అల్-ముమ్తహినా · 3/13
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ముమ్తహినా
لَن تَنفَعَكُمْ أَرْحَامُكُمْ وَلَا أَوْلَادُكُمْ ۚ يَوْمَ الْقِيَامَةِ يَفْصِلُ بَيْنَكُمْ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ۝٣
Lan tanfa`akum arhaamukum wa laaa awlaadukum; yawmal qiyaamati yafsilu bainakum; wallaahu bimaa ta`maloon baseer
📖 తెలుగులో
మీ బంధువులు గానీ, మీ సంతానం గానీ మీకు ఏ విధంగానూ పనికిరారు. ఆయన పునరుత్థాన దినమున మీ మధ్య తీర్పు చేస్తాడు. మరియు అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 1-5 — సూరా అల్-ముమ్తహినా

1يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا عَدُوِّي وَعَدُوَّكُمْ أَوْلِيَاءَ تُلْقُونَ إِلَيْهِم بِالْمَوَدَّةِ وَقَدْ كَفَرُوا بِمَا جَاءَكُم مِّنَ الْحَقِّ يُخْرِجُونَ الرَّسُولَ وَإِيَّاكُمْ ۙ أَن تُؤْمِنُوا بِاللَّهِ رَبِّكُمْ إِن كُنتُمْ خَرَجْتُمْ جِهَادًا فِي سَبِيلِي وَابْتِغَاءَ مَرْضَاتِي ۚ تُسِرُّونَ إِلَيْهِم بِالْمَوَدَّةِ وَأَنَا أَعْلَمُ بِمَا أَخْفَيْتُمْ وَمَا أَعْلَنتُمْ ۚ وَمَن يَفْعَلْهُ مِنكُمْ فَقَدْ ضَلَّ سَوَاءَ السَّبِيلِ
ఓ విశ్వాసులారా! నాకు శత్రువులైన వారిని మరియు మీకు కూడా శత్రువులైన వారిని - వారి మీద ప్రేమ చూపిస్తూ - వారిని మీ స్నేహితులుగా చేసుకోకండి. మరియు వాస్తవానికి వారు మీ వద్దకు వచ్చిన సత్యాన్ని తిరస్కరించారు. మీ ప్రభువైన అల్లాహ్ ను మీరు విశ్వసించినందుకు, వారు ప్రవక్తను మరియు మిమ్మల్ని (మీ నగరం నుండి) వెడలగొట్టారు! ఒకవేళ మీరు నా ప్రసన్నత కోరి నా మార్గంలో ధర్మయుద్ధం కొరకు వెళితే (ఈ సత్యతిరస్కారులను మీ స్నేహితులుగా చేసుకోకండి). వారి పట్ల వాత్సల్యం చూపుతూ మీరు వారికి రహస్యంగా సందేశం పంపుతారా! మీరు దాచేది మరియు వెలిబుచ్చేది, నాకు బాగా తెలుసు. మరియు మీలో ఎవడైతే ఇలా చేస్తాడో, అతడు వాస్తవంగా, ఋజుమార్గం నుండి తప్పిపోయినవాడే
2إِن يَثْقَفُوكُمْ يَكُونُوا لَكُمْ أَعْدَاءً وَيَبْسُطُوا إِلَيْكُمْ أَيْدِيَهُمْ وَأَلْسِنَتَهُم بِالسُّوءِ وَوَدُّوا لَوْ تَكْفُرُونَ
ఒకవేళ వారు మీ మీద ప్రాబల్యం వహిస్తే, వారు మీకు విరోధులవుతారు. మరియు కీడుతో మీ వైపుకు తమ చేతులను మరియు తమ నాలుకలను చాపుతారు. మరియు మీరు కూడా సత్యతిరస్కారులై పోవాలని కోరుతారు
3لَن تَنفَعَكُمْ أَرْحَامُكُمْ وَلَا أَوْلَادُكُمْ ۚ يَوْمَ الْقِيَامَةِ يَفْصِلُ بَيْنَكُمْ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
మీ బంధువులు గానీ, మీ సంతానం గానీ మీకు ఏ విధంగానూ పనికిరారు. ఆయన పునరుత్థాన దినమున మీ మధ్య తీర్పు చేస్తాడు. మరియు అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు
4قَدْ كَانَتْ لَكُمْ أُسْوَةٌ حَسَنَةٌ فِي إِبْرَاهِيمَ وَالَّذِينَ مَعَهُ إِذْ قَالُوا لِقَوْمِهِمْ إِنَّا بُرَآءُ مِنكُمْ وَمِمَّا تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ كَفَرْنَا بِكُمْ وَبَدَا بَيْنَنَا وَبَيْنَكُمُ الْعَدَاوَةُ وَالْبَغْضَاءُ أَبَدًا حَتَّىٰ تُؤْمِنُوا بِاللَّهِ وَحْدَهُ إِلَّا قَوْلَ إِبْرَاهِيمَ لِأَبِيهِ لَأَسْتَغْفِرَنَّ لَكَ وَمَا أَمْلِكُ لَكَ مِنَ اللَّهِ مِن شَيْءٍ ۖ رَّبَّنَا عَلَيْكَ تَوَكَّلْنَا وَإِلَيْكَ أَنَبْنَا وَإِلَيْكَ الْمَصِيرُ
వాస్తవానికి ఇబ్రాహీమ్ మరియు అతనితో ఉన్న వారిలో మీ కొరకు ఒక మంచి ఆదర్శం ఉంది. వారు తమ జాతి వారితో ఇలా అన్నప్పుడు: నిశ్చయంగా, అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే వాటితో మరియు మీతో, మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము మిమ్మల్ని త్యజించాము మరియు మీరు అద్వితీయుడైన అల్లాహ్ ను విశ్వసించనంత వరకు, మాకూ మీకూ మధ్య విరోధం మరియు ద్వేషం ఉంటుంది." ఇక ఇబ్రాహీమ్ తన తండ్రితో: నేను తప్పక నిన్ను క్షమించమని (నా ప్రభువును) వేడుకుంటాను. ఇది తప్ప, నీ కొరకు అల్లాహ్ నుండి మరేమీ పొందే అధికారం నాకు లేదు." అని మాత్రమే అనగలిగాడు. (అల్లాహ్ తో ఇలా ప్రార్థించాడు): ఓ నా ప్రభూ! మేము నిన్నే నమ్ముకున్నాము మరియు నీ వైపునకే పశ్చాత్తాపంతో మరలుతున్నాము మరియు నీ వైపుకే మా గమ్యస్థానముంది
5رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلَّذِينَ كَفَرُوا وَاغْفِرْ لَنَا رَبَّنَا ۖ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ
ఓ మా ప్రభూ! మమ్మల్ని సత్యతిరస్కారుల కొరకు పరీక్షా సాధనంగా చేయకు మరియు ఓ మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా కేవలం, నీవే సర్వశక్తిమంతుడవు, మహా వివేచనాపరుడవు
అల్-ముమ్తహినాఖురాన్ సూచిక
13వచనం
MedinanRevelation
3వచనం

అనువాదం — అల్-ముమ్తహినా 3

సూరా అల్-ముమ్తహినా వచనం 3 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మీ బంధువులు గానీ, మీ సంతానం గానీ మీకు ఏ విధంగానూ పనికిరారు.…

సూరా వచనం 3/13 — సూరా అల్-ముమ్తహినా الممتحنة (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ముమ్తహినా వినండి, సూరా అల్-ముమ్తహినా అనువాదం, సూరా అల్-ముమ్తహినా mp3, సూరా అల్-ముమ్తహినా pdf. వచనం 1–5. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers