PDF —
30 వచనం Meccan PDF
Built right in your browser — download starts automatically

సూరా అల్-ఫజ్ర్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అల్-ఫజ్ర్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-ఫజ్ర్ అనువాదం. సూరా అల్-ఫజ్ర్ (Meccan) 30 వచనం.

← అల్-గాషియాసూరా అల్-ఫజ్ర్ అల్-బలద్ →


30 వచనం · Meccan · తెలుగు
bismillah
ﭤﭥ
89:1 ప్రాంతః కాలం సాక్షిగా
ﭦﭧﭨ
89:2 పది రాత్రుల సాక్షిగా
ﭩﭪﭫ
89:3 సరి బేసీల సాక్షిగా
ﭬﭭﭮﭯ
89:4 గడచిపోయే రాత్రి సాక్షిగా
ﭰﭱﭲﭳﭴﭵﭶ
89:5 వీటిలో బుద్ధిగల వాని కొరకు ఏ ప్రమాణమూ లేదా ఏమిటి
ﭷﭸﭹﭺﭻﭼﭽ
89:6 నీ ప్రభువు ఆద్ (జాతి) వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా
ﭾﭿﮀﮁ
89:7 ఎత్తైన స్థంభాల (భవనాలు గల) ఇరమ్ ప్రజల పట్ల
ﮂﮃﮄﮅﮆﮇﮈ
89:8 వారిలాంటి జాతి భూమిలో ఎన్నడూ సృష్టించబడలేదు
ﮉﮊﮋﮌﮍﮎ
89:9 మరియు లోయలలోని కొండరాళ్ళలో (భవనాలను) తొలిచిన సమూద్ జాతి పట్ల
ﮏﮐﮑﮒ
89:10 మరియు మేకులవాడైన ఫిర్ఔన్ పట్ల
ﮓﮔﮕﮖﮗ
89:11 వారంతా ఆయా దేశాలలో తలబిరుసుతనంతో ప్రవర్తించారు
ﮘﮙﮚﮛ
89:12 మరియు వాటిలో దౌర్జన్యాన్ని రేకెత్తించారు
ﮜﮝﮞﮟﮠﮡ
89:13 కాబట్టి నీ ప్రభువు వారిపైకి అనేక రకాల బాధాకరమైన శిక్షలను పంపాడు
ﮢﮣﮤﮥ
89:14 వాస్తవానికి, నీ ప్రభువు మాటు వేసి ఉన్నాడు (అంతా కనిపెడ్తూ ఉంటాడు)
ﮦﮧﮨﮩﮪﮫﮬﮭﮮﮯﮰﮱ
89:15 అయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ ప్రతిష్టల నిచ్చి అనుగ్రహించి నప్పుడు: నా ప్రభువు నన్ను గౌరవించాడు." అని అంటాడు
ﯓﯔﯕﯖﯗﯘﯙﯚﯛﯜﯝ
89:16 కాని, అతన్ని పరీక్షించటానికి, అతని ఉపాధిని తగ్గించినప్పుడు: నా ప్రభువు నన్ను అవమానించాడు." అని అంటాడు
ﯞﯟﯠﯡﯢﯣﯤ
89:17 అలా కాదు, వాస్తవానికి మీరు అనాథులను ఆదరించరు
ﯥﯦﯧﯨﯩﯪ
89:18 మరియు మీరు పేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు
ﯫﯬﯭﯮﯯ
89:19 మరియు వారసత్వపు ఆస్తిని పేరాశతో అంతా మీరే తినేస్తారు
ﯰﯱﯲﯳﯴ
89:20 మరియు మీరు ధనవ్యామోహంలో దారుణంగా చిక్కుకు పోయారు
ﯵﯶﯷﯸﯹﯺﯻﯼ
89:21 అలా కాదు, భూమి, దంచి పిండిపిండిగా చేయబడినపుడు
ﯽﯾﯿﰀﰁﰂ
89:22 మరియు నీ ప్రభువు (స్వయంగా) వస్తాడు మరియు దేవదూతలు వరుసలలో వస్తారు
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛ
89:23 ఆ రోజు నరకం (ముందుకు) తీసుకు రాబడుతుంది. ఆ రోజు మానవుడు (తన కర్మలన్నీ) జ్ఞప్తికి తెచ్చుకుంటాడు; కాని ఆ రోజు జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల అతనికి కలిగే ప్రయోజనమేమిటీ
ﭜﭝﭞﭟﭠ
89:24 అతడు: అయ్యో! నా పాడుగానూ! నా ఈ జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు కొని ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు
ﭡﭢﭣﭤﭥﭦ
89:25 అయితే, ఆ రోజు, ఆయన (అల్లాహ్) శిక్షించినట్లు, మరెవ్వడూ శిక్షించలేడు
ﭧﭨﭩﭪﭫ
89:26 మరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు
ﭬﭭﭮﭯ
89:27 (సన్మార్గునితో ఇలా అనబడుతుంది): ఓ తృప్తి పొందిన ఆత్మా
ﭰﭱﭲﭳﭴﭵ
89:28 నీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై
ﭶﭷﭸﭹ
89:29 నీవు (పుణ్యాత్ములైన) నా దాసులలో చేరిపో
ﭺﭻﭼ
89:30 మరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers