సూరా అల్-ముతఫ్ఫిఫిన్ అరబిక్ మరియు తెలుగు
సూరా అల్-ముతఫ్ఫిఫిన్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (36 వచనం — مكية). అల్-ముతఫ్ఫిఫిన్ వినండి, అల్-ముతఫ్ఫిఫిన్ అనువాదం, అల్-ముతఫ్ఫిఫిన్ mp3, అల్-ముతఫ్ఫిఫిన్ pdf.సూరా అల్-ముతఫ్ఫిఫిన్ చదవండి మరియు వినండి
🎧 వచనం
M
Mishary Rashid Alafasy
✓
Mishary Rashid Alafasy
✓
M
Mahmoud Khalil Al-Husary
✓
Mahmoud Khalil Al-Husary
✓
A
Abdurrahman As-Sudais
✓
Abdurrahman As-Sudais
✓
M
Mohamed Siddiq Al-Minshawi
✓
Mohamed Siddiq Al-Minshawi
✓
A
Abdul Basit Abdul Samad
✓
Abdul Basit Abdul Samad
✓
A
Ali Al-Hudhaify
✓
Ali Al-Hudhaify
✓
A
Ahmed ibn Ali al-Ajamy
✓
Ahmed ibn Ali al-Ajamy
✓
A
Abu Bakr Ash-Shaatree
✓
Abu Bakr Ash-Shaatree
✓
M
Muhammad Ayyoub
✓
Muhammad Ayyoub
✓
A
Abdullah Basfar
✓
Abdullah Basfar
✓
A
Abdullah Al-Juhani
✓
Abdullah Al-Juhani
✓
M
Maher Al Muaiqly
✓
Maher Al Muaiqly
✓
—
x1
الَّذِينَ إِذَا اكْتَالُوا عَلَى النَّاسِ يَسْتَوْفُونَ ٢
📖 అనువాదం
వచనం 2
వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు
وَإِذَا كَالُوهُمْ أَو وَّزَنُوهُمْ يُخْسِرُونَ ٣
📖 అనువాదం
వచనం 3
మరియు తాము ప్రజలకు కొలిచి గానీ లేక తూచి గానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు
أَلَا يَظُنُّ أُولَٰئِكَ أَنَّهُم مَّبْعُوثُونَ ٤
📖 అనువాదం
వచనం 4
ఏమీ? ఇలాంటి వారు తిరిగి బ్రతికించి లేపబడరని భావిస్తున్నారా
يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعَالَمِينَ ٦
📖 అనువాదం
వచనం 6
సర్వ లోకాల ప్రభువు సమక్షంలో ప్రజలు అందరూ నిలబడే రోజు
كَلَّا إِنَّ كِتَابَ الْفُجَّارِ لَفِي سِجِّينٍ ٧
📖 అనువాదం
వచనం 7
అలా కాదు! నిశ్చయంగా, దుష్టుల కర్మపత్రం సిజ్జీనులో ఉంది
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ ١٠
📖 అనువాదం
వచనం 10
సత్యాన్ని తిరస్కరించే వారికి ఆ రోజు వినాశముంది
الَّذِينَ يُكَذِّبُونَ بِيَوْمِ الدِّينِ ١١
📖 అనువాదం
వచనం 11
వారికే! ఎవరైతే తీర్పుదినాన్ని తిరస్కరిస్తారో
وَمَا يُكَذِّبُ بِهِ إِلَّا كُلُّ مُعْتَدٍ أَثِيمٍ ١٢
📖 అనువాదం
వచనం 12
మరియు మితిమీరి ప్రవర్తించే పాపిష్ఠుడు తప్ప, మరెవ్వడూ దానిని (తీర్పు దినాన్ని) తిరస్కరించడు
إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ ١٣
📖 అనువాదం
వచనం 13
మా సూచనలు (ఆయాత్ లు) అతడికి వినిపించ బడినప్పుడు అతడు: ఇవి పూర్వకాలపు కట్టుకథలే!" అని అంటాడు
كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا يَكْسِبُونَ ١٤
📖 అనువాదం
వచనం 14
అలా కాదు! వాస్తవానికి వారి హృదయాలకు వారి (దుష్ట) కార్యాల త్రుప్పు పట్టింది
كَلَّا إِنَّهُمْ عَن رَّبِّهِمْ يَوْمَئِذٍ لَّمَحْجُوبُونَ ١٥
📖 అనువాదం
వచనం 15
అంతేకాదు, ఆ రోజు నిశ్చయంగా, వారు తమ ప్రభువు కారుణ్యం నుండి నిరోధింప బడతారు
ثُمَّ إِنَّهُمْ لَصَالُو الْجَحِيمِ ١٦
📖 అనువాదం
వచనం 16
తరువాత వారు నిశ్చయంగా, భగభగ మండే నరకాగ్నిలోకి పోతారు
ثُمَّ يُقَالُ هَٰذَا الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ ١٧
📖 అనువాదం
వచనం 17
అప్పుడు వారితో: దేనినైతే మీరు అసత్యమని తిరస్కరిస్తూ వచ్చారో, అది ఇదే!" అని చెప్పబడుతుంది
كَلَّا إِنَّ كِتَابَ الْأَبْرَارِ لَفِي عِلِّيِّينَ ١٨
📖 అనువాదం
వచనం 18
అలా కాదు! నిశ్చయంగా, ధర్మనిష్ఠాపరుల (పుణ్యాత్ముల) కర్మపత్రం మహోన్నత గ్రంథం (ఇల్లియ్యూన్)లో ఉంది
يَشْهَدُهُ الْمُقَرَّبُونَ ٢١
📖 అనువాదం
వచనం 21
దానికి, (అల్లాహ్ కు) సన్నిహితులైన వారు (దేవదూతలు) సాక్ష్యంగా ఉంటారు
عَلَى الْأَرَائِكِ يَنظُرُونَ ٢٣
📖 అనువాదం
వచనం 23
ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గదృశ్యాలను) తిలకిస్తూ
تَعْرِفُ فِي وُجُوهِهِمْ نَضْرَةَ النَّعِيمِ ٢٤
📖 అనువాదం
వచనం 24
వారి ముఖాలు సుఖసంతోషాలతో కళకళలాడుతూ ఉండటం నీవు చూస్తావు
يُسْقَوْنَ مِن رَّحِيقٍ مَّخْتُومٍ ٢٥
📖 అనువాదం
వచనం 25
సీలు చేయబడిన నాణ్యమైన మధువు వారికి త్రాగటానికి ఇవ్వబడుతుంది
خِتَامُهُ مِسْكٌ ۚ وَفِي ذَٰلِكَ فَلْيَتَنَافَسِ الْمُتَنَافِسُونَ ٢٦
📖 అనువాదం
వచనం 26
దాని చివరి చుక్కలోనూ కస్తూరి సువాసన ఉంటుంది. కాబట్టి దానిని పొందటానికి అపేక్షించే వారంతా ప్రయాస పడాలి
عَيْنًا يَشْرَبُ بِهَا الْمُقَرَّبُونَ ٢٨
📖 అనువాదం
వచనం 28
అదొక చెలమ, (అల్లాహ్) సాన్నిధ్యం పొందినవారే దాని నుండి త్రాగుతారు
إِنَّ الَّذِينَ أَجْرَمُوا كَانُوا مِنَ الَّذِينَ آمَنُوا يَضْحَكُونَ ٢٩
📖 అనువాదం
వచనం 29
వాస్తవానికి (ప్రపంచంలో) అపరాధులు విశ్వసించిన వారిని హేళన చేసేవారు
وَإِذَا مَرُّوا بِهِمْ يَتَغَامَزُونَ ٣٠
📖 అనువాదం
వచనం 30
మరియు వీరు (విశ్వాసులు), వారి (అవిశ్వాసుల) యెదుట నుండి పోయి నప్పుడు, వారు (అవిశ్వాసులు) పరస్పరం కనుసైగలు చేసుకునేవారు
وَإِذَا انقَلَبُوا إِلَىٰ أَهْلِهِمُ انقَلَبُوا فَكِهِينَ ٣١
📖 అనువాదం
వచనం 31
మరియు (అవిశ్వాసులు) తమ ఇంటి వారి దగ్గరికి పోయినప్పుడు (విశ్వాసులను గురించి) పరిహసిస్తూ మరలేవారు
وَإِذَا رَأَوْهُمْ قَالُوا إِنَّ هَٰؤُلَاءِ لَضَالُّونَ ٣٢
📖 అనువాదం
వచనం 32
మరియు (విశ్వాసులను) చూసినపుడల్లా: నిశ్చయంగా, వీరు దారి తప్పినవారు!" అని అనేవారు
وَمَا أُرْسِلُوا عَلَيْهِمْ حَافِظِينَ ٣٣
📖 అనువాదం
వచనం 33
మరియు వారు (అవిశ్వాసులు) వీరి (విశ్వాసుల) మీద కాపలాదారులుగా పంపబడలేదు
فَالْيَوْمَ الَّذِينَ آمَنُوا مِنَ الْكُفَّارِ يَضْحَكُونَ ٣٤
📖 అనువాదం
వచనం 34
కాని ఈ రోజు (పునరుత్థాన దినం నాడు) విశ్వసించినవారు, సత్యతిరస్కారులను చూసి నవ్వుతారు
عَلَى الْأَرَائِكِ يَنظُرُونَ ٣٥
📖 అనువాదం
వచనం 35
ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గదృశ్యాలను) తిలకిస్తూ (ఇలా అంటారు)
هَلْ ثُوِّبَ الْكُفَّارُ مَا كَانُوا يَفْعَلُونَ ٣٦
📖 అనువాదం
వచనం 36
ఇక! ఈ సత్యతిరస్కారులకు, వారి చేష్టలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా దొరుకునా
చదవండి సూరా అల్-ముతఫ్ఫిఫిన్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో
పవిత్ర ఖురాన్
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers

