PDF —
20 వచనం Meccan PDF
Built right in your browser — download starts automatically

సూరా అల్-బలద్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అల్-బలద్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-బలద్ అనువాదం. సూరా అల్-బలద్ (Meccan) 20 వచనం.



20 వచనం · Meccan · తెలుగు
bismillah
ﭽﭾﭿﮀﮁ
90:1 కాదు, నేను ఈ నగరం (మక్కా) సాక్షిగా (అంటున్నాను)
ﮂﮃﮄﮅﮆ
90:2 మరియు నీకు ఈ నగరంలో (మక్కాలో) స్వేచ్ఛ ఉంది
ﮇﮈﮉﮊ
90:3 మరియు తండ్రి (మూలపురుషుడు) మరియు అతని సంతానం సాక్షిగా
ﮋﮌﮍﮎﮏﮐ
90:4 వాస్తవానికి, మేము మానవుణ్ణి శ్రమజీవిగా పుట్టించాము
ﮑﮒﮓﮔﮕﮖﮗ
90:5 ఏమిటి? తనను ఎవ్వడూ వశపరచుకో లేడని అతడు భావిస్తున్నాడా
ﮘﮙﮚﮛﮜ
90:6 అతడు: నేను విపరీత ధనాన్ని ఖర్చు పెట్టాను!" అని అంటాడు
ﮝﮞﮟﮠﮡﮢ
90:7 ఏమిటి? తనను ఎవ్వడూ చూడటం లేదని అతడు భావిస్తున్నాడా
ﮣﮤﮥﮦﮧ
90:8 ఏమిటి? మేము అతనికి రెండు కళ్ళు ఇవ్వలేదా
ﮨﮩﮪ
90:9 మరియు నాలుకను మరియు రెండు పెదవులను
ﮫﮬﮭ
90:10 మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము
ﮮﮯﮰﮱ
90:11 కాని అతడు కష్టతరమైన ఊర్ధ్వ గమనానికి సాహసించలేదు
ﯓﯔﯕﯖﯗ
90:12 మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా
ﯘﯙﯚ
90:13 అది ఒకని మెడను (బానిసత్వం నుండి) విడిపించడం
ﯛﯜﯝﯞﯟﯠﯡ
90:14 లేదా! (స్వయంగా) ఆకలి గొని ఉన్న రోజు కూడా (ఇతరులకు) అన్నం పెట్టడం
ﯢﯣﯤﯥ
90:15 సమీప అనాథునికి గానీ
ﯦﯧﯨﯩﯪ
90:16 లేక, దిక్కులేని నిరుపేదకు గానీ
ﯫﯬﯭﯮﯯﯰﯱﯲﯳﯴ
90:17 మరియు విశ్వసించి, సహనాన్ని బోధించేవారిలో! మరియు కరుణను ఒకరి కొకరు బోధించుకునే వారిలో చేరిపోవడం
ﯵﯶﯷﯸ
90:18 ఇలాంటి వారే కుడిపక్షం వారు
ﭑﭒﭓﭔﭕﭖﭗ
90:19 ఇక మా సందేశాలను తిరస్కరించిన వారు, ఎడమ పక్షానికి చెందినవారు
ﭘﭙﭚﭛ
90:20 వారిని నరకాగ్ని చుట్టుకుంటుంది

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers