PDF —
29 వచనం Meccan PDF
Built right in your browser — download starts automatically

సూరా అత్-తక్వీర్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అత్-తక్వీర్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అత్-తక్వీర్ అనువాదం. సూరా అత్-తక్వీర్ (Meccan) 29 వచనం.

← అబససూరా అత్-తక్వీర్ అల్-ఇన్ఫితార్ →


29 వచనం · Meccan · తెలుగు
bismillah
ﭙﭚﭛﭜ
81:1 సూర్యుడు (అంధకారంలో) చుట్టి పోయబడి కాంతిహీనుడైనప్పుడు
ﭝﭞﭟﭠ
81:2 మరియు నక్షత్రాలు (కాంతిని కోల్పోయి) రాలిపోవునప్పుడు
ﭡﭢﭣﭤ
81:3 మరియు పర్వతాలు కదిలించబడినప్పుడు
ﭥﭦﭧﭨ
81:4 మరియు నిండు సూడి ఒంటెలు, నిరపేక్షంగా వదిలివేయబడినప్పుడు
ﭩﭪﭫﭬ
81:5 మరియు క్రూరమృగాలన్నీ ఒకచేట సమకూర్చబడినప్పుడు
ﭭﭮﭯﭰ
81:6 మరియు సముద్రాలు ఉప్పొంగిపోయి నప్పుడు
ﭱﭲﭳﭴ
81:7 మరియు ఆత్మలు (శరీరాలతో) తిరిగి కలుపబడి నప్పుడు
ﭵﭶﭷﭸ
81:8 మరియు సజీవంగా పాతి పెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు
ﭹﭺﭻﭼ
81:9 ఏ అపరాధానికి తాను హత్య చేయబడిందని
ﭽﭾﭿﮀ
81:10 మరియు కర్మపత్రాలు తెరువబడినప్పుడు
ﮁﮂﮃﮄ
81:11 మరియు ఆకాశం ఒలిచి వేయబడినప్పుడు
ﮅﮆﮇﮈ
81:12 మరియు నరకాగ్ని మండించబడినప్పుడు
ﮉﮊﮋﮌ
81:13 మరియు స్వర్గం దగ్గరకు తీసుకురాబడినప్పుడు
ﮍﮎﮏﮐﮑ
81:14 ప్రతి ఆత్మ తాను చేసి తెచ్చిన కర్మలను తెలుసుకుంటుంది
ﮒﮓﮔﮕ
81:15 అలా కాదు! నేను తొలగిపోయే నక్షత్రాల సాక్షిగా చెబుతున్నాను
ﮖﮗﮘ
81:16 (ఏవైతే) వేగంగా తిరుగుతూ కనుమరుగవుతున్నాయో
ﮙﮚﮛﮜ
81:17 మరియు గడచి పోయే రాత్రి సాక్షిగా
ﮝﮞﮟﮠ
81:18 మరియు ప్రకాశించే ఉదయం సాక్షిగా
ﮡﮢﮣﮤﮥ
81:19 నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు
ﮦﮧﮨﮩﮪﮫﮬ
81:20 అతను (జిబ్రీల్) మహా బలశాలి, సింహాసన (అర్ష్) అధిపతి సన్నిధిలో ఉన్నత స్థానం గలవాడు
ﮭﮮﮯﮰ
81:21 అతని ఆజ్ఞలు పాటింపబడతాయి మరియు (అతను) విశ్వసనీయుడు
ﮱﯓﯔﯕ
81:22 మరియు (ఓ ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాడు
ﯖﯗﯘﯙﯚ
81:23 మరియు వాస్తవంగా, అతను ఆ సందేశహరుణ్ణి (జిబ్రీల్ ను) ప్రకాశవంతమైన దిఙ్మండలంలో చూశాడు
ﯛﯜﯝﯞﯟﯠ
81:24 మరియు అతను (ముహమ్మద్) అగోచర జ్ఞానాన్ని ప్రజల నుండి దాచేవాడు కాడు
ﯡﯢﯣﯤﯥﯦ
81:25 మరియు ఇది (ఈ ఖుర్ఆన్) శపించ (బహిష్కరించ) బడిన షైతాన్ వాక్కు కాదు
ﯧﯨﯩ
81:26 మరి మీరు ఎటు పోతున్నారు
ﯪﯫﯬﯭﯮﯯ
81:27 ఇది (ఈ ఖుర్ఆన్) సర్వలోకాలకు ఒక హితోపదేశం
ﯰﯱﯲﯳﯴﯵ
81:28 మీలో, ఋజుమార్గంలో నడవ దలచుకున్న ప్రతివాని కొరకు
ﯶﯷﯸﯹﯺﯻﯼﯽﯾ
81:29 మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers