించి పెట్టడం పాపం కాదు. అయినా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారుల కొరకు అవమానకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచాడు
ఇక నమాజ్ ను పూర్తి చేసిన తరువాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి. కాని శాంతిభద్రతలు నెలకొన్న తరువాత నమాజ్ ను స్థాపించండి. నిశ్చయంగా, నమాజ్ విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించడానికి విధిగా నియమించబడింది
మరియు శత్రువులను వెంబడించటంలో బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు బాధపడుతున్నట్లయితే, నిశ్చయంగా వారు కూడా - మీరు బాధపడుతున్నట్లే - బాధపడుతున్నారు. మరియు మీరు అల్లాహ్ నుండి వారు ఆశించలేని దానిని ఆశిస్తున్నారు. మరియు వాస్తవానికి, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.