అల్-బఖరా · 179/286
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-బఖరా
وَلَكُمْ فِي الْقِصَاصِ حَيَاةٌ يَا أُولِي الْأَلْبَابِ لَعَلَّكُمْ تَتَّقُونَ ۝١٧٩
Wa lakum fil qisaasi hayaatuny yaaa ulil albaabi la `allakum tattaqoon
📖 తెలుగులో
ఓ బుద్ధిమంతులారా! న్యాయ ప్రతీకారం (ఖిసాస్) లో మీకు ప్రాణ రక్షణ ఉంది. దీని వల్ల మీరు దైవభీతి గలవారు అవుతారు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 177-181 — సూరా అల్-బఖరా

177۞ لَّيْسَ الْبِرَّ أَن تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَٰكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ وَآتَى الْمَالَ عَلَىٰ حُبِّهِ ذَوِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينَ وَابْنَ السَّبِيلِ وَالسَّائِلِينَ وَفِي الرِّقَابِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَالْمُوفُونَ بِعَهْدِهِمْ إِذَا عَاهَدُوا ۖ وَالصَّابِرِينَ فِي الْبَأْسَاءِ وَالضَّرَّاءِ وَحِينَ الْبَأْسِ ۗ أُولَٰئِكَ الَّذِينَ صَدَقُوا ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُتَّقُونَ
వినయ విధేయత (ధర్మనిష్ఠాపరత్వం) అంటే మీరు మీ ముఖాలను తూర్పు దిక్కునకో, లేక పడమర దిక్కునకో చేయటం కాదు; కాని వినయ విధేయత (ధర్మనిష్ఠాపరత్వం) అంటే, అల్లాహ్ ను, అంతిమదినాన్ని, దేవదూతలను, ప్రతి దివ్యగ్రంథాన్ని మరియు ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించడం; మరియు ధనంపై ప్రేమ కలిగి ఉండి కూడా, దానిని బంధువుల కొరకు అనాథుల కొరకు, యాచించని పేదల కొరకు, బాటసారుల కొరకు, యాచకుల కొరకు మరియు బానిసలను విడిపించడానికి వ్యయపరచడం, మరియు నమాజ్ ను స్థాపించడం, జకాత్ ఇవ్వడం మరియు వాగ్దానం చేసినప్పుడు తమ వాగ్దానాన్ని పూర్తి చేయడం. మరియు దురవస్థలో మరియు అపత్కాలాలలో మరియు యుద్ధ సమయాలలో స్థైర్యం కలిగి ఉండటం. ఇలాంటి వారే సత్యవంతులు మరియు ఇలాంటి వారే దైవభీతి గలవారు
178يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الْقِصَاصُ فِي الْقَتْلَى ۖ الْحُرُّ بِالْحُرِّ وَالْعَبْدُ بِالْعَبْدِ وَالْأُنثَىٰ بِالْأُنثَىٰ ۚ فَمَنْ عُفِيَ لَهُ مِنْ أَخِيهِ شَيْءٌ فَاتِّبَاعٌ بِالْمَعْرُوفِ وَأَدَاءٌ إِلَيْهِ بِإِحْسَانٍ ۗ ذَٰلِكَ تَخْفِيفٌ مِّن رَّبِّكُمْ وَرَحْمَةٌ ۗ فَمَنِ اعْتَدَىٰ بَعْدَ ذَٰلِكَ فَلَهُ عَذَابٌ أَلِيمٌ
ఓ విశ్వాసులారా! హత్య విషయంలో మీ కొరకు న్యాయప్రతీకారం (ఖిసాస్) నిర్ణయించబడింది. ఆ హత్య చేసిన వాడు, స్వేచ్ఛగలవాడైతే ఆ స్వేచ్ఛాపరుణ్ణి, బానిస అయితే ఆ బానిసను, స్త్రీ అయితే ఆ స్త్రీని (వధించాలి). ఒకవేళ హతుని సోదరులు (కుటుంబీకులు) హంతకుణ్ణి కనికరించదలిస్తే, ధర్మయుక్తంగా రక్తశుల్క నిర్ణయం జరగాలి. హంతకుడు రక్తధనాన్ని, ఉత్తమరీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభువు తరఫు నుండి మీకు లభించే సౌకర్యం, కారుణ్యం. దీని తర్వాత కూడా ఈ హద్దును అతిక్రమించే వానికి బాధాకరమైన శిక్ష ఉంటుంది
179وَلَكُمْ فِي الْقِصَاصِ حَيَاةٌ يَا أُولِي الْأَلْبَابِ لَعَلَّكُمْ تَتَّقُونَ
ఓ బుద్ధిమంతులారా! న్యాయ ప్రతీకారం (ఖిసాస్) లో మీకు ప్రాణ రక్షణ ఉంది. దీని వల్ల మీరు దైవభీతి గలవారు అవుతారు
180كُتِبَ عَلَيْكُمْ إِذَا حَضَرَ أَحَدَكُمُ الْمَوْتُ إِن تَرَكَ خَيْرًا الْوَصِيَّةُ لِلْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ بِالْمَعْرُوفِ ۖ حَقًّا عَلَى الْمُتَّقِينَ
మీలో ఎవరికైనా మరణకాలం సమీపించినప్పుడు అతడు ఆస్తిపాస్తులు గలవాడైతే అతడు తన తల్లిదండ్రుల కొరకు మరియు సమీపబంధువుల కొరకు ధర్మసమ్మతమైన మరణశాసనం (వీలునామా) వ్రాయాలి. ఇది దైవభితి గలవారి విద్యుక్త ధర్మం
181فَمَن بَدَّلَهُ بَعْدَمَا سَمِعَهُ فَإِنَّمَا إِثْمُهُ عَلَى الَّذِينَ يُبَدِّلُونَهُ ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
ఇక దానిని (వీలునామాను) విన్నవారు, తరువాత ఒకవేళ దానిని మార్చితే, దాని పాపమంతా నిశ్చయంగా, ఆ మార్చిన వారి పైననే ఉంటుంది. నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు
అల్-బఖరాఖురాన్ సూచిక
286వచనం
MedinanRevelation
179వచనం

అనువాదం — అల్-బఖరా 179

సూరా అల్-బఖరా వచనం 179 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఓ బుద్ధిమంతులారా! న్యాయ ప్రతీకారం (ఖిసాస్) లో మీకు ప్రాణ రక్షణ ఉంది.…

సూరా వచనం 179/286 — సూరా అల్-బఖరా البقرة (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-బఖరా వినండి, సూరా అల్-బఖరా అనువాదం, సూరా అల్-బఖరా mp3, సూరా అల్-బఖరా pdf. వచనం 177–181. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers