PDF —
19 వచనం Meccan PDF
Built right in your browser — download starts automatically

సూరా అల్-ఇన్ఫితార్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అల్-ఇన్ఫితార్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-ఇన్ఫితార్ అనువాదం. సూరా అల్-ఇన్ఫితార్ (Meccan) 19 వచనం.



19 వచనం · Meccan · తెలుగు
bismillah
ﭑﭒﭓﭔ
82:1 ఆకాశం చీల్చబడినప్పుడు
ﭕﭖﭗﭘ
82:2 మరియు నక్షత్రాలు చెదిరి పోయినప్పుడు
ﭙﭚﭛﭜ
82:3 మరియు సముద్రాలు పొంగి పొరలి పోయినప్పుడు
ﭝﭞﭟﭠ
82:4 మరియు సమాధులు పెళ్ళగింప (తెరువ) బడినప్పుడు
ﭡﭢﭣﭤﭥﭦ
82:5 ప్రతి వ్యక్తికి తాను చేసి పంపుకున్నది మరియు వెనుక వదలి పెట్టింది అంతా తెలిసి పోతుంది
ﭧﭨﭩﭪﭫﭬﭭ
82:6 ఓ మానవుడా! పరమదాత అయిన నీ ప్రభువును గురించి, ఏ విషయం నిన్ను ఏమరుపాటుకు గురి చేసింది
ﭮﭯﭰﭱﭲ
82:7 ఆయనే నిన్ను సృష్టించాడు, తరువాత ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు మరియు నిన్ను తగిన ప్రమాణంలో రూపొందించాడు
ﭳﭴﭵﭶﭷﭸﭹ
82:8 తాను తలచిన ఆకారంలో నిన్ను మలిచాడు
ﭺﭻﭼﭽﭾ
82:9 అలా కాదు! వాస్తవానికి మీరు (పరలోక) తీర్పును అబద్ధమని తిరస్కరిస్తున్నారు
ﭿﮀﮁﮂ
82:10 మరియు, నిశ్చయంగా! మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండేవారు (దేవదూతలు) ఉన్నారు
ﮃﮄﮅ
82:11 వారు, గౌరవనీయులైన లేఖకులు
ﮆﮇﮈﮉ
82:12 మీరు చేసేదంతా తెలుసుకునేవారు
ﮊﮋﮌﮍﮎ
82:13 నిశ్చయంగా పుణ్యాత్ములు సుఖసంతోషాలలో తేలియాడుతూ ఉంటారు
ﮏﮐﮑﮒﮓ
82:14 మరియు నిశ్చయంగా, దుష్టులు భగభగ మండే నరకాగ్నిలో ఉంటారు
ﮔﮕﮖﮗ
82:15 తీర్పు దినమున వారు అందులో ప్రవేశిస్తారు
ﮘﮙﮚﮛﮜ
82:16 మరియు వారు దాని నుండి ఎంత మాత్రం తప్పించుకోలేరు
ﮝﮞﮟﮠﮡﮢ
82:17 మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది
ﮣﮤﮥﮦﮧﮨﮩ
82:18 అవును మరి! ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది
ﮪﮫﮬﮭﮮﮯﮰﮱﯓﯔﯕ
82:19 ఆ దినమున ఏ మానవునికి కూడా ఇతరునికి ఎలాంటి సహాయం చేసే అధికారం ఉండదు. మరియు ఆ రోజు నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ కే ఉంటుంది

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers