Alam tara ilal lazeena nuhoo `anin najwaa summa ya`oodoona limaa nuhoo `anhu wa yatanaajawna bil ismi wal`udwaani wa ma`siyatir rasooli wa izaa jaaa`ooka haiyawka bimaa lam yuhai yika bihil laahu wa yaqooloona fee anfusihim law laa yu`azzibunal laahu bimaa naqool; hasbuhum jahannnamu yaslawnahaa fabi`sal maseer
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా)? రహస్య సమాలోచనల్ని నిషేధించటం జరిగినప్పటికీ! వారు - నిషేధింపబడిన దానినే - మళ్ళీ చేస్తున్నారని? మరియు వారు రహస్యంగా పాపం చేయడం - హద్దులు మీరి ప్రవర్తించడం మరియు ప్రవక్త ఆజ్ఞలను ఉల్లంఘించడం గురించి - సమాలోచనలు చేస్తున్నారని! (ఓ ముహమ్మద్!) నీ వద్దకు వచ్చినపుడు, అల్లాహ్ కూడా నీకు సలాం చేయని విధంగా, వారు నీకు సలాం చేస్తూ, తమలో తాము ఇలా అనుకుంటారు: మేము పలికే మాటలకు, అల్లాహ్ మమ్మల్ని ఎందుకు శిక్షించటం లేదు?" వారికి నరకమే చాలు, వారందులో ప్రవేశిస్తారు. ఎంత ఘోరమైన గమ్యస్థానం
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
क्या तुमने उन लोगों को नहीं देखा जिनको सरगोशियाँ करने से मना किया गया ग़रज़ जिस काम की उनको मुमानिअत की गयी थी उसी को फिर करते हैं और (लुत्फ़ तो ये है कि) गुनाह और (बेजा) ज्यादती और रसूल की नाफरमानी की सरगोशियाँ करते हैं और जब तुम्हारे पास आते हैं तो जिन लफ्ज़ों से ख़ुदा ने भी तुम को सलाम नहीं किया उन लफ्ज़ों से सलाम करते हैं और अपने जी में कहते हैं कि (अगर ये वाक़ई पैग़म्बर हैं तो) जो कुछ हम कहते हैं ख़ुदा हमें उसकी सज़ा क्यों नहीं देता (ऐ रसूल) उनको दोज़ख़ ही (की सज़ा) काफी है जिसमें ये दाख़िल होंगे तो वह (क्या) बुरी जगह है
مَعْصِيَتِ الرَّسُولِ (మఅసియతిర్ రసూల్): ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల అవిధేయత, ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించడం.
حَيَّوْكَ (హయ్యౌక): వారు నీకు అభివాదం చేశారు.
السَّامُ (స్సామ్): మరణం, చావు.
حَسْبُهُمْ (హస్బుహుమ్): వారికి చాలు, వారికి సరిపోతుంది.
يَصْلَوْنَهَا (యస్లౌనహా): వారు దానిలో ప్రవేశించి దాని వేడిని అనుభవిస్తారు.
فَبِئْسَ الْمَصِيرُ (ఫబిఅసల్ మసీర్): ఆ చివరి గమ్యం ఎంత చెడ్డది!
ఆయత్ వ్యాఖ్యానం:
ఓ ప్రవక్తా! నీవు ఆ యూదుల వైపు చూడలేదా? వారు విశ్వాసుల మనస్సులలో సందేహాలు కలిగించే విధంగా రహస్యంగా మాట్లాడటం నుండి వారించబడ్డారు. కానీ వారు ఆ నిషేధాన్ని ఉల్లంఘించి, మళ్ళీ అదే పనికి తిరిగి వస్తున్నారు. వారు పాపం, శత్రుత్వం మరియు ప్రవక్త పట్ల అవిధేయతతో కూడిన రహస్య సంభాషణలు చేసుకుంటున్నారు.
ఓ ప్రవక్తా! వారు నీ దగ్గరకు ఏదైనా పని కోసం వచ్చినప్పుడు, అల్లాహ్ నీకు ఇచ్చిన అభివాదం కాకుండా వేరే విధంగా అభివాదం చేస్తారు. వారు "అస్సాము అలైక" అని అంటారు, అంటే "నీకు మరణం కలగాలి" అని అర్థం. ఇది వారి ద్వేషాన్ని మరియు కపటత్వాన్ని చూపిస్తుంది.
ఇంకా వారు తమ మనస్సులలో ఇలా అనుకుంటారు: "ముహమ్మద్ నిజంగా ప్రవక్త అయితే, మేము ఆయన గురించి ఇలా అంటున్నందుకు అల్లాహ్ మమ్మల్ని ఎందుకు శిక్షించడు?" అని సవాలు చేస్తారు. వారి ఈ అహంకారానికి మరియు దుర్మార్గానికి జవాబుగా, వారికి నరకాగ్ని చాలు. వారు దానిలో ప్రవేశించి దాని తీవ్రమైన వేడిని అనుభవిస్తారు. అది ఎంత చెడ్డ గమ్యస్థానం!
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు మరియు ఉపదేశాలు:
రహస్య కుట్రల నుండి దూరంగా ఉండాలి: విశ్వాసుల మధ్య విభేదాలు, సందేహాలు కలిగించే రహస్య సంభాషణలు చేయడం ఇస్లాంలో నిషేధించబడింది. ఇది సమాజంలో ఐక్యతను దెబ్బతీస్తుంది.
ప్రవక్త పట్ల గౌరవం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల అవిధేయత మరియు అగౌరవం చూపడం తీవ్రమైన పాపం. ఆయన ఆదేశాలను పాటించడం ప్రతి విశ్వాసి కర్తవ్యం.
అల్లాహ్ శిక్ష నుండి ఎవరూ తప్పించుకోలేరు: దుర్మార్గులు ఎంత సవాలు చేసినా, అల్లాహ్ శిక్ష తప్పదు. నరకం వారి కోసం సిద్ధంగా ఉంది. ఇది ప్రతి అవిశ్వాసికి మరియు పాపికి హెచ్చరిక.
ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా)? రహస్య సమాలోచనల్ని నిషేధించటం జరిగినప్పటికీ! వారు - నిషేధింపబడిన దానినే - మళ్ళీ చేస్తున్నారని? మరియు వారు రహస్యంగా పాపం చేయడం - హద్దులు మీరి ప్రవర్తించడం మరియు ప్రవక్త ఆజ్ఞలను ఉల్లంఘించడం గురించి - సమాలోచనలు చేస్తున్నారని! (ఓ ముహమ్మద్!) నీ వద్దకు వచ్చినపుడు, అల్లాహ్ కూడా నీకు సలాం చేయని విధంగా, వారు నీకు సలాం చేస్తూ, తమలో తాము ఇలా అనుకుంటారు: మేము పలికే మాటలకు, అల్లాహ్ మమ్మల్ని ఎందుకు శిక్షించటం లేదు?" వారికి నరకమే చాలు, వారందులో ప్రవేశిస్తారు. ఎంత ఘోరమైన గమ్యస్థానం
అల్లాహ్ వారందరిని మరల బ్రతికించి లేపి, వారు చేసిందంతా వారికి తెలిపే రోజున వారు (తాము చేసిందంతా) మరచిపోయి ఉండవచ్చు, కాని అల్లాహ్ అంతా లెక్కపెట్టి ఉంచుతాడు. మరియు అల్లాహ్ యే ప్రతిదానికి సాక్షి
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, ఆకాశాలలో మరియు భూమిలోనున్న సర్వమూ అల్లాహ్ కు తెలుసునని? ఏ ముగ్గురు కలిసి రహస్య సమాలోచనలు చేస్తూ వున్నా ఆయన నాలుగవ వాడిగా ఉంటాడు. మరియు ఏ అయిదుగురు రహస్య సమాలోచనలు చేస్తూ వున్నా ఆయన ఆరవ వాడిగా ఉంటాడు. మరియు అంతకు తక్కువ మందిగానీ లేక అంతకు ఎక్కువ మంది గానీ ఉన్నా ఆయన వారితో తప్పక ఉంటాడు. వారు ఎక్కడ వున్నా సరే! తరువాత ఆయన పునరుత్థాన దినమున వారు చేసిన కర్మలను వారికి తెలుపుతాడు. నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు
ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా)? రహస్య సమాలోచనల్ని నిషేధించటం జరిగినప్పటికీ! వారు - నిషేధింపబడిన దానినే - మళ్ళీ చేస్తున్నారని? మరియు వారు రహస్యంగా పాపం చేయడం - హద్దులు మీరి ప్రవర్తించడం మరియు ప్రవక్త ఆజ్ఞలను ఉల్లంఘించడం గురించి - సమాలోచనలు చేస్తున్నారని! (ఓ ముహమ్మద్!) నీ వద్దకు వచ్చినపుడు, అల్లాహ్ కూడా నీకు సలాం చేయని విధంగా, వారు నీకు సలాం చేస్తూ, తమలో తాము ఇలా అనుకుంటారు: మేము పలికే మాటలకు, అల్లాహ్ మమ్మల్ని ఎందుకు శిక్షించటం లేదు?" వారికి నరకమే చాలు, వారందులో ప్రవేశిస్తారు. ఎంత ఘోరమైన గమ్యస్థానం
ఓ విశ్వాసులారా! మీరు రహస్య సమాలోచనలు చేస్తే - పాపకార్యాలు, హద్దులు మీరి ప్రవర్తించటం మరియు ప్రవక్త ఆజ్ఞలను ఉల్లంఘించటం గురించి కాకుండా - పుణ్యకార్యాలు మరియు దైవభీతికి సంబంధించిన విషయాలను గురించి మాత్రమే (రహస్య సమాలోచనలు) చేయండి. మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన సన్నిధిలోనే మీరు సమావేశ పరచబడతారు
నిశ్చయంగా, రహస్య సమాలోచన షైతాన్ చేష్టయే. అది విశ్వాసులకు దుఃఖం కలిగించటానికే! కాని అల్లాహ్ అనుమతి లేనిదే అది వారికి ఏ మాత్రం నష్టం కలిగించజాలదు. మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్ మీదే నమ్మకం ఉంచుకోవాలి
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.