సూరా అల్-లైల్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)
సూరా అల్-లైల్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-లైల్ అనువాదం. సూరా అల్-లైల్ (Meccan) 21 వచనం.
Related
- సూరా అల్-లైల్ అనువాదంతెలుగు
- సూరా అల్-లైల్ mp3వినండి
- Quran Index తెలుగు114
More సూరా PDF
సూరా అల్-లైల్

ﮡﮢﮣﮤ
92:1
క్రమ్ముకునే రాత్రి సాక్షిగా
ﮥﮦﮧﮨ
92:2
ప్రకాశించే పగటి సాక్షిగా
ﮩﮪﮫﮬﮭ
92:3
మరియు, మగ మరియు ఆడ (జాతులను) సృష్టించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా
ﮮﮯﮰﮱ
92:4
వాస్తవానికి, మీ ప్రయత్నాలు నానా విధాలుగా ఉన్నాయి
ﯓﯔﯕﯖﯗ
92:5
కాని ఎవడైతే (దానధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో
ﯘﯙﯚ
92:6
మరియు మంచిని నమ్ముతాడో
ﯛﯜﯝ
92:7
అతనికి మేము మేలు కొరకు దారిని సులభం చేస్తాము
ﯞﯟﯠﯡﯢ
92:8
కాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తాడో
ﯣﯤﯥ
92:9
మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో
ﭑﭒﭓ
92:10
అతనికి మేము చెడు కొరకు దారిని సులభం చేస్తాము
ﭔﭕﭖﭗﭘﭙﭚ
92:11
మరియు అతడు నశించి పోయినప్పుడు, అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది
ﭛﭜﭝﭞ
92:12
నిశ్చయంగా, సన్మార్గం చూపడం మా పని
ﭟﭠﭡﭢﭣ
92:13
మరియు నిశ్చయంగా, ఇహపరలోకాల (ఆధిపత్యం) మాకే చెందినది
ﭤﭥﭦﭧ
92:14
కాబట్టి నేను మిమ్మల్ని ప్రజ్వలించే నరకాగ్నిని గురించి హెచ్చరించాను
ﭨﭩﭪﭫﭬ
92:15
పరమ దౌర్భాగ్యుడు తప్ప, మరెవ్వడూ అందులో కాలడు
ﭭﭮﭯﭰ
92:16
ఎవడైతే (సత్యాన్ని) తిరస్కరించి (దాని నుండి) విముఖుడవుతాడో
ﭱﭲﭳ
92:17
కాని దైవభీతి గలవాడు దాని నుండి (ఆ నరకాగ్ని నుండి) దూరంగా ఉంచబడతాడు
ﭴﭵﭶﭷﭸ
92:18
అతడే! ఎవడైతే, పవిత్రుడవటానికి తన ధనం నుండి (ఇతరులకు) ఇస్తాడో
ﭹﭺﭻﭼﭽﭾﭿ
92:19
కాని అది, వారు అతనికి చేసిన ఏ ఉపకారానికి బదులుగా గాక
ﮀﮁﮂﮃﮄﮅ
92:20
కేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అయితే
ﮆﮇﮈ
92:21
మరియు అలాంటి వాడే తప్పక సంతోషిస్తాడు
పవిత్ర ఖురాన్
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







