సూరా అత్-తక్వీర్ అరబిక్ మరియు తెలుగు

సూరా అత్-తక్వీర్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (29 వచనం — مكية). అత్-తక్వీర్ వినండి, అత్-తక్వీర్ అనువాదం, అత్-తక్వీర్ mp3, అత్-తక్వీర్ pdf.

సూరా అత్-తక్వీర్ చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
إِذَا الشَّمْسُ كُوِّرَتْ ۝١
📖 అనువాదం వచనం 1
సూర్యుడు (అంధకారంలో) చుట్టి పోయబడి కాంతిహీనుడైనప్పుడు
وَإِذَا النُّجُومُ انكَدَرَتْ ۝٢
📖 అనువాదం వచనం 2
మరియు నక్షత్రాలు (కాంతిని కోల్పోయి) రాలిపోవునప్పుడు
وَإِذَا الْجِبَالُ سُيِّرَتْ ۝٣
📖 అనువాదం వచనం 3
మరియు పర్వతాలు కదిలించబడినప్పుడు
وَإِذَا الْعِشَارُ عُطِّلَتْ ۝٤
📖 అనువాదం వచనం 4
మరియు నిండు సూడి ఒంటెలు, నిరపేక్షంగా వదిలివేయబడినప్పుడు
وَإِذَا الْوُحُوشُ حُشِرَتْ ۝٥
📖 అనువాదం వచనం 5
మరియు క్రూరమృగాలన్నీ ఒకచేట సమకూర్చబడినప్పుడు
وَإِذَا الْبِحَارُ سُجِّرَتْ ۝٦
📖 అనువాదం వచనం 6
మరియు సముద్రాలు ఉప్పొంగిపోయి నప్పుడు
وَإِذَا النُّفُوسُ زُوِّجَتْ ۝٧
📖 అనువాదం వచనం 7
మరియు ఆత్మలు (శరీరాలతో) తిరిగి కలుపబడి నప్పుడు
وَإِذَا الْمَوْءُودَةُ سُئِلَتْ ۝٨
📖 అనువాదం వచనం 8
మరియు సజీవంగా పాతి పెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు
بِأَيِّ ذَنبٍ قُتِلَتْ ۝٩
📖 అనువాదం వచనం 9
ఏ అపరాధానికి తాను హత్య చేయబడిందని
وَإِذَا الصُّحُفُ نُشِرَتْ ۝١٠
📖 అనువాదం వచనం 10
మరియు కర్మపత్రాలు తెరువబడినప్పుడు
وَإِذَا السَّمَاءُ كُشِطَتْ ۝١١
📖 అనువాదం వచనం 11
మరియు ఆకాశం ఒలిచి వేయబడినప్పుడు
وَإِذَا الْجَحِيمُ سُعِّرَتْ ۝١٢
📖 అనువాదం వచనం 12
మరియు నరకాగ్ని మండించబడినప్పుడు
وَإِذَا الْجَنَّةُ أُزْلِفَتْ ۝١٣
📖 అనువాదం వచనం 13
మరియు స్వర్గం దగ్గరకు తీసుకురాబడినప్పుడు
عَلِمَتْ نَفْسٌ مَّا أَحْضَرَتْ ۝١٤
📖 అనువాదం వచనం 14
ప్రతి ఆత్మ తాను చేసి తెచ్చిన కర్మలను తెలుసుకుంటుంది
فَلَا أُقْسِمُ بِالْخُنَّسِ ۝١٥
📖 అనువాదం వచనం 15
అలా కాదు! నేను తొలగిపోయే నక్షత్రాల సాక్షిగా చెబుతున్నాను
الْجَوَارِ الْكُنَّسِ ۝١٦
📖 అనువాదం వచనం 16
(ఏవైతే) వేగంగా తిరుగుతూ కనుమరుగవుతున్నాయో
وَاللَّيْلِ إِذَا عَسْعَسَ ۝١٧
📖 అనువాదం వచనం 17
మరియు గడచి పోయే రాత్రి సాక్షిగా
وَالصُّبْحِ إِذَا تَنَفَّسَ ۝١٨
📖 అనువాదం వచనం 18
మరియు ప్రకాశించే ఉదయం సాక్షిగా
إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ ۝١٩
📖 అనువాదం వచనం 19
నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు
ذِي قُوَّةٍ عِندَ ذِي الْعَرْشِ مَكِينٍ ۝٢٠
📖 అనువాదం వచనం 20
అతను (జిబ్రీల్) మహా బలశాలి, సింహాసన (అర్ష్) అధిపతి సన్నిధిలో ఉన్నత స్థానం గలవాడు
مُّطَاعٍ ثَمَّ أَمِينٍ ۝٢١
📖 అనువాదం వచనం 21
అతని ఆజ్ఞలు పాటింపబడతాయి మరియు (అతను) విశ్వసనీయుడు
وَمَا صَاحِبُكُم بِمَجْنُونٍ ۝٢٢
📖 అనువాదం వచనం 22
మరియు (ఓ ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాడు
وَلَقَدْ رَآهُ بِالْأُفُقِ الْمُبِينِ ۝٢٣
📖 అనువాదం వచనం 23
మరియు వాస్తవంగా, అతను ఆ సందేశహరుణ్ణి (జిబ్రీల్ ను) ప్రకాశవంతమైన దిఙ్మండలంలో చూశాడు
وَمَا هُوَ عَلَى الْغَيْبِ بِضَنِينٍ ۝٢٤
📖 అనువాదం వచనం 24
మరియు అతను (ముహమ్మద్) అగోచర జ్ఞానాన్ని ప్రజల నుండి దాచేవాడు కాడు
وَمَا هُوَ بِقَوْلِ شَيْطَانٍ رَّجِيمٍ ۝٢٥
📖 అనువాదం వచనం 25
మరియు ఇది (ఈ ఖుర్ఆన్) శపించ (బహిష్కరించ) బడిన షైతాన్ వాక్కు కాదు
فَأَيْنَ تَذْهَبُونَ ۝٢٦
📖 అనువాదం వచనం 26
మరి మీరు ఎటు పోతున్నారు
إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ ۝٢٧
📖 అనువాదం వచనం 27
ఇది (ఈ ఖుర్ఆన్) సర్వలోకాలకు ఒక హితోపదేశం
لِمَن شَاءَ مِنكُمْ أَن يَسْتَقِيمَ ۝٢٨
📖 అనువాదం వచనం 28
మీలో, ఋజుమార్గంలో నడవ దలచుకున్న ప్రతివాని కొరకు
وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ ۝٢٩
📖 అనువాదం వచనం 29
మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు
← 80 అత్-తక్వీర్ (81/114) 82 →
చదవండి సూరా అత్-తక్వీర్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

81التكوير At-Takwir 📚 29 వచనం مكية

వచనానికి వచనం – సూరా అత్-తక్వీర్ — 29 వచనం




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers