సూరా అల్-బురూజ్ అరబిక్ మరియు తెలుగు

సూరా అల్-బురూజ్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (22 వచనం — مكية). అల్-బురూజ్ వినండి, అల్-బురూజ్ అనువాదం, అల్-బురూజ్ mp3, అల్-బురూజ్ pdf.

సూరా అల్-బురూజ్ చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
وَالسَّمَاءِ ذَاتِ الْبُرُوجِ ۝١
📖 అనువాదం వచనం 1
విస్తారమైన తారాగణం గల ఆకాశం సాక్షిగా
وَالْيَوْمِ الْمَوْعُودِ ۝٢
📖 అనువాదం వచనం 2
వాగ్దానం చేయబడిన (పునరుత్థాన) దినం సాక్షిగా
وَشَاهِدٍ وَمَشْهُودٍ ۝٣
📖 అనువాదం వచనం 3
చూచేదాని (దినం) మరియు చూడబడే దాని (దినం) సాక్షిగా
قُتِلَ أَصْحَابُ الْأُخْدُودِ ۝٤
📖 అనువాదం వచనం 4
అగ్ని కందకం (ఉఖూద్) వారు నాశనం చేయబడ్డారు
النَّارِ ذَاتِ الْوَقُودِ ۝٥
📖 అనువాదం వచనం 5
ఇంధనంతో తీవ్రంగా మండే అగ్నిని రాజేసేవారు
إِذْ هُمْ عَلَيْهَا قُعُودٌ ۝٦
📖 అనువాదం వచనం 6
వారు దాని (ఆ కందకం) అంచుపై కూర్చొని ఉన్నప్పుడు
وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِالْمُؤْمِنِينَ شُهُودٌ ۝٧
📖 అనువాదం వచనం 7
మరియు తాము విశ్వాసుల పట్ల చేసే ఘోర కార్యాలను (సజీవ దహనాలను) తిలకించేవారు
وَمَا نَقَمُوا مِنْهُمْ إِلَّا أَن يُؤْمِنُوا بِاللَّهِ الْعَزِيزِ الْحَمِيدِ ۝٨
📖 అనువాదం వచనం 8
మరియు వారు విశ్వాసుల పట్ల కసి పెంచుకోవడానికి కారణం - వారు (విశ్వాసులు) సర్వశక్తిమంతుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడైన - అల్లాహ్ ను విశ్వసించడం మాత్రమే
الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ ۝٩
📖 అనువాదం వచనం 9
ఆయనే! ఎవరికైతే భూమ్యాకాశాల ఆధిపత్యం ఉందో! మరియు అల్లాహ్ యే ప్రతిదానికి సాక్షి
إِنَّ الَّذِينَ فَتَنُوا الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ثُمَّ لَمْ يَتُوبُوا فَلَهُمْ عَذَابُ جَهَنَّمَ وَلَهُمْ عَذَابُ الْحَرِيقِ ۝١٠
📖 అనువాదం వచనం 10
ఎవరైతే విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను హింసిస్తారో, ఆ తరువాత పశ్చాత్తాపంతో క్షమాపణ కోరరో! నిశ్చయంగా, అలాంటి వారికి నరకశిక్ష ఉంటుంది. మరియు వారికి మండే నరకాగ్ని శిక్ష విధించబడుతుంది
إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۚ ذَٰلِكَ الْفَوْزُ الْكَبِيرُ ۝١١
📖 అనువాదం వచనం 11
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలుంటాయి. అదే గొప్ప విజయం
إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ ۝١٢
📖 అనువాదం వచనం 12
నిశ్చయంగా, నీ ప్రభువు యొక్క పట్టు (శిక్ష) చాలా కఠినమైనది
إِنَّهُ هُوَ يُبْدِئُ وَيُعِيدُ ۝١٣
📖 అనువాదం వచనం 13
నిశ్చయంగా, ఆయనే (సృష్టిని) ఆరంభించేవాడు మరియు ఆయనే (దానిని) మరల ఉనికిలోకి తెచ్చేవాడు
وَهُوَ الْغَفُورُ الْوَدُودُ ۝١٤
📖 అనువాదం వచనం 14
మరియు ఆయన క్షమాశీలుడు, అమిత వాత్సల్యుడు
ذُو الْعَرْشِ الْمَجِيدُ ۝١٥
📖 అనువాదం వచనం 15
సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించిన వాడు, మహత్త్వపూర్ణుడు
فَعَّالٌ لِّمَا يُرِيدُ ۝١٦
📖 అనువాదం వచనం 16
తాను తలచింది చేయగలవాడు
هَلْ أَتَاكَ حَدِيثُ الْجُنُودِ ۝١٧
📖 అనువాదం వచనం 17
ఏమీ? సైన్యాల వారి సమాచారం నీకు అందిందా
فِرْعَوْنَ وَثَمُودَ ۝١٨
📖 అనువాదం వచనం 18
ఫిర్ఔన్ మరియు సమూద్ వారి (సైన్యాల)
بَلِ الَّذِينَ كَفَرُوا فِي تَكْذِيبٍ ۝١٩
📖 అనువాదం వచనం 19
అలా కాదు, సత్యతిరస్కారులు (సత్యాన్ని) తిరస్కరించుటలో నిమగ్నులై ఉన్నారు
وَاللَّهُ مِن وَرَائِهِم مُّحِيطٌ ۝٢٠
📖 అనువాదం వచనం 20
మరియు అల్లాహ్ వారిని వెనుక (ప్రతి దిక్కు) నుండి చుట్టుముట్టి ఉన్నాడు
بَلْ هُوَ قُرْآنٌ مَّجِيدٌ ۝٢١
📖 అనువాదం వచనం 21
వాస్తవానికి, ఇది ఒక దివ్యమైన ఖుర్ఆన్
فِي لَوْحٍ مَّحْفُوظٍ ۝٢٢
📖 అనువాదం వచనం 22
సురక్షితమైన ఫలకం (లౌహె మహ్ ఫూజ్) లో (వ్రాయబడి) ఉన్నది
← 84 అల్-బురూజ్ (85/114) 86 →
చదవండి సూరా అల్-బురూజ్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

85البروج Al-Buruj 📚 22 వచనం مكية

వచనానికి వచనం – సూరా అల్-బురూజ్ — 22 వచనం




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers