Wa izaa sa alaka `ibaadee `annnee fa innee qareebun ujeebu da`wataddaa`i izaa da`aani falyastajeeboo lee walyu minoo beela `allahum yarshudoon
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
మరియు నా దాసులు, నన్ను గురించి నిన్ను అడిగితే: నేను (వారికి) అతి సమీపంలోనే ఉన్నాను. పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపు విని, జవాబిస్తాను. కాబట్టి వారు సరైన మార్గం పొందటానికి, నా ఆజ్ఞను అనుసరించాలి మరియు నా యందు విశ్వాసం కలిగి ఉంటాలి." అని, చెప్పు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
(ऐ रसूल) जब मेरे बन्दे मेरा हाल तुमसे पूछे तो (कह दो कि) मै उन के पास ही हूँ और जब मुझसे कोई दुआ माँगता है तो मै हर दुआ करने वालों की दुआ (सुन लेता हूँ और जो मुनासिब हो तो) क़ुबूल करता हूँ पस उन्हें चाहिए कि मेरा भी कहना माने) और मुझ पर ईमान लाएँ
فَلْيَسْتَجِيبُوا (ఫల్యస్తజీబూ): వారు నా ఆజ్ఞను పాటించాలి, నాకు విధేయులై ఉండాలి.
يَرْشُدُونَ (యర్షుదూన్): వారు సన్మార్గం పొందుతారు, సరైన మార్గాన్ని కనుగొంటారు.
ఆయత్ వ్యాఖ్యానం:
ఓ ప్రవక్తా! నా దాసులు నీ ద్వారా నా గురించి అడిగితే, వారికి చెప్పు: నేను వారికి చాలా సమీపంలో ఉన్నాను. నేను వారి పరిస్థితులను బాగా ఎరుగుదును, వారి ప్రార్థనలను వింటాను. వారికి ఎటువంటి మధ్యవర్తులు అవసరం లేదు, తమ స్వరాన్ని పెంచి అరవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా నిజాయితీగా, హృదయపూర్వకంగా నన్ను ప్రార్థిస్తే, నేను అతని ప్రార్థనను అంగీకరిస్తాను. కాబట్టి వారు నా ఆజ్ఞలను పాటించాలి, నా నిషేధాలకు దూరంగా ఉండాలి, నా పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇదే వారి ప్రార్థనలకు సమాధానం లభించడానికి ఉత్తమ మార్గం. ఈ విధంగా వారు తమ లౌకిక, ఆధ్యాత్మిక జీవిత విషయాలలో సరైన మార్గాన్ని పొందుతారు.
అల్లాహ్ తన దాసులకు చాలా సమీపంలో ఉన్నాడని ఈ ఆయత్ తెలియజేస్తుంది. ఈ సామీప్యం అల్లాహ్ మహిమకు తగిన విధంగానే ఉంటుంది. ఆయన ప్రార్థనలను వింటాడు, సమాధానమిస్తాడు. ప్రార్థన అనేది అల్లాహ్తో నేరుగా సంభాషించే సాధనం, ఇందులో ఎటువంటి మధ్యవర్తులు అవసరం లేదు.
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
అల్లాహ్ తన దాసులకు చాలా సమీపంలో ఉన్నాడని, ఆయన ప్రార్థనలను వింటాడని తెలుసుకోవడం మనలను ఆయన వైపు ఆకర్షిస్తుంది.
ప్రార్థన చేయడానికి ఎటువంటి మధ్యవర్తులు, పెద్దగా అరవడం, లేదా ప్రత్యేక ఆచారాలు అవసరం లేదు. హృదయపూర్వకంగా, నిజాయితీగా అడిగితే చాలు.
అల్లాహ్ మన ప్రార్థనలను అంగీకరిస్తాడనే విశ్వాసం మన హృదయాలకు శాంతిని, ఆశను ఇస్తుంది.
నిజమైన విజయం, సన్మార్గం అల్లాహ్ ఆజ్ఞలను పాటించడంలో, ఆయనపై విశ్వాసం ఉంచడంలో ఉన్నాయని ఈ ఆయత్ బోధిస్తుంది.
ఈ ఆయత్ ఇస్లాం యొక్క సౌలభ్యాన్ని, అల్లాహ్ కరుణను చూపిస్తుంది. ఆయన ఎప్పుడూ తన దాసుల కోసం సిద్ధంగా ఉన్నాడు, వారు ఆయన వైపు తిరిగితే చాలు.
మరియు నా దాసులు, నన్ను గురించి నిన్ను అడిగితే: నేను (వారికి) అతి సమీపంలోనే ఉన్నాను. పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపు విని, జవాబిస్తాను. కాబట్టి వారు సరైన మార్గం పొందటానికి, నా ఆజ్ఞను అనుసరించాలి మరియు నా యందు విశ్వాసం కలిగి ఉంటాలి." అని, చెప్పు
ఇది (ఈ ఉపవాసం) నిర్ణయించబడిన రోజులకు మాత్రమే. కానీ, మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే, లేక ప్రయాణంలో ఉంటే, వేరే దినాలలో (ఆ ఉపవాసాలు) పూర్తి చేయాలి. కాని దానిని పూర్తి చేయటం దుర్భరమైన వారు పరిహారంగా, ఒక పేదవానికి భోజనం పెట్టాలి. కాని ఎవరైనా సహృదయంతో ఇంకా ఎక్కువ మేలు చేయదలిస్తే, అది అతని మేలుకే! కాని మీరు తెలుసుకో గలిగితే ఉపవాసం ఉండటమే, మీకు ఎంతో ఉత్తమమైనది
రమదాన్ నెల! అందులో దివ్య ఖుర్ఆన్ మానవులకు మార్గదర్శకత్వంగా, అవతరింపజేయబడింది! మరియు అందులో సన్మార్గం చూపే మరియు సత్యాసత్యాలను వేర్పరచే, స్పష్టమైన ఉపదేశాలున్నాయి. కావున మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా (విధిగా) ఉపవాస ముండాలి. కాని వ్యాధిగ్రస్తుడైన వాడు, లేక ప్రయాణంలో ఉన్నవాడు, (ఆ ఉపవాసాలను) వేరే దినాలలో పూర్తి చేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యం చేయగోరుతున్నాడే కానీ, మిమ్మల్ని కష్టపెట్టదలచు కోలేదు. ఇది మీరు ఉపవాస దినాల సంఖ్యను పూర్తి చేయగలగ టానికి మరియు మీకు సన్మార్గం చూపినందుకు, మీరు అల్లాహ్ మహనీయతను (ఘనతను) కొనియాడటానికి మరియు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి
మరియు నా దాసులు, నన్ను గురించి నిన్ను అడిగితే: నేను (వారికి) అతి సమీపంలోనే ఉన్నాను. పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపు విని, జవాబిస్తాను. కాబట్టి వారు సరైన మార్గం పొందటానికి, నా ఆజ్ఞను అనుసరించాలి మరియు నా యందు విశ్వాసం కలిగి ఉంటాలి." అని, చెప్పు
ఉపవాసపు రాత్రులందు మీకు మీ భార్యలతో రతిక్రీడ (రఫస్) ధర్మసమ్మతం చేయబడింది. వారు మీ వస్త్రాలు, మీరు వారి వస్త్రాలు. వాస్తవానికి మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే విషయం అల్లాహ్ కు తెలుసు. కావున ఆయన మీ పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు మరియు మిమ్మల్ని మన్నించాడు. ఇక నుండి మీరు మీ భార్యలతో సంభోగం (బాషిర్) చేయండి మరియు అల్లాహ్ మీ కొరకు వ్రాసిన దానిని కోరండి. మరియు ఉదయకాలపు తెల్లరేఖలు రాత్రి నల్లచారల నుండి స్పష్టపడే వరకు, మీరు తినండి, త్రాగండి. ఆ తరువాత చీకటి పడే వరకూ మీ ఉపవాసాన్ని పూర్తి చెయ్యండి. కాని మస్జిదులలో ఏతెకాఫ్ పాటించేటప్పుడు, మీరు మీ స్త్రీలతో సంభోగించకండి. ఇవి అల్లాహ్ ఏర్పరచిన హద్దులు, కావున ఉల్లంఘించే (ఉద్దేశంతో) వీటిని సమీపించకండి. ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞను ప్రజలకు స్పష్టం చేస్తున్నాడు. బహుశా వారు భయభక్తులు కలిగి ఉంటారని
మరియు మీరు ఒకరి సొమ్మును మరొకరు అన్యాయంగా కబళించకండి మరియు బుద్ధిపూర్వకంగా, అక్రమమైన రీతిలో, ఇతరుల ఆస్తిలో కొంతభాగం తినే దురుద్ధేశంతో, న్యాయాధికారులకు లంచాలు ఇవ్వకండి
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.