Wa qaalatil Yahoodu wan Nasaaraa nahnu abnaaa`ul laahi wa ahibbaaa`uh; qul falima yu`azzibukum bizunoobikum bal antum basharum mimmman khalaq; yaghfiru limai yashaaa`u wa yu`azzibu mai yashaaa`; wa lillaahi mulkus samaawaati wal ardi wa maa bainahumaa wa ilaihil maseer
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
మరియు యూదులు మరియు క్రైస్తవులు ఇలా అంటారు: మేము అల్లాహ్ సంతానం మరియు ఆయనకు ప్రియమైన వారము." (వారితో) ఇలా అను: అయితే, ఆయన మీ పాపాలకు మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? అలా కాదు, మీరు కూడ ఆయన పుట్టించిన మానవులలో ఒకరు మాత్రమే! ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు ఆకాశాలలో, భూమిలో మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద సామ్రాజ్యాధి పత్యం అల్లాహ్ దే మరియు ఆయన వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
और नसरानी और यहूदी तो कहते हैं कि हम ही ख़ुदा के बेटे और उसके चहेते हैं (ऐ रसूल) उनसे तुम कह दो (कि अगर ऐसा है) तो फिर तुम्हें तुम्हारे गुनाहों की सज़ा क्यों देता है (तुम्हारा ख्याल लग़ो है) बल्कि तुम भी उसकी मख़लूक़ात से एक बशर हो ख़ुदा जिसे चाहेगा बख़ देगा और जिसको चाहेगा सज़ा देगा आसमान और ज़मीन और जो कुछ उन दोनों के दरमियान में है सब ख़ुदा ही का मुल्क है और सबको उसी की तरफ़ लौट कर जाना है
مِّمَّنْ خَلَقَ (మిమ్మన్ ఖలఖ): ఆయన సృష్టించిన వారిలో.
يَغْفِرُ (యగ్ఫిరు): క్షమిస్తాడు.
لِمَن يَشَاءُ (లిమన్ యషాఉ): తాను కోరిన వారిని.
وَيُعَذِّبُ (వ యుఅజ్జిబు): మరియు శిక్షిస్తాడు.
مَن يَشَاءُ (మన్ యషాఉ): తాను కోరిన వారిని.
مُلْكُ (ముల్కు): ఆధిపత్యం / రాజ్యం.
السَّمَاوَاتِ (అస్-సమావాతి): ఆకాశాలు.
وَالْأَرْضِ (వల్-అర్ది): మరియు భూమి.
وَمَا بَيْنَهُمَا (వ మా బైనహుమా): మరియు వాటి మధ్య ఉన్నవి.
الْمَصِيرُ (అల్-మసీరు): తిరిగి చేరే స్థానం / గమ్యం.
ఆయత్ యొక్క వివరణ:
యూదులు మరియు క్రైస్తవులు తాము అల్లాహ్ కుమారులము మరియు ఆయన ప్రియమైనవారము అని పేర్కొన్నారు. వారు అల్లాహ్కు తమకు ప్రత్యేక సంబంధం ఉందని, వారు ఆయనకు ప్రియమైన సంతానం వంటివారని భావించారు. అయితే ఇది కేవలం వారి అహంకారపూరితమైన వాదన మాత్రమే.
ఓ ప్రవక్తా! వారికి సమాధానం ఇలా చెప్పు: "మీరు నిజంగా అల్లాహ్ ప్రియమైనవారు, ఆయన కుమారులే అయితే, మీ పాపాల కారణంగా ఆయన మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు?" ఎందుకంటే నిజమైన ప్రేమికుడు తన ప్రియమైనవారిని శిక్షించడు. తండ్రి తన కుమారుడిని శిక్షించడు. కానీ మీరు పాపాలు చేసినప్పుడు అల్లాహ్ మిమ్మల్ని శిక్షించాడు, కాబట్టి మీరు ఆయన ప్రత్యేక సంతానం లేదా ప్రియమైనవారు అనే వాదన అబద్ధం.
వాస్తవానికి మీరు అల్లాహ్ సృష్టించిన సాధారణ మనుషులలో భాగం. మీరు మిగిలిన మానవుల వలెనే ఉన్నారు. మంచి చేసిన వారికి మంచి ప్రతిఫలం లభిస్తుంది, చెడు చేసిన వారికి చెడు శిక్ష లభిస్తుంది. అల్లాహ్ తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. ఆకాశాలు, భూమి మరియు వాటి మధ్య ఉన్న సమస్త వస్తువులపై ఆధిపత్యం కేవలం అల్లాహ్కు మాత్రమే చెందుతుంది. చివరికి అందరూ ఆయన వద్దకే తిర
మరియు యూదులు మరియు క్రైస్తవులు ఇలా అంటారు: మేము అల్లాహ్ సంతానం మరియు ఆయనకు ప్రియమైన వారము." (వారితో) ఇలా అను: అయితే, ఆయన మీ పాపాలకు మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? అలా కాదు, మీరు కూడ ఆయన పుట్టించిన మానవులలో ఒకరు మాత్రమే! ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు ఆకాశాలలో, భూమిలో మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద సామ్రాజ్యాధి పత్యం అల్లాహ్ దే మరియు ఆయన వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది
దాని ద్వారా అల్లాహ్! తన ప్రీతిని పొందగోరే వారికి శాంతి పథాలను చూపుతాడు మరియు తన ఆజ్ఞతో వారిని అంధకారం నుండి వెలుగులోకి తెచ్చి వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు
నిశ్చయంగా, మర్యమ్ కుమారుడైన మసీహ్ (క్రీస్తు) యే అల్లాహ్!" అని అనే వారు నిస్సందేహంగా! సత్య తిరస్కారులు. (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: అల్లాహ్ గనక మర్యమ్ కుమారుడైన మసీహ్ (క్రీస్తు) ను అతని తల్లిని మరియు భూమిపై ఉన్న వారందరినీ, నాశనం చేయగోరితే, ఆయనను ఆపగల శక్తి ఎవరికి ఉంది? మరియు ఆకాశాలలోను, భూమిలోను మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద ఆధిపత్యం అల్లాహ్ దే. ఆయన తాను కోరినది సృష్టిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయ గల సమర్ధుడు
మరియు యూదులు మరియు క్రైస్తవులు ఇలా అంటారు: మేము అల్లాహ్ సంతానం మరియు ఆయనకు ప్రియమైన వారము." (వారితో) ఇలా అను: అయితే, ఆయన మీ పాపాలకు మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? అలా కాదు, మీరు కూడ ఆయన పుట్టించిన మానవులలో ఒకరు మాత్రమే! ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు ఆకాశాలలో, భూమిలో మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద సామ్రాజ్యాధి పత్యం అల్లాహ్ దే మరియు ఆయన వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది
ఓ గ్రంథ ప్రజలారా! ప్రవక్తలు రావటం, ఆగి పోయిన కొంత కాలం తరువాత, మీకు అంతా స్పష్టంగా తెలుపటానికి, వాస్తవంగా మా సందేశహరుడు (ముహమ్మద్) మీ వద్దకు వచ్చాడు. మీరు : మా వద్దకు శుభవార్తలు వినిపించేవాడు మరియు హెచ్చరికలు చేసేవాడు ఎవ్వడూ రాలేదు." అని అనకూడదని. నిస్సందేహంగా ఇప్పుడు మీకు శుభవార్తలు వినిపించేవాడు మరియు హెచ్చరికలు చేసేవాడు వచ్చి వున్నాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు
మరియు మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): నా జాతి ప్రజలారా! అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి; ఆయన మీలో నుండి ప్రవక్తలను ఆవిర్భవింపజేశాడు మరియు మిమ్మల్ని సార్వభౌములుగా చేశాడు. మరియు (ఆ కాలంలో) ప్రపంచంలో ఎవ్వరికీ ప్రసాదించని వాటిని (అనుగ్రహాలను) మీకు ప్రసాదించాడు
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.