PDF —
15 వచనం Meccan PDF
Built right in your browser — download starts automatically

సూరా అష్-షమ్స్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అష్-షమ్స్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అష్-షమ్స్ అనువాదం. సూరా అష్-షమ్స్ (Meccan) 15 వచనం.

← అల్-బలద్సూరా అష్-షమ్స్ అల్-లైల్ →


15 వచనం · Meccan · తెలుగు
bismillah
ﭜﭝﭞ
91:1 సూర్యుని మరియు దాని ఎండ సాక్షిగా
ﭟﭠﭡﭢ
91:2 దాని వెనుక వచ్చే చంద్రుని సాక్షిగా
ﭣﭤﭥﭦ
91:3 ప్రకాశించే పగటి సాక్షిగా
ﭧﭨﭩﭪ
91:4 దానిని క్రమ్ముకునే, రాత్రి సాక్షిగా
ﭫﭬﭭﭮ
91:5 ఆకాశం మరియు దానిని నిర్మించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా
ﭯﭰﭱﭲ
91:6 భూమి మరియు దానిని విస్తరింపజేసిన ఆయన సాక్షిగా
ﭳﭴﭵﭶ
91:7 మానవ ఆత్మ మరియు దానిని తీర్చిదిద్దిన ఆయన సాక్షిగా
ﭷﭸﭹﭺ
91:8 ఆ తరువాత ఆయనే దానికి దుష్టతనాన్ని మరియు దైవభీతిని తెలియజేశాడు
ﭻﭼﭽﭾﭿ
91:9 వాస్తవానికి తన ఆత్మను శుద్ధపరచుకున్నవాడే సఫలుడవుతాడు
ﮀﮁﮂﮃﮄ
91:10 మరియు వాస్తవానికి దానిని అణగ ద్రొక్కిన వాడే విఫలుడవుతాడు
ﮅﮆﮇﮈ
91:11 సమూద్ జాతి తలబిరుసుతనంతో (ప్రవక్తను) అసత్యవాదుడవని తిరస్కరించింది; తమలోని పరమ దుష్టుడు (ఆ దుష్కార్యం చేయటానికి) లేచినప్పుడు
ﮉﮊﮋﮌ
91:12 అల్లాహ్ సందేశహరుడు (సాలిహ్) వారితో: ఈ ఆడ ఒంటె అల్లాహ్ కు చెందింది. కాబట్టి దీనిని (నీళ్ళు) త్రాగనివ్వండి!" అని అన్నాడు
ﮍﮎﮏﮐﮑﮒﮓﮔ
91:13 అయినా వారు అతని (సాలిహ్) మాటను అబద్ధమని తిరస్కరించారు. మరియు దాని (ఆ ఒంటె) వెనక మోకాలి నరాన్ని కోసి, కుంటిదాన్ని చేసి చంపారు
ﮕﮖﮗﮘﮙﮚﮛﮜ
91:14 కాబట్టి వారి ప్రభువు వారి పాపానికి పర్యవసానంగా వారి మీద మహా విపత్తును పంపి వారందరినీ నాశనం చేశాడు
ﮝﮞﮟﮠ
91:15 మరియు ఆయన (అల్లాహ్) దాని పర్యవసానాన్ని గురించి భయపడలేదు

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers