సూరా అత్-తారిక్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)
సూరా అత్-తారిక్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అత్-తారిక్ అనువాదం. సూరా అత్-తారిక్ (Meccan) 17 వచనం.
Related
- సూరా అత్-తారిక్ అనువాదంతెలుగు
- సూరా అత్-తారిక్ mp3వినండి
- Quran Index తెలుగు114
More సూరా PDF
సూరా అత్-తారిక్

ﭑﭒﭓ
86:1
ఆకాశం మరియు రాత్రివేళ వచ్చే నక్షత్రం (అత్ తారిఖ్) సాక్షిగా
ﭔﭕﭖﭗﭘ
86:2
రాత్రి వేళ వచ్చేది (అత్ తారిఖ్) అంటే ఏమిటో నీకు ఎలా తెలుస్తుంది
ﭙﭚﭛ
86:3
అదొక అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం
ﭜﭝﭞﭟﭠﭡﭢ
86:4
కనిపెట్టుకొని ఉండేవాడు (దేవదూత) లేకుండా ఏ వ్యక్తి కూడా లేడు
ﭣﭤﭥﭦﭧ
86:5
కావున మానవుడు తాను దేనితో సృష్టించబడ్డాడో గమనించాలి
ﭨﭩﭪﭫﭬ
86:6
అతడు విసర్జించబడే (చిమ్ముకుంటూ వెలువడే) ద్రవపదార్థంతో సృష్టించబడ్డాడు
ﭭﭮﭯﭰﭱﭲ
86:7
అది వెన్ను మరియు రొమ్ము ఎముకల మధ్యభాగం నుండి బయటికి వస్తుంది
ﭳﭴﭵﭶﭷ
86:8
నిశ్చయంగా, ఆయన (సృష్టికర్త), అతనిని మరల బ్రతికించి తేగల సామర్థ్యం గలవాడు
ﭸﭹﭺﭻ
86:9
ఏ రోజయితే రహస్య విషయాల విచారణ జరుగుతుందో
ﭼﭽﭾﭿﮀﮁﮂ
86:10
అప్పుడు అతనికి (మానవునికి) ఎలాంటి శక్తి ఉండదు మరియు ఏ సహాయకుడునూ ఉండడు
ﮃﮄﮅﮆ
86:11
వర్షం కురిపించే ఆకాశం సాక్షిగా
ﮇﮈﮉﮊ
86:12
(చెట్లు మొలకెత్తేటప్పుడు) చీలి పోయే భూమి సాక్షిగా
ﮋﮌﮍﮎ
86:13
నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్, సత్యాసత్యాలను) వేరు పరచే వాక్కు (గీటురాయి)
ﮏﮐﮑﮒ
86:14
మరియు ఇది వృథా కాలక్షేపానికి వచ్చినది కాదు
ﮓﮔﮕﮖ
86:15
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, వారు (నీకు విరుద్ధంగా) కుట్రపన్నుతున్నారు
ﮗﮘﮙ
86:16
మరియు నేను కూడా పన్నాగం పన్నుతున్నాను
ﮚﮛﮜﮝﮞ
86:17
కనుక నీవు సత్యతిరస్కారులకు కొంత వ్యవధి నివ్వు! వారి పట్ల మృదువుగా వ్యవహరించు
పవిత్ర ఖురాన్
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







