Wa maa kaana limu`mininw wa laa mu`minatin izaa qadal laahu wa Rasooluhooo amran ai yakoona lahumul khiyaratu min amrihim; wa mai ya`sil laaha wa Rasoolahoo faqad dalla dalaalam mubeenaa
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
మరియు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు, ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు, విశ్వసించిన పురుషునికి గానీ లేక విశ్వసించిన స్త్రీకి గానీ ఆ విషయంలో మరొక నిర్ణయం తీసుకునే హక్కు లేదు. మరియు ఎవడైతే అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికి అవిధేయుడవుతాడో, వాస్తవంగా, అతడు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లే
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
और न किसी ईमानदार मर्द को ये मुनासिब है और न किसी ईमानदार औरत को जब खुदा और उसके रसूल किसी काम का हुक्म दें तो उनको अपने उस काम (के करने न करने) अख़तेयार हो और (याद रहे कि) जिस शख्स ने खुदा और उसके रसूल की नाफरमानी की वह यक़ीनन खुल्लम खुल्ला गुमराही में मुब्तिला हो चुका
قَضَى: నిర్ణయించాడు, ఆజ్ఞాపించాడు, తీర్పు ఇచ్చాడు.
الْخِيَرَةُ: ఎంపిక చేసుకునే అధికారం, ఇష్టం వచ్చినట్లు నిర్ణయించుకోవడం.
ضَلَالًا مُّبِينًا: స్పష్టమైన దారితప్పడం, ప్రత్యక్షంగా తప్పుదారిలో పడటం.
ఆయత్ వ్యాఖ్యానం:
అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏదైనా విషయంలో తీర్పు ఇచ్చినప్పుడు, ఒక విశ్వాసి — పురుషుడైనా, స్త్రీయైనా — తన స్వంత ఇష్టానుసారం నిర్ణయించుకునే అధికారం ఆ విశ్వాసికి ఉండదు. అంటే, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిర్ణయించిన విషయంలో విశ్వాసికి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేదు; వారి ఆజ్ఞను అంగీకరించడమే విశ్వాసి కర్తవ్యం. ఎవరైనా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ధిక్కరించి, వారి ఆజ్ఞకు వ్యతిరేకంగా నడుచుకుంటే, అతను సన్మార్గం నుండి స్పష్టంగా తప్పిపోయాడు. ఇది ఒక విశ్వాసికి ఎంతో హెచ్చరిక మరియు మార్గదర్శకం.
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆజ్ఞాపించిన విషయాలను సంతోషంగా అంగీకరించడం విశ్వాసి లక్షణం.
విశ్వాసి జీవితంలో అల్లాహ్ మరియు ప్రవక్త తీర్పుకే ప్రాధాన్యం ఇవ్వాలి; స్వంత ఇష్టాలను వెనుక ఉంచాలి.
అల్లాహ్ మరియు ప్రవక్త ఆజ్ఞలను ధిక్కరించడం వల్ల స్పష్టమైన నష్టం మరియు దారితప్పడం సంభవిస్తుంది.
ఈ ఆయత్ విశ్వాసికి విధేయత, సమర్పణ మరియు అల్లాహ్ పట్ల భయభక్తులను పెంచుతుంది.
ఇస్లాం ఆదేశాలను ప్రేమతో, విశ్వాసంతో పాటించడం ద్వారా నిజమైన విజయం మరియు శాంతి లభిస్తాయి.
మరియు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు, ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు, విశ్వసించిన పురుషునికి గానీ లేక విశ్వసించిన స్త్రీకి గానీ ఆ విషయంలో మరొక నిర్ణయం తీసుకునే హక్కు లేదు. మరియు ఎవడైతే అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికి అవిధేయుడవుతాడో, వాస్తవంగా, అతడు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లే
మరియు మీ ఇండ్లలో వినిపించబడే అల్లాహ్ ఆయతులను మరియు జ్ఞాన విషయాలను (హదీస్ లను) స్మరిస్తూ ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ అత్యంత సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసిన వాడు
నిశ్చయంగా, ముస్లిం (అల్లాహ్ కు విధేయులైన) పురుషులు మరియు ముస్లిం స్త్రీలు; విశ్వాసులైన (ము`మిన్) పురుషులు మరియు విశ్వాసులైన (ము`మిన్) స్త్రీలు; భక్తిపరులైన పురుషులు మరియు భక్తిపరులైన స్త్రీలు; సత్యవంతులైన పురుషులు మరియు సత్యవంతులైన స్త్రీలు; ఓర్పు గల పురుషులు మరియు ఓర్పు గల స్త్రీలు; వినమ్రత గల పురుషులు మరియు వినమ్రత గల స్త్రీలు; దానశీలురైన పురుషులు మరియు దానశీలురైన స్త్రీలు; ఉపవాసాలు ఉండే పురుషులు మరియు ఉపవాసాలు ఉండే స్త్రీలు; తమ మర్గాంగాలను కాపాడుకునే పురుషులు మరియు (తమ మర్మాంగాలను) కాపాడుకునే స్త్రీలు; మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే స్త్రీలు; ఇలాంటి వారి కొరకు అల్లాహ్ క్షమాభిక్ష మరియు గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు
మరియు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు, ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు, విశ్వసించిన పురుషునికి గానీ లేక విశ్వసించిన స్త్రీకి గానీ ఆ విషయంలో మరొక నిర్ణయం తీసుకునే హక్కు లేదు. మరియు ఎవడైతే అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికి అవిధేయుడవుతాడో, వాస్తవంగా, అతడు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లే
మరియు (ఓ ప్రవక్తా జ్ఞాపకం చేసుకో!) అల్లాహ్ అనుగ్రహించిన మరియు నీవు అనుగ్రహించిన వ్యక్తితో నీవు: నీ భార్యను ఉండనివ్వు (విడిచి పెట్టకు) మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండు." అని అన్నప్పుడు; నీవు అల్లాహ్ బయట పెట్టదలచిన విషయాన్ని, నీ మనస్సులో దాచి ఉంచావు. నీవు ప్రజలకు భయపడ్డావు, వాస్తవానికి నీవు అల్లాహ్ కు భయపడటమే చాలా ఉత్తమమైనది. జైద్, ఆమెతో తన సంబంధాన్ని తన ఇచ్ఛానుసారంగా త్రెంపుకున్న తరువాతనే, మేము ఆమె వివాహం నీతో జరిపించాము. విశ్వాసులకు తమ దత్తపుత్రుల భార్యలతో పెండ్లి చేసుకోవటంలో - వారు తమ భార్యల నుండి తమ ఇష్టానుసారంగా తమ సంబంధం త్రెంపు కున్నప్పుడు - ఏ విధమైన దోషం లేదు. వాస్తవానికి అల్లాహ్ ఆదేశం తప్పక అమలులోకి రావలసిందే
అల్లాహ్ తన కొరకు ధర్మసమ్మతం చేసిన దానిని ప్రవక్త పూర్తి చేస్తే, అతనిపై ఎలాంటి నింద లేదు. ఇంతకు పూర్వం గతించిన వారి విషయంలో కూడా అల్లాహ్ సంప్రదాయం ఇదే. మరియు అల్లాహ్ ఆజ్ఞ, నిర్దేశింపబడిన (తిరుగులేని) శాసనం
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.