అల్-బఖరా · 255/286
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-బఖరా
اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ ۚ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ ۚ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ ۖ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ ۚ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ ۖ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا ۚ وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ ۝٢٥٥
Allahu laaa ilaaha illaa Huwal Haiyul Qaiyoom; laa taakhuzuhoo sinatunw wa laa nawm; lahoo maa fissamaawaati wa maa fil ard; man zal lazee yashfa`u indahooo illaa bi-iznih; ya`lamu maa baina aydeehim wa mww khalfahum wa laa yuheetoona bishai`im min `ilmihee illaa bimaa shaaa`; wasi`a Kursiyyuhus samaawaati wal arda wa laa ya`ooduho hifzuhumaa; wa Huwal Aliyyul `Azeem
📖 తెలుగులో
అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు. ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో - ఆయన అనుజ్ఞ లేకుండా - సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందున్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్ఠించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00
📜

అనువాదం — Tafsir

  1. కఠిన పదాల అర్థాలు:

* اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ: అల్లాహ్ – ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు.

* الْحَيُّ: శాశ్వతంగా సజీవంగా ఉన్నవాడు, మరణం లేనివాడు.

* الْقَيُّومُ: స్వయంగా నిలిచి, సమస్త సృష్టిని నిలబెట్టేవాడు, నిర్వహించేవాడు.

* سِنَةٌ: నిద్ర ముందు వచ్చే తూగు, మగత.

* نَوْمٌ: గాఢ నిద్ర.

* كُرْسِيُّهُ: ఆయన కుర్సీ (సింహాసనం వంటిది) – దాని నిజ స్వరూపం అల్లాహ్‌కే తెలుసు.

* يَئُودُهُ: ఆయనకు భారంగా ఉండదు, అలసట కలిగించదు.

  1. ఆయత్ వ్యాఖ్యానం:

అల్లాహ్ తప్ప వేరే ఎవరూ ఆరాధనకు అర్హులు కారు. ఆయన శాశ్వత జీవి, ఎప్పటికీ సజీవంగా ఉంటాడు, మరణం అనేది ఆయనకు లేదు. ఆయనే స్వయంగా నిలిచి ఉన్నవాడు, సమస్త సృష్టిని నిలబెట్టేవాడు, నిర్వహించేవాడు. సమస్త జీవులు ఆయనపై ఆధారపడి ఉన్నాయి, కానీ ఆయన ఎవరిపైనా ఆధారపడడు.

ఆయనకు మగత కానీ, గాఢ నిద్ర కానీ రావు. ఆయన సంపూర్ణ జీవుడు, సంపూర్ణ నిర్వాహకుడు కాబట్టి నిద్ర లేదా అలసట అనేది ఆయనను చేరదు. ఆకాశాలలో ఉన్నవి, భూమిలో ఉన్నవి అన్నీ ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ఆయన అనుమతి లేకుండా ఎవరూ ఆయన వద్ద సిఫారసు చేయలేరు. సిఫారసు చేసేవారు కూడా ఆయన అనుమతితోనే మాట్లాడగలరు.

ఆయన తన సృష్టి యొక్క గతాన్ని, భవిష్యత్తును, వర్తమానాన్ని – అన్నింటినీ తెలుసు. వారి ముందు ఏమి ఉందో, వారి వెనుక ఏమి ఉందో ఆయనకు తెలుసు. సృష్టిలో ఎవరూ ఆయన జ్ఞానంలోని ఏ విషయాన్నీ ఆయన చెప్పినది తప్ప తెలుసుకోలేరు. ఆయన కుర్సీ ఆకాశాలను, భూమిని ఆవరించి ఉంది. వాటిని సంరక్షించడం ఆయనకు ఎటువంటి భారమూ కాదు, అలసటనూ కలిగించదు. ఆయన సర్వోన్నతుడు, మహా గొప్పవాడు.

  1. ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:

* అల్లాహ్ ఒక్కడే ఆరాధనకు అర్హుడని, ఆయనకు సాటి ఎవరూ లేరని తెలుసుకోవడం.

* అల్లాహ్ శాశ్వత జీవి, నిద్ర లేదా అలసట ఆయనను చేరదని గ్రహించడం – ఇది ఆయన మహిమను, శక్తిని తెలియజేస్తుంది.

* సమస్త సృష్టి ఆయన ఆధీనంలో ఉందని, ఆయన అనుమతి లేకుండా ఎవరూ ఏమీ చేయలేరని అర్థం చేసుకోవడం.

* అల్లాహ్ జ్ఞానం అనంతమైనదని, మనుషుల జ్ఞానం చాలా పరిమితమని తెలుసుకోవడం.

* ఆయన కుర్సీ ఆకాశాలను, భూమిని ఆవరించి ఉందని, వాటిని సంరక్షించడం ఆయనకు భారం కాదని గ్రహించడం – ఇది ఆయన శక్తి మీద విశ్వాసాన్ని పెంచుతుంది.

* ఈ ఆయత్ (ఆయతుల్ కుర్సీ) ఖురాన్‌లోనే అత్యంత గొ



📜 వచనం 253-257 — సూరా అల్-బఖరా

253۞ تِلْكَ الرُّسُلُ فَضَّلْنَا بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ ۘ مِّنْهُم مَّن كَلَّمَ اللَّهُ ۖ وَرَفَعَ بَعْضَهُمْ دَرَجَاتٍ ۚ وَآتَيْنَا عِيسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنَاتِ وَأَيَّدْنَاهُ بِرُوحِ الْقُدُسِ ۗ وَلَوْ شَاءَ اللَّهُ مَا اقْتَتَلَ الَّذِينَ مِن بَعْدِهِم مِّن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ وَلَٰكِنِ اخْتَلَفُوا فَمِنْهُم مَّنْ آمَنَ وَمِنْهُم مَّن كَفَرَ ۚ وَلَوْ شَاءَ اللَّهُ مَا اقْتَتَلُوا وَلَٰكِنَّ اللَّهَ يَفْعَلُ مَا يُرِيدُ
ఆ సందేశహరులు! మేము వారిలో కొందరికి మరికొందరిపై ఆధిక్యత నిచ్చాము. వారిలో కొందరితో అల్లాహ్ (నేరుగా) మాట్లాడాడు. మరికొందరిని (గౌరవనీయమైన) ఉన్నత స్థానాలకు ఎత్తాడు. మరియు మర్యమ్ కుమారుడు ఈసా (ఏసు)కు మేము స్పష్టమైన సూచనలు ప్రసాదించి, అతనిని పరిశుద్ధాత్మ (జిబ్రీల్) సహాయంతో బలపరిచాము. మరియు - అల్లాహ్ తలుచుకుంటే - ఈ ప్రవక్తల తరువాత వచ్చిన ప్రజలు, వారికి స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాత కూడా పరస్పరం కలహించుకునేవారు కాదు. కానీ, వారు పరస్పర విభేదాలకు లోనయ్యారు. కావున వారిలో కొందరు విశ్వాసులయ్యారు మరికొందరు సత్యతిరస్కారులు అయ్యారు. మరియు అల్లాహ్ తలుచుకుంటే వారు పరస్పరం కలహించుకునేవారు కాదు, కాని అల్లాహ్ తాను కోరిందే చేస్తాడు
254يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم مِّن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا بَيْعٌ فِيهِ وَلَا خُلَّةٌ وَلَا شَفَاعَةٌ ۗ وَالْكَافِرُونَ هُمُ الظَّالِمُونَ
ఓ విశ్వాసులారా! ఏ బేరం గానీ, స్నేహం గానీ, సిఫారసు గానీ పనికిరాని దినం రాకముందే, మేము మీకు ప్రసాదించిన జీవనోపాధి నుండి (మా మార్గంలో) ఖర్చు పెట్టండి. మరియు సత్యతిరస్కారులు, వారే! దుర్మార్గులు
255اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ ۚ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ ۚ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ ۖ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ ۚ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ ۖ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا ۚ وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ
అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు. ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో - ఆయన అనుజ్ఞ లేకుండా - సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందున్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్ఠించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు
256لَا إِكْرَاهَ فِي الدِّينِ ۖ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ ۚ فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ لَا انفِصَامَ لَهَا ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
ధర్మం విషయంలో బలవంతం లేదు. వాస్తవానికి సన్మార్గం (రుష్ద్) దుర్మార్గం నుండి సుస్పష్టం చేయబడింది. కావున కల్పితదైవాన్ని (తాగూత్ ను) తిరస్కరించి, అల్లాహ్ ను విశ్వసించిన వాడు, సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆధారాన్ని పట్టుకున్నట్లే. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు
257اللَّهُ وَلِيُّ الَّذِينَ آمَنُوا يُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۖ وَالَّذِينَ كَفَرُوا أَوْلِيَاؤُهُمُ الطَّاغُوتُ يُخْرِجُونَهُم مِّنَ النُّورِ إِلَى الظُّلُمَاتِ ۗ أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
అల్లాహ్ విశ్వసించిన వారి సంరక్షకుడు, ఆయన వారిని చీకటి నుండి తీసి వెలుగులోకి తెస్తాడు. మరియు సత్యాన్ని తిరస్కరించినవారి రక్షకులు కల్పితదైవాలు (తాగూత్); అవి వారిని వెలుగు నుండి తీసి చీకటిలోనికి తీసుకొని పోతాయి. అలాంటి వారు నరకాగ్ని వాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు
అల్-బఖరాఖురాన్ సూచిక
286వచనం
MedinanRevelation
255వచనం

అనువాదం — అల్-బఖరా 255

ఆయతుల్ కుర్సీ — సూరా అల్-బఖరా వచనం 255 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వవ్యవస్థకు…

సూరా వచనం 255/286 — సూరా అల్-బఖరా البقرة (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-బఖరా వినండి, సూరా అల్-బఖరా అనువాదం, సూరా అల్-బఖరా mp3, సూరా అల్-బఖరా pdf. వచనం 253–257. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Wednesday, October 21, 2026

Don't forget us in your sincere prayers