సూరా అల్-ముతఫ్ఫిఫిన్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)
సూరా అల్-ముతఫ్ఫిఫిన్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-ముతఫ్ఫిఫిన్ అనువాదం. సూరా అల్-ముతఫ్ఫిఫిన్ (Meccan) 36 వచనం.
Related
More సూరా PDF
సూరా అల్-ముతఫ్ఫిఫిన్

ﯖﯗﯘ
83:1
కొలతలలో, తూనికలలో తగ్గించి ఇచ్చే వారికి వినాశముంది
ﯙﯚﯛﯜﯝﯞﯟ
83:2
వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు
ﯠﯡﯢﯣﯤﯥ
83:3
మరియు తాము ప్రజలకు కొలిచి గానీ లేక తూచి గానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు
ﯦﯧﯨﯩﯪﯫ
83:4
ఏమీ? ఇలాంటి వారు తిరిగి బ్రతికించి లేపబడరని భావిస్తున్నారా
ﭑﭒﭓ
83:5
ఒక గొప్ప దినమున
ﭔﭕﭖﭗﭘﭙ
83:6
సర్వ లోకాల ప్రభువు సమక్షంలో ప్రజలు అందరూ నిలబడే రోజు
ﭚﭛﭜﭝﭞﭟﭠ
83:7
అలా కాదు! నిశ్చయంగా, దుష్టుల కర్మపత్రం సిజ్జీనులో ఉంది
ﭡﭢﭣﭤﭥ
83:8
ఆ సిజ్జీన్ అంటే నీవు ఏమనుకుంటున్నావు
ﭦﭧﭨ
83:9
వ్రాసి పెట్టబడిన (చెరగని) గ్రంథం
ﭩﭪﭫﭬ
83:10
సత్యాన్ని తిరస్కరించే వారికి ఆ రోజు వినాశముంది
ﭭﭮﭯﭰﭱ
83:11
వారికే! ఎవరైతే తీర్పుదినాన్ని తిరస్కరిస్తారో
ﭲﭳﭴﭵﭶﭷﭸﭹ
83:12
మరియు మితిమీరి ప్రవర్తించే పాపిష్ఠుడు తప్ప, మరెవ్వడూ దానిని (తీర్పు దినాన్ని) తిరస్కరించడు
ﭺﭻﭼﭽﭾﭿﮀﮁ
83:13
మా సూచనలు (ఆయాత్ లు) అతడికి వినిపించ బడినప్పుడు అతడు: ఇవి పూర్వకాలపు కట్టుకథలే!" అని అంటాడు
ﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋﮌ
83:14
అలా కాదు! వాస్తవానికి వారి హృదయాలకు వారి (దుష్ట) కార్యాల త్రుప్పు పట్టింది
ﮍﮎﮏﮐﮑﮒﮓ
83:15
అంతేకాదు, ఆ రోజు నిశ్చయంగా, వారు తమ ప్రభువు కారుణ్యం నుండి నిరోధింప బడతారు
ﮔﮕﮖﮗﮘ
83:16
తరువాత వారు నిశ్చయంగా, భగభగ మండే నరకాగ్నిలోకి పోతారు
ﮙﮚﮛﮜﮝﮞﮟﮠ
83:17
అప్పుడు వారితో: దేనినైతే మీరు అసత్యమని తిరస్కరిస్తూ వచ్చారో, అది ఇదే!" అని చెప్పబడుతుంది
ﮡﮢﮣﮤﮥﮦﮧ
83:18
అలా కాదు! నిశ్చయంగా, ధర్మనిష్ఠాపరుల (పుణ్యాత్ముల) కర్మపత్రం మహోన్నత గ్రంథం (ఇల్లియ్యూన్)లో ఉంది
ﮨﮩﮪﮫﮬ
83:19
మరి ఆ ఇల్లియ్యూన్ అంటే నీవు ఏమనుకుంటున్నావు
ﮭﮮﮯ
83:20
అది వ్రాసిపెట్టబడిన ఒక గ్రంథం
ﮰﮱﯓ
83:21
దానికి, (అల్లాహ్ కు) సన్నిహితులైన వారు (దేవదూతలు) సాక్ష్యంగా ఉంటారు
ﯔﯕﯖﯗﯘ
83:22
నిశ్చయంగా, పుణ్యాత్ములు సుఖసంతోషాలలో ఉంటారు
ﯙﯚﯛﯜ
83:23
ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గదృశ్యాలను) తిలకిస్తూ
ﯝﯞﯟﯠﯡﯢ
83:24
వారి ముఖాలు సుఖసంతోషాలతో కళకళలాడుతూ ఉండటం నీవు చూస్తావు
ﯣﯤﯥﯦﯧ
83:25
సీలు చేయబడిన నాణ్యమైన మధువు వారికి త్రాగటానికి ఇవ్వబడుతుంది
ﯨﯩﯪﯫﯬﯭﯮﯯ
83:26
దాని చివరి చుక్కలోనూ కస్తూరి సువాసన ఉంటుంది. కాబట్టి దానిని పొందటానికి అపేక్షించే వారంతా ప్రయాస పడాలి
ﯰﯱﯲﯳ
83:27
మరియు దానిలో (ఆ మధువులో) తస్నీమ్ కలుపబడి ఉంటుంది
ﯴﯵﯶﯷﯸ
83:28
అదొక చెలమ, (అల్లాహ్) సాన్నిధ్యం పొందినవారే దాని నుండి త్రాగుతారు
ﯹﯺﯻﯼﯽﯾﯿﰀﰁ
83:29
వాస్తవానికి (ప్రపంచంలో) అపరాధులు విశ్వసించిన వారిని హేళన చేసేవారు
ﰂﰃﰄﰅﰆ
83:30
మరియు వీరు (విశ్వాసులు), వారి (అవిశ్వాసుల) యెదుట నుండి పోయి నప్పుడు, వారు (అవిశ్వాసులు) పరస్పరం కనుసైగలు చేసుకునేవారు
ﰇﰈﰉﰊﰋﰌﰍ
83:31
మరియు (అవిశ్వాసులు) తమ ఇంటి వారి దగ్గరికి పోయినప్పుడు (విశ్వాసులను గురించి) పరిహసిస్తూ మరలేవారు
ﰎﰏﰐﰑﰒﰓﰔ
83:32
మరియు (విశ్వాసులను) చూసినపుడల్లా: నిశ్చయంగా, వీరు దారి తప్పినవారు!" అని అనేవారు
ﰕﰖﰗﰘﰙ
83:33
మరియు వారు (అవిశ్వాసులు) వీరి (విశ్వాసుల) మీద కాపలాదారులుగా పంపబడలేదు
ﭑﭒﭓﭔﭕﭖﭗ
83:34
కాని ఈ రోజు (పునరుత్థాన దినం నాడు) విశ్వసించినవారు, సత్యతిరస్కారులను చూసి నవ్వుతారు
ﭘﭙﭚﭛ
83:35
ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గదృశ్యాలను) తిలకిస్తూ (ఇలా అంటారు)
ﭜﭝﭞﭟﭠﭡﭢ
83:36
ఇక! ఈ సత్యతిరస్కారులకు, వారి చేష్టలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా దొరుకునా
పవిత్ర ఖురాన్
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







