సూరా అల్-బురూజ్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)
సూరా అల్-బురూజ్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-బురూజ్ అనువాదం. సూరా అల్-బురూజ్ (Meccan) 22 వచనం.
Related
- సూరా అల్-బురూజ్ అనువాదంతెలుగు
- సూరా అల్-బురూజ్ mp3వినండి
- Quran Index తెలుగు114
More సూరా PDF
సూరా అల్-బురూజ్

ﭛﭜﭝﭞ
85:1
విస్తారమైన తారాగణం గల ఆకాశం సాక్షిగా
ﭟﭠﭡ
85:2
వాగ్దానం చేయబడిన (పునరుత్థాన) దినం సాక్షిగా
ﭢﭣﭤ
85:3
చూచేదాని (దినం) మరియు చూడబడే దాని (దినం) సాక్షిగా
ﭥﭦﭧﭨ
85:4
అగ్ని కందకం (ఉఖూద్) వారు నాశనం చేయబడ్డారు
ﭩﭪﭫﭬ
85:5
ఇంధనంతో తీవ్రంగా మండే అగ్నిని రాజేసేవారు
ﭭﭮﭯﭰﭱ
85:6
వారు దాని (ఆ కందకం) అంచుపై కూర్చొని ఉన్నప్పుడు
ﭲﭳﭴﭵﭶﭷﭸ
85:7
మరియు తాము విశ్వాసుల పట్ల చేసే ఘోర కార్యాలను (సజీవ దహనాలను) తిలకించేవారు
ﭹﭺﭻﭼﭽﭾﭿﮀﮁﮂ
85:8
మరియు వారు విశ్వాసుల పట్ల కసి పెంచుకోవడానికి కారణం - వారు (విశ్వాసులు) సర్వశక్తిమంతుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడైన - అల్లాహ్ ను విశ్వసించడం మాత్రమే
ﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎ
85:9
ఆయనే! ఎవరికైతే భూమ్యాకాశాల ఆధిపత్యం ఉందో! మరియు అల్లాహ్ యే ప్రతిదానికి సాక్షి
ﮏﮐﮑﮒﮓﮔﮕﮖﮗﮘﮙﮚﮛﮜﮝ
85:10
ఎవరైతే విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను హింసిస్తారో, ఆ తరువాత పశ్చాత్తాపంతో క్షమాపణ కోరరో! నిశ్చయంగా, అలాంటి వారికి నరకశిక్ష ఉంటుంది. మరియు వారికి మండే నరకాగ్ని శిక్ష విధించబడుతుంది
ﮞﮟﮠﮡﮢﮣﮤﮥﮦﮧﮨﮩﮪﮫﮬﮭ
85:11
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలుంటాయి. అదే గొప్ప విజయం
ﮮﮯﮰﮱﯓ
85:12
నిశ్చయంగా, నీ ప్రభువు యొక్క పట్టు (శిక్ష) చాలా కఠినమైనది
ﯔﯕﯖﯗﯘ
85:13
నిశ్చయంగా, ఆయనే (సృష్టిని) ఆరంభించేవాడు మరియు ఆయనే (దానిని) మరల ఉనికిలోకి తెచ్చేవాడు
ﯙﯚﯛﯜ
85:14
మరియు ఆయన క్షమాశీలుడు, అమిత వాత్సల్యుడు
ﯝﯞﯟﯠ
85:15
సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించిన వాడు, మహత్త్వపూర్ణుడు
ﯡﯢﯣﯤ
85:16
తాను తలచింది చేయగలవాడు
ﯥﯦﯧﯨﯩ
85:17
ఏమీ? సైన్యాల వారి సమాచారం నీకు అందిందా
ﯪﯫﯬ
85:18
ఫిర్ఔన్ మరియు సమూద్ వారి (సైన్యాల)
ﯭﯮﯯﯰﯱﯲ
85:19
అలా కాదు, సత్యతిరస్కారులు (సత్యాన్ని) తిరస్కరించుటలో నిమగ్నులై ఉన్నారు
ﯳﯴﯵﯶﯷ
85:20
మరియు అల్లాహ్ వారిని వెనుక (ప్రతి దిక్కు) నుండి చుట్టుముట్టి ఉన్నాడు
ﯸﯹﯺﯻﯼ
85:21
వాస్తవానికి, ఇది ఒక దివ్యమైన ఖుర్ఆన్
ﯽﯾﯿﰀ
85:22
సురక్షితమైన ఫలకం (లౌహె మహ్ ఫూజ్) లో (వ్రాయబడి) ఉన్నది
పవిత్ర ఖురాన్
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







