యూనుస్ · 25/109
అనువాదం ఉచ్చారణ — సూరా యూనుస్
وَاللَّهُ يَدْعُو إِلَىٰ دَارِ السَّلَامِ وَيَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ۝٢٥
Wallaahu yad`ooo ilaa daaris salaami wa yahdee mai yashaaa`u ilaa Siraatim Mustaqeem
📖 తెలుగులో
మరియు అల్లాహ్ మిమ్మల్ని శాంతినిలయం (దారుస్సలాం) వైపునకు ఆహ్వానిస్తున్నాడు. మరియు ఆయన తాను కోరిన వానికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు

🎧 వినండి


📜 వచనం 23-27 — సూరా యూనుస్

23فَلَمَّا أَنجَاهُمْ إِذَا هُمْ يَبْغُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ ۗ يَا أَيُّهَا النَّاسُ إِنَّمَا بَغْيُكُمْ عَلَىٰ أَنفُسِكُم ۖ مَّتَاعَ الْحَيَاةِ الدُّنْيَا ۖ ثُمَّ إِلَيْنَا مَرْجِعُكُمْ فَنُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ
కాని, ఆయన వారిని కాపాడిన వెంటనే, వారు భూమిలో అన్యాయంగా దౌర్జన్యం చేయసాగుతారు. ఓ మానవులారా! నిశ్చయంగా, మీ దౌర్జన్యాలు మీకే హాని కలిగిస్తాయి. ఇహలోక జీవితం తాత్కాలిక ఆనందమే. చివరకు మీకు మా వైపునకే మరలి రావలసి ఉన్నది, అప్పుడు మేము, మీరు చేస్తూ ఉండిన కర్మలన్నీ మీకు తెలియజేస్తాము
24إِنَّمَا مَثَلُ الْحَيَاةِ الدُّنْيَا كَمَاءٍ أَنزَلْنَاهُ مِنَ السَّمَاءِ فَاخْتَلَطَ بِهِ نَبَاتُ الْأَرْضِ مِمَّا يَأْكُلُ النَّاسُ وَالْأَنْعَامُ حَتَّىٰ إِذَا أَخَذَتِ الْأَرْضُ زُخْرُفَهَا وَازَّيَّنَتْ وَظَنَّ أَهْلُهَا أَنَّهُمْ قَادِرُونَ عَلَيْهَا أَتَاهَا أَمْرُنَا لَيْلًا أَوْ نَهَارًا فَجَعَلْنَاهَا حَصِيدًا كَأَن لَّمْ تَغْنَ بِالْأَمْسِ ۚ كَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَتَفَكَّرُونَ
వాస్తవానికి ఈ ప్రాపంచిక జీవితాన్ని ఇలా పోల్చవచ్చు: మేము ఆకాశం నుండి నీటిని కురిపించగా దాని నుండి భూమిలో మానవులకు మరియు పశువులకు తినటానికి, వివిధ రకాల చెట్లూ చేమలూ పెరుగుతాయి. అప్పుడు భూమి తన అలంకారంతో వర్ధిల్లుతూ ఉండగా, దాని యజమానులు నిశ్చయంగా, అది తమ వశంలో ఉందనుకుంటారు; అలాంటి సమయంలో అకస్మాత్తుగా రాత్రి పూటనో లేక పగటి పూటనో మా తీర్పు వస్తుంది. అప్పుడు మేము దానిని - నిన్నటి వరకు ఏమీ లేని - కోసివేసిన పంటపొలంగా మార్చివేస్తాము. ఈ విధంగా మేము మా సూచనలను ఆలోచించే ప్రజల కొరకు స్పష్టంగా వివరిస్తాము
25وَاللَّهُ يَدْعُو إِلَىٰ دَارِ السَّلَامِ وَيَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
మరియు అల్లాహ్ మిమ్మల్ని శాంతినిలయం (దారుస్సలాం) వైపునకు ఆహ్వానిస్తున్నాడు. మరియు ఆయన తాను కోరిన వానికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు
26۞ لِّلَّذِينَ أَحْسَنُوا الْحُسْنَىٰ وَزِيَادَةٌ ۖ وَلَا يَرْهَقُ وُجُوهَهُمْ قَتَرٌ وَلَا ذِلَّةٌ ۚ أُولَٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
మంచిపనులు చేసిన వారికి, మంచి ఫలితం దొరుకుతుంది. మరియు ఇంకా ఎక్కువ లభిస్తుంది. మరియు వారి ముఖాలు నల్లబడవు మరియు వారికి అవమానమూ జరుగదు. అలాంటి వారు స్వర్గవాసులు. వారందు శాశ్వతంగా ఉంటారు
27وَالَّذِينَ كَسَبُوا السَّيِّئَاتِ جَزَاءُ سَيِّئَةٍ بِمِثْلِهَا وَتَرْهَقُهُمْ ذِلَّةٌ ۖ مَّا لَهُم مِّنَ اللَّهِ مِنْ عَاصِمٍ ۖ كَأَنَّمَا أُغْشِيَتْ وُجُوهُهُمْ قِطَعًا مِّنَ اللَّيْلِ مُظْلِمًا ۚ أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
మరియు పాపకార్యాలు చేసిన వారికి, వారి పాపాలకు తగినట్టి ప్రతిఫలం లభిస్తుంది మరియు వారిని అవమానం క్రమ్ముకుంటుంది. అల్లాహ్ నుండి వారిని రక్షించేవాడెవ్వడూ ఉండడు. వారి ముఖాలు చీకటి రాత్రి యొక్క నల్లని తెరల వంటి వాటితో కప్పబడి ఉంటాయి. అలాంటి వారు నరకాగ్ని వాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు
యూనుస్ఖురాన్ సూచిక
109వచనం
MeccanRevelation
25వచనం

అనువాదం — యూనుస్ 25

సూరా యూనుస్ వచనం 25 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు అల్లాహ్ మిమ్మల్ని శాంతినిలయం (దారుస్సలాం) వైపునకు ఆహ్వానిస్తున్నాడు. మరియు ఆయన తాను…

సూరా వచనం 25/109 — సూరా యూనుస్ يونس (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా యూనుస్ వినండి, సూరా యూనుస్ అనువాదం, సూరా యూనుస్ mp3, సూరా యూనుస్ pdf. వచనం 23–27. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers