సూరా అద్-దుహా pdf — డౌన్‌లోడ్ (తెలుగు)
సూరా అద్-దుహా pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అద్-దుహా అనువాదం. సూరా అద్-దుహా (Meccan) 11 వచనం.
Related
- సూరా అద్-దుహా అనువాదంతెలుగు
- సూరా అద్-దుహా mp3వినండి
- Quran Index తెలుగు114
More సూరా PDF
సూరా అద్-దుహా

ﮉﮊ
93:1
ప్రకాశవంతమైన ప్రొద్దుటి పూట (పూర్వాహ్ణం) సాక్షిగా
ﮋﮌﮍﮎ
93:2
మరియు చీకటి పడ్డ రాత్రి సాక్షిగా
ﮏﮐﮑﮒﮓﮔ
93:3
(ఓ ముహమ్మద్!) నీ ప్రభువు, నిన్ను త్యజించనూ లేదు మరియు నిన్ను ఉపేక్షించనూ లేదు
ﮕﮖﮗﮘﮙﮚ
93:4
మరియు రాబోయే కాలం (జీవితం) నీ కొరకు మొదటి కాలం (జీవితం) కంటే ఎంతో మేలైనది
ﮛﮜﮝﮞﮟ
93:5
మరియు త్వరలోనే నీ ప్రభువు నీకు (నీవు కోరేది) ప్రసాదిస్తాడు. దానితో నీవు సంతోషపడతావు
ﮠﮡﮢﮣﮤ
93:6
(ఓ ముహమ్మద్!) ఏమీ? నిన్ను అనాథునిగా చూసి, ఆయన (అల్లాహ్) నీకు ఆశ్రయం కల్పించలేదా
ﮥﮦﮧﮨ
93:7
మరియు నీకు మార్గం తోచనప్పుడు, ఆయన నీకు మార్గదర్శకత్వం చేయలేదా
ﮩﮪﮫﮬ
93:8
మరియు ఆయన, పేదవానిగా చూసి, నిన్ను సంపన్నుడిగా చేయలేదా
ﮭﮮﮯﮰﮱ
93:9
కాబట్టి నీవు అనాథుల పట్ల కఠినంగా ప్రవర్తించకు
ﯓﯔﯕﯖﯗ
93:10
మరియు యాచకుణ్ణి కసరుకోకు
ﯘﯙﯚﯛﯜ
93:11
మరియు నీ ప్రభువు అనుగ్రహాలను బహిరంగంగా ప్రకటిస్తూ ఉండు
పవిత్ర ఖురాన్
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







