PDF —
49 వచనం Meccan PDF
Built right in your browser — download starts automatically

సూరా అత్-తూర్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అత్-తూర్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అత్-తూర్ అనువాదం. సూరా అత్-తూర్ (Meccan) 49 వచనం.



49 వచనం · Meccan · తెలుగు
bismillah
ﮞﮟ
52:1 తూర్ పర్వతం సాక్షిగా
ﮠﮡﮢ
52:2 వ్రాయబడిన గ్రంథం సాక్షిగా
ﮣﮤﮥﮦ
52:3 విప్పబడిన చర్మపత్రం మీద
ﮧﮨﮩ
52:4 చిరకాల సందర్శనాలయం సాక్షిగా
ﮪﮫﮬ
52:5 పైకెత్తబడిన కప్పు (అంతరిక్షం) సాక్షిగా
ﮭﮮﮯ
52:6 ఉప్పొంగే సముద్రం సాక్షిగా
ﮰﮱﯓﯔﯕ
52:7 నిశ్చయంగా, నీ ప్రభువు శిక్ష సంభవించ నున్నది
ﯖﯗﯘﯙﯚ
52:8 దానిని తప్పించేవాడు ఎవ్వడు లేడు
ﯛﯜﯝﯞﯟ
52:9 ఆకాశాలు భయంకరంగా కంపించే రోజు
ﯠﯡﯢﯣ
52:10 మరియు పర్వతాలు దారుణంగా చలించినప్పుడు
ﯤﯥﯦﯧ
52:11 అప్పుడు, ఆ రోజు అసత్యవాదులకు వినాశం ఉంది
ﯨﯩﯪﯫﯬﯭ
52:12 ఎవరైతే వృథా మాటలలో కాలక్షేపం చేస్తూ ఉంటారో
ﯮﯯﯰﯱﯲﯳﯴ
52:13 వారు నరకాగ్నిలోకి నెట్టుతూ త్రోయబడే రోజు
ﯵﯶﯷﯸﯹﯺﯻ
52:14 (వారితో ఇలా అనబడుతుంది): మీరు అసత్యమని నిరాకరిస్తూ వుండిన నరకాగ్ని ఇదే
ﭑﭒﭓﭔﭕﭖﭗ
52:15 ఏమీ? ఇది మంత్రజాలమా? లేక దీనిని మీరు చూడలేక పోతున్నారా
ﭘﭙﭚﭛﭜﭝﭞﭟﭠﭡﭢﭣﭤﭥ
52:16 ఇందులో మీరు కాలుతూ ఉండండి. దానికి మీరు సహనం వహించినా, సహనం వహించక పోయినా అంతా మీకు సమానమే! నిశ్చయంగా, మీ కర్మలకు తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతున్నది
ﭦﭧﭨﭩﭪﭫ
52:17 నిశ్చయంగా, భయభక్తులు గలవారు స్వర్గవనాలలో సుఖసంతోషాలలో ఉంటారు
ﭬﭭﭮﭯﭰﭱﭲﭳﭴ
52:18 వారి ప్రభువు వారికి ప్రసాదించిన వాటిని హాయిగా అనుభవిస్తూ ఉంటారు. మరియు వారి ప్రభువు వారిని భగభగ మండే నరకాగ్ని శిక్ష నుండి కాపాడాడు
ﭵﭶﭷﭸﭹﭺﭻ
52:19 (వారితో ఇలా అనబడుతుంది): మీరు చేస్తూ వుండిన కర్మలకు ఫలితంగా హాయిగా తినండి త్రాగండి
ﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄ
52:20 వారు వరుసగా వేయబడిన ఆసనాల మీద, దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. మరియు మేము అందమైన పెద్ద పెద్ద కన్నులు గల సుందరీమణులతో వారి వివాహం చేయిస్తాము
ﮅﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎﮏﮐﮑﮒﮓﮔﮕﮖﮗﮘﮙ
52:21 మరియు ఎవరైతే విశ్వసిస్తారో మరియు వారి సంతానంవారు విశ్వాసంలో వారిని అనుసరిస్తారో! అలాంటి వారిని వారి సంతానంతో (స్వర్గంలో) కలుపుతాము. మరియు వారి కర్మలలో వారికి ఏ మాత్రం నష్టం కలిగించము. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానికి తాకట్టుగా ఉంటాడు
ﮚﮛﮜﮝﮞﮟ
52:22 మరియు మేము వారికి, వారు కోరే ఫలాలను మరియు మాంసాన్ని పుష్కలంగా ప్రసాదిస్తాము
ﮠﮡﮢﮣﮤﮥﮦﮧﮨ
52:23 అందులో (ఆ స్వర్గంలో) వారు ఒకరి కొకరు (మధు) పాత్ర మార్చుకుంటూ ఉంటారు; దాన్ని (త్రాగటం) వల్ల వారు వ్యర్థపు మాటలు మాట్లాడరు మరియు పాపాలు చేయరు
ﮩﮪﮫﮬﮭﮮﮯﮰﮱ
52:24 మరియు దాచబడిన ముత్యాల వంటి బాలురు, వారి సేవ కొరకు వారి చుట్టు ప్రక్కలలో తిరుగుతూ ఉంటారు
ﯓﯔﯕﯖﯗﯘ
52:25 మరియు వారు ఒకరి వైపుకొకరు మరలి పరస్పరం (తమ గతించిన జీవితాలను గురించి) మాట్లాడుకుంటూ ఉంటారు
ﯙﯚﯛﯜﯝﯞﯟﯠ
52:26 వారు ఇలా అంటారు: వాస్తవానికి మనం ఇంతకు పూర్వం మన కుటుంబం వారి మధ్య ఉన్నప్పుడు (అల్లాహ్ శిక్షకు) భయపడుతూ ఉండేవారము
ﯡﯢﯣﯤﯥﯦﯧ
52:27 కావున నిశ్చయంగా, అల్లాహ్ మన మీద కనికరం చూపాడు మరియు మమ్ము దహించే గాలుల శిక్ష నుండి కాపాడాడు
ﯨﯩﯪﯫﯬﯭﯮﯯﯰﯱﯲ
52:28 నిశ్చయంగా, మనం ఇంతకు పూర్వం ఆయననే ప్రార్థిస్తూ ఉండేవారము. నిశ్చయంగా, ఆయన మహోపకారి, అపార కరుణా ప్రదాత
ﯳﯴﯵﯶﯷﯸﯹﯺﯻ
52:29 కావున (ఓ ప్రవక్తా!) నీవు హితోపదేశం చేస్తూ వుండు. నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు జ్యోతిష్కుడవు కావు మరియు పిచ్చివాడవూ కావు
ﯼﯽﯾﯿﰀﰁﰂﰃ
52:30 లేదా? వారు: ఇతను ఒక కవి, ఇతని వినాశకాలం కోసం మేము ఎదురు చూస్తున్నాము. అని అంటున్నారా
ﰄﰅﰆﰇﰈﰉﰊ
52:31 వారితో ఇలా అను: మీరు ఎదురు చూస్తూ ఉండండి, నిశ్చయంగా, నేను కూడా మీతో పాటు ఎదురు చూస్తూ ఉంటాను
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚ
52:32 ఏమీ? వారి బుద్ధులు వారికి ఇవే ఆజ్ఞాపిస్తున్నాయా? లేక వారు తలబిరుసుతనం గల జనులా
ﭛﭜﭝﭞﭟﭠﭡﭢ
52:33 ఏమీ? వారు: ఇతనే, దీనిని (ఈ సందేశాన్ని) కల్పించుకున్నాడు" అని అంటున్నారా? అలా కాదు, వారు అసలు విశ్వసించ దలుచుకోలేదు
ﭣﭤﭥﭦﭧﭨﭩ
52:34 వారు సత్యవంతులే అయితే దీని వంటి ఒక వచనాన్ని (రచించి) తెమ్మను
ﭪﭫﭬﭭﭮﭯﭰﭱﭲ
52:35 వారు ఏ (సృష్టికర్త) లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా
ﭳﭴﭵﭶﭷﭸﭹﭺﭻ
52:36 లేక వారు ఆకాశాలను మరియు భూమిని సృష్టించారా? అలా కాదు, అసలు వారికి విశ్వాసం లేదు
ﭼﭽﭾﭿﮀﮁﮂﮃ
52:37 వారి దగ్గర నీ ప్రభువు కోశాగారాలు ఏవైనా ఉన్నాయా? లేక వారు వాటికి అధికారులా
ﮄﮅﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎ
52:38 వారి దగ్గర నిచ్చెన ఏదైనా ఉందా? దానితో పైకెక్కి వారు (దేవదూతల మాటలు) వినటానికి? అలా అయితే! వారిలో ఎవడైతే విన్నాడో, అతనిని స్పష్టమైన నిదర్శనాన్ని తెమ్మను
ﮏﮐﮑﮒﮓﮔ
52:39 ఆయన (అల్లాహ్) కు కూతుళ్ళూ మరియు మీకేమో కుమారులా
ﮕﮖﮗﮘﮙﮚﮛﮜ
52:40 (ఓ ముహమ్మద్!) నీవు వారితో ఏమైనా ప్రతిఫలం అడుగుతున్నావా? వారు ఋణభారంతో అణిగి పోవటానికి
ﮝﮞﮟﮠﮡﮢ
52:41 లేక వారి దగ్గర అగోచర విషయపు జ్ఞానముందా? వారు దానిని వ్రాసి పెట్టారా
ﮣﮤﮥﮦﮧﮨﮩﮪﮫ
52:42 లేక వారేదైనా పన్నాగం పన్నదలచారా? కాని ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో, వారే పన్నాగానికి గురి అవుతారు
ﮬﮭﮮﮯﮰﮱﯓﯔﯕﯖﯗ
52:43 లేక వారికి అల్లాహ్ గాకుండా మరొక ఆరాధ్య దేవుడు ఉన్నాడా? వారు కల్పించే భాగస్వాములకు అల్లాహ్ అతీతుడు
ﯘﯙﯚﯛﯜﯝﯞﯟﯠﯡ
52:44 ఒకవేళ వారు ఆకాశపు ఒక తునకను రాలి పడటం చూసినా: ఇవి దట్టమైన మేఘాలు!" అని అనేవారు
ﯢﯣﯤﯥﯦﯧﯨﯩ
52:45 కావున వారు తమ (తీర్పు) దినాన్ని దర్శించే వరకు వారిని వదిలి పెట్టు. అప్పుడు వారు భీతితో మూర్ఛపోయి పడి పోతారు
ﯪﯫﯬﯭﯮﯯﯰﯱﯲﯳ
52:46 ఆరోజు వారి పన్నాగం వారికి ఏ మాత్రం పనికి రాదు. మరియు వారికి ఎలాంటి సహాయం కూడా లభించదు
ﯴﯵﯶﯷﯸﯹﯺﯻﯼﯽﯾ
52:47 మరియు నిశ్చయంగా, దుర్మార్గానికి పాల్పడిన వారికి, ఇదే గాక మరొక శిక్ష కూడా ఉంది, కాని వారిలో చాలా మందికి అది తెలియదు
ﯿﰀﰁﰂﰃﰄﰅﰆﰇﰈﰉﰊ
52:48 కావున (ఓ ముహమ్మద్!) నీవు, నీ ప్రభువు ఆజ్ఞ వచ్చే వరకు సహనం వహించు. నిశ్చయంగా, నీవు మా దృష్టిలో ఉన్నావు. మరియు నీవు నిద్ర నుండి లేచినపుడు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు, ఆయన స్తోత్రం చెయ్యి
ﰋﰌﰍﰎﰏﰐ
52:49 మరియు రాత్రి వేళలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు మరియు నక్షత్రాలు అస్తమించే వేళలో కూడాను

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers