Yaaa aiyuhal lazeena aamanoo laa taqtuslus saida wa antum hurum; wa man qatalahoo minkum mut`am midan fajazaaa`um mislu maa qatala minanna`ami yahkumu bihee zawaa `adlim minkum hadyam baalighal Ka`bati aw kaffaaratun ta`aamu masaakeena aw `adlu zaalika Siyaamal liyazooqa wabaala amrih; `afal laahu `ammaa salaf; wa man `aada fayanta qimul laahu minh; wallaahu `azeezun zuntiqaam
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
ఓ విశ్వాసులారా! మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేటాడకండి. మీలో ఎవరైనా బుద్ధిపూర్వకంగా వేట చేస్తే, అతడు చంపిన జంతువుతో సరితూగే ఒక పశువును పరిహారంగా సమర్పించుకోవాలి. దానిని (ఆ పశువును) మీలో న్యాయవర్తులైన ఇద్దరు వ్యక్తులు నిర్ణయించాలి. పశువును ఖుర్బానీ కొరకు కఅబహ్ వద్దకు చేర్చాలి. లేదా దానికి పరిహారంగా కొందరు పేదలకు భోజనం పెట్టాలి, లేదా దానికి పరిహారంగా - తాను చేసిన దాని ప్రతిఫలాన్ని చవిచూడటానికి - ఉపవాసముండాలి. గడిచిపోయిన దానిని అల్లాహ్ మన్నించాడు. కాని ఇక ముందు ఎవరైనా మళ్ళీ అలా చేస్తే అల్లాహ్ అతనికి ప్రతీకారం చేస్తాడు. మరియు అల్లాహ్ సర్వ శక్తి సంపన్నుడు, ప్రతీకారం చేయగలవాడు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
(ऐ ईमानदारों जब तुम हालते एहराम में हो तो शिकार न मारो और तुममें से जो कोई जान बूझ कर शिकार मारेगा तो जिस (जानवर) को मारा है चौपायों में से उसका मसल तुममें से जो दो मुन्सिफ आदमी तजवीज़ कर दें उसका बदला (देना) होगा (और) काबा तक पहुँचा कर कुर्बानी की जाए या (उसका) जुर्माना (उसकी क़ीमत से) मोहताजों को खाना खिलाना या उसके बराबर रोज़े रखना (यह जुर्माना इसलिए है) ताकि अपने किए की सज़ा का मज़ा चखो जो हो चुका उससे तो ख़ुदा ने दरग़ुज़र की और जो फिर ऐसी हरकत करेगा तो ख़ुदा उसकी सज़ा देगा और ख़ुदा ज़बरदस्त बदला लेने वाला है
ఓ విశ్వాసులారా! మీరు హజ్ లేదా ఉమ్రా కోసం ఇహ్రామ్ ధరించిన స్థితిలో ఉన్నప్పుడు — అంటే "హురుమ్" (పవిత్ర స్థితి)లో ఉన్నప్పుడు — భూమిపై వేటాడే జంతువులను చంపకండి. మీలో ఎవరైనా తెలిసి, ఉద్దేశపూర్వకంగా వేట జంతువును చంపితే, అతను చంపిన జంతువుకు సమానమైన పశువును (ఒంటె, ఆవు లేదా గొర్రె) పరిహారంగా ఇవ్వాలి. ఈ పరిహారాన్ని మీలోని ఇద్దరు న్యాయవంతులు నిర్ణయించాలి. ఆ పశువును మక్కాలోని కాబా వద్దకు చేర్చి బలి ఇవ్వాలి. లేదా దానికి సమానమైన విలువతో ఆహారాన్ని కొని హరమ్ (మక్కా పవిత్ర ప్రాంతం)లోని పేదవారికి పంచాలి — ప్రతి పేదవాడికి అర సా (సుమారు 1.5 కిలోలు) చొప్పున. లేదా ప్రతి అర సా ఆహారానికి బదులుగా ఒక రోజు ఉపవాసం చేయాలి. ఇదంతా అతను చేసిన తప్పు యొక్క చెడు పరిణామాన్ని అనుభవించడానికే. ఈ నిషేధం వచ్చకముందు జరిగిన తప్పులను అల్లాహ్ క్షమించాడు. కానీ ఎవరైనా మళ్ళీ ఉద్దేశపూర్వకంగా అదే తప్పు చేస్తే, అల్లాహ్ అతని నుండి ప్రతీకారం తీర్చుకుంటాడు. అల్లాహ్ సర్వశక్తిమంతుడు, ప్రతీకారం తీర్చుకునేవాడు.
ఈ ఆయత్ నుండి పాఠాలు:
ఇహ్రామ్ స్థితిలో వేట నిషేధం: హజ్ లేదా ఉమ్రా చేసేవారు ఇహ్రామ్లో ఉన్నప్పుడు భూమిపై వేటాడే జంతువులను చంపకూడదు. ఇది అల్లాహ్ ఆదేశం.
తప్పు చేసినవారికి పరిహారం: ఉద్దేశపూర్వకంగా వేట జంతువును చంపినవారు తప్పనిసరిగా పరిహారం చెల్లించాలి — సమానమైన పశువును బలి ఇవ్వడం, లేదా ఆహారం పంచడం, లేదా ఉపవాసం చేయడం.
న్యాయమైన నిర్ణయం: పరిహారాన్ని నిర్ణయించడానికి ఇద్దరు న్యాయవంతులు, విశ్వసనీయులైన ముస్లింలు ఉండాలి.
అల్లాహ్ క్షమాశీలుడు: ఈ ఆదేశం రాకముందు జరిగిన తప్పులను అల్లాహ్ క్షమించాడ
ఓ విశ్వాసులారా! మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేటాడకండి. మీలో ఎవరైనా బుద్ధిపూర్వకంగా వేట చేస్తే, అతడు చంపిన జంతువుతో సరితూగే ఒక పశువును పరిహారంగా సమర్పించుకోవాలి. దానిని (ఆ పశువును) మీలో న్యాయవర్తులైన ఇద్దరు వ్యక్తులు నిర్ణయించాలి. పశువును ఖుర్బానీ కొరకు కఅబహ్ వద్దకు చేర్చాలి. లేదా దానికి పరిహారంగా కొందరు పేదలకు భోజనం పెట్టాలి, లేదా దానికి పరిహారంగా - తాను చేసిన దాని ప్రతిఫలాన్ని చవిచూడటానికి - ఉపవాసముండాలి. గడిచిపోయిన దానిని అల్లాహ్ మన్నించాడు. కాని ఇక ముందు ఎవరైనా మళ్ళీ అలా చేస్తే అల్లాహ్ అతనికి ప్రతీకారం చేస్తాడు. మరియు అల్లాహ్ సర్వ శక్తి సంపన్నుడు, ప్రతీకారం చేయగలవాడు
విశ్వసించి సత్కార్యాలు చేసే వారిపై, (ఇంతకు ముందు) వారు తిన్న (త్రాగిన) దాన్ని గురించి దోషం లేదు; ఒకవేళ వారు దైవభీతి కలిగి ఉండి, విశ్వసించి, సత్కార్యాలు చేస్తూ ఉంటే, ఇంకా దైవభీతి కలిగి ఉండి విశ్వాసులైతే, ఇంకా దైవభీతి కలిగి ఉండి సజ్జనులైతే! మరియు అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు
ఓ విశ్వాసులారా! (మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు) - మీ ఇంద్రియాలకు అగోచరమైన అల్లాహ్ కు ఎవరు భయపడాతో చూడటానికి - అల్లాహ్ మీ చేతులకు మరియు మీ బల్లెములకు అందుబాటులో ఉన్న కొన్ని వేట (జంతువుల) ద్వారా మిమ్మల్ని పరీక్షకు గురి చేస్తాడు. కావున ఈ (హెచ్చరిక) తరువాత కూడా ఎవడు హద్దును అతిక్రమిస్తాడో, వాడికి బాధాకరమైన శిక్ష ఉంటుంది
ఓ విశ్వాసులారా! మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేటాడకండి. మీలో ఎవరైనా బుద్ధిపూర్వకంగా వేట చేస్తే, అతడు చంపిన జంతువుతో సరితూగే ఒక పశువును పరిహారంగా సమర్పించుకోవాలి. దానిని (ఆ పశువును) మీలో న్యాయవర్తులైన ఇద్దరు వ్యక్తులు నిర్ణయించాలి. పశువును ఖుర్బానీ కొరకు కఅబహ్ వద్దకు చేర్చాలి. లేదా దానికి పరిహారంగా కొందరు పేదలకు భోజనం పెట్టాలి, లేదా దానికి పరిహారంగా - తాను చేసిన దాని ప్రతిఫలాన్ని చవిచూడటానికి - ఉపవాసముండాలి. గడిచిపోయిన దానిని అల్లాహ్ మన్నించాడు. కాని ఇక ముందు ఎవరైనా మళ్ళీ అలా చేస్తే అల్లాహ్ అతనికి ప్రతీకారం చేస్తాడు. మరియు అల్లాహ్ సర్వ శక్తి సంపన్నుడు, ప్రతీకారం చేయగలవాడు
సముద్ర జంతువులను వేటాడటం మరియు వాటిని తినటం, జీవనోపాధిగా మీకూ (స్థిరనివాసులకూ) మరియు ప్రయాణీకులకూ ధర్మసమ్మతం చేయబడింది. కానీ, మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నంత వరకూ భూమిపై వేటాడటం మీకు నిషేధింపబడింది. కావున మీరు (పునరుత్థాన దినమున) ఎవరి ముందు అయితే సమావేశ పరచ బడతారో ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి
అల్లాహ్ పవిత్ర గృహం అయిన కఅబహ్ ను మానవజాతి కొరకు, సురక్షితమైన శాంతి నిలయంగా (బైతుల్ హరామ్ గా) చేశాడు. మరియు పవిత్ర మాసాన్ని మరియు బలి (హద్ య) పశువులను మరియు మెడలలో పట్టాలు వేసి కఅబహ్ కు ఖుర్బానీ కొరకు తేబడే పశువులను (ఖలా ఇదలను) కూడా నియమించాడు. ఇది ఆకాశాలలోను మరుయ భూమిలోను ఉన్నదంతా నిశ్చయంగా, అల్లాహ్ ఎరుగునని, మీరు తెలుసుకోవాలని! మరియు నిశ్చయంగా అల్లాహ్ కు ప్రతి ఒక్క విషయం గురించి బాగా తెలుసు
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.