Alam tara ilal lazee Haaajja Ibraaheema fee Rabbiheee an aataahullaahul mulka iz qaala Ibraaheemu Rabbiyal lazee yuhyee wa yumeetu qaala ana uhyee wa yumeetu qaala ana uhyee wa umeetu qaala Ibraaheemu fa innal laaha yaatee bishshamsi minal mashriqi faati bihaa minal maghribi fabuhital lazee kafar; wallaahu laa yahdil qawmaz zaalimeen
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
ఏమీ? అల్లాహ్ (తన అనుగ్రహంతో) సామ్రాజ్యం ఇచ్చిన తరువాత, ఇబ్రాహీమ్ తో అతని ప్రభువు (అల్లాహ్) ను గురించి వాదించిన వ్యక్తి (నమ్రూద్) విషయం నీకు తెలియదా? ఇబ్రాహీమ్: జీవన్మరణాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయో! ఆయనే నా ప్రభువు." అని అన్నప్పుడు, అతడు: చావుబ్రతుకులు రెండూ నా ఆధీనంలోనే ఉన్నాయి." అని అన్నాడు. అప్పుడు ఇబ్రాహీమ్: సరే! అల్లాహ్ సూర్యుణ్ణి తూర్పు నుండి ఉదయింపజేస్తాడు; అయితే నీవు (సూర్యుణ్ణి) పడమర నుండి ఉదయింపజెయ్యి." అని అన్నాడు. దానితో ఆ సత్యతిరస్కారి చికాకు పడ్డాడు. మరియు అల్లాహ్ దుర్మార్గం అవలంబించిన ప్రజలకు సన్మార్గం చూపడు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
(ऐ रसूल) क्या तुम ने उस शख्स (के हाल) पर नज़र नहीं की जो सिर्फ़ इस बिरते पर कि ख़ुदा ने उसे सल्तनत दी थी इब्राहीम से उनके परवरदिगार के बारे में उलझ पड़ा कि जब इब्राहीम ने (उससे) कहा कि मेरा परवरदिगार तो वह है जो (लोगों को) जिलाता और मारता है तो वो भी (शेख़ी में) आकर कहने लगा मैं भी जिलाता और मारता हूं (तुम्हारे ख़ुदा ही में कौन सा कमाल है) इब्राहीम ने कहा (अच्छा) खुदा तो आफ़ताब को पूरब से निकालता है भला तुम उसको पश्चिम से निकालो इस पर वह काफ़िर हक्का बक्का हो कर रह गया (मगर ईमान न लाया) और ख़ुदा ज़ालिमों को मंज़िले मक़सूद तक नहीं पहुंचाया करता
ఓ ప్రవక్తా! నీకు ఆ ఆశ్చర్యకరమైన సంఘటన తెలిసిందా? అల్లాహ్ తన ప్రవక్త ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)తో అల్లాహ్ ఏకత్వం (తౌహీద్) గురించి వాదించిన ఒక దుర్మార్గుడు ఉన్నాడు. అతనికి అల్లాహ్ రాజ్యాధికారాన్ని ఇచ్చాడు, కానీ ఆ అధికారం అతన్ని గర్విష్ఠుడిగా, అహంకారిగా మార్చింది. అతను ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)ను ఇలా ప్రశ్నించాడు: "నీ ప్రభువు ఎవరు?" అందుకు ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఇలా సమాధానమిచ్చాడు: "నా ప్రభువు ఆయనే, ఆయనే జీవాన్ని ఇస్తాడు మరియు మరణాన్ని కలిగిస్తాడు. ఆయనొక్కడే జీవితాన్ని ప్రసాదించడంలో మరియు మరణాన్ని కలిగించడంలో అన్నిటికీ అతీతుడు."
అప్పుడు ఆ దుర్మార్గుడు అహంకారంతో ఇలా అన్నాడు: "నేనూ జీవాన్ని ఇస్తాను మరియు మరణాన్ని కలిగిస్తాను!" అంటే, తాను ఇష్టం వచ్చినవారిని చంపిస్తానని, ఇష్టం వచ్చినవారిని బతికించి ఉంచుతానని అన్నాడు. ఇది కేవలం మోసపూరితమైన, అర్థరహితమైన వాదన.
అప్పుడు ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) మరింత స్పష్టమైన, బలమైన వాదనతో ముందుకు వచ్చాడు: "నిశ్చయంగా, అల్లాహ్ సూర్యుడిని తూర్పు దిక్కు నుండి ఉదయింపజేస్తాడు. నువ్వు సత్యవంతుడవైతే, దానిని పడమర దిక్కు నుండి ఉదయింపజేయి చూపించు!" అన్నాడు. ఈ మాటలు వినగానే ఆ అవిశ్వాసి నిశ్చేష్టుడైపోయాడు, అతని వాదన పూర్తిగా విఫలమైంది, నోట మాట రాలేదు. అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపించడు, ఎందుకంటే వారు స్వయంగా సత్యాన్ని తిరస్కరించి, అహంకారంతో ముందుకు సాగుతారు.
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు మరియు ఇస్లాం పట్ల ఆకర్షణ:
అల్లాహ్ ఏకత్వం (తౌహీద్) స్పష్టమైన వాదన: ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తన ప్రభువు శక్తిని సూర్యుడి ఉదాహరణతో నిరూపించాడు. ఇది అల్లాహ్ మహిమను, ఆయన సృష్టిలోని అద్భుతాలను ఆలోచించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది.
అహంకారం మరియు అధికారం ప్రమాదం: రాజ్యాధికారం ఒక వ్యక్తిని గర్విష్ఠుడిగా మార్చి, సత్యాన్ని తిరస్కరించేలా చేయగలదు. ఇది మనకు హెచ్చరిక – అధికారం, సంపద ఉన్నా వినయంగా ఉండాలి.
ఏమీ? అల్లాహ్ (తన అనుగ్రహంతో) సామ్రాజ్యం ఇచ్చిన తరువాత, ఇబ్రాహీమ్ తో అతని ప్రభువు (అల్లాహ్) ను గురించి వాదించిన వ్యక్తి (నమ్రూద్) విషయం నీకు తెలియదా? ఇబ్రాహీమ్: జీవన్మరణాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయో! ఆయనే నా ప్రభువు." అని అన్నప్పుడు, అతడు: చావుబ్రతుకులు రెండూ నా ఆధీనంలోనే ఉన్నాయి." అని అన్నాడు. అప్పుడు ఇబ్రాహీమ్: సరే! అల్లాహ్ సూర్యుణ్ణి తూర్పు నుండి ఉదయింపజేస్తాడు; అయితే నీవు (సూర్యుణ్ణి) పడమర నుండి ఉదయింపజెయ్యి." అని అన్నాడు. దానితో ఆ సత్యతిరస్కారి చికాకు పడ్డాడు. మరియు అల్లాహ్ దుర్మార్గం అవలంబించిన ప్రజలకు సన్మార్గం చూపడు
ధర్మం విషయంలో బలవంతం లేదు. వాస్తవానికి సన్మార్గం (రుష్ద్) దుర్మార్గం నుండి సుస్పష్టం చేయబడింది. కావున కల్పితదైవాన్ని (తాగూత్ ను) తిరస్కరించి, అల్లాహ్ ను విశ్వసించిన వాడు, సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆధారాన్ని పట్టుకున్నట్లే. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు
అల్లాహ్ విశ్వసించిన వారి సంరక్షకుడు, ఆయన వారిని చీకటి నుండి తీసి వెలుగులోకి తెస్తాడు. మరియు సత్యాన్ని తిరస్కరించినవారి రక్షకులు కల్పితదైవాలు (తాగూత్); అవి వారిని వెలుగు నుండి తీసి చీకటిలోనికి తీసుకొని పోతాయి. అలాంటి వారు నరకాగ్ని వాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు
ఏమీ? అల్లాహ్ (తన అనుగ్రహంతో) సామ్రాజ్యం ఇచ్చిన తరువాత, ఇబ్రాహీమ్ తో అతని ప్రభువు (అల్లాహ్) ను గురించి వాదించిన వ్యక్తి (నమ్రూద్) విషయం నీకు తెలియదా? ఇబ్రాహీమ్: జీవన్మరణాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయో! ఆయనే నా ప్రభువు." అని అన్నప్పుడు, అతడు: చావుబ్రతుకులు రెండూ నా ఆధీనంలోనే ఉన్నాయి." అని అన్నాడు. అప్పుడు ఇబ్రాహీమ్: సరే! అల్లాహ్ సూర్యుణ్ణి తూర్పు నుండి ఉదయింపజేస్తాడు; అయితే నీవు (సూర్యుణ్ణి) పడమర నుండి ఉదయింపజెయ్యి." అని అన్నాడు. దానితో ఆ సత్యతిరస్కారి చికాకు పడ్డాడు. మరియు అల్లాహ్ దుర్మార్గం అవలంబించిన ప్రజలకు సన్మార్గం చూపడు
లేక! ఒక వ్యక్తి ఇండ్ల కప్పులన్నీ కూలిపోయి, పాడుపడిన (తలక్రిందులై బోర్లా పడిన) నగరం మీదుగా పోతూ: వాస్తవానికి! నశించిపోయిన ఈ నగరానికి అల్లాహ్ తిరిగి ఏ విధంగా జీవం పోయగలడు?" అని అన్నాడు. అప్పుడు అల్లాహ్ అతనిని మరణింపజేసి నూరు సంవత్సరాల తరువాత తిరిగి బ్రతికింపజేసి: ఈ స్థితిలో నీవు ఎంతకాలముంటివి?" అని అడిగాడు. అతడు: ఒక దినమో, లేక ఒక దినములో కొంత భాగమో!" అని అన్నాడు. దానికి ఆయన: కాదు, నీవు ఇక్కడ ఈ (మరణించిన) స్థితిలో, నూరు సంవత్సరాలు ఉంటివి. ఇక నీ అన్నపానీయాల వైపు చూడు, వాటిలో ఏ మార్పూ లేదు. ఇంకా నీవు నా గాడిదను కూడా చూడు! మేము ప్రజల కొరకు నిన్ను దృష్టాంతంగా చేయదలిచాము. ఇక ఆ (గాడిద) ఎముకలను చూడు, ఏ విధంగా వాటిని ఉద్ధరించి తిరిగి వాటిపై మాంసం కప్పుతామో!" అని అన్నాడు. ఇవి అతనికి స్పష్టంగా తెలిసిన తరువాత అతడు: నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడని నాకు (ఇప్పుడు) తెలిసింది!" అని అన్నాడు
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్: ఓ నా ప్రభూ! నీవు మృతులను ఎలా సజీవులుగా చేస్తావో నాకు చూపు!" అని అన్నప్పుడు, (అల్లాహ్) అన్నాడు: ఏమీ? నీకు విశ్వాసం లేదా?" దానికి (ఇబ్రాహీమ్): ఉంది, కానీ నా మనస్సు తృప్తి కొరకు అడుగు తున్నాను!" అని అన్నాడు. అపుడు (అల్లాహ్): నాలుగు పక్షులను తీసుకో, వాటిని బాగా మచ్చిక చేసుకో! తరువాత (వాటిని కోసి) ఒక్కొక్కదాని ఒక్కొక్క భాగాన్ని, ఒక్కొక్క కొండపై పెట్టి రా, మళ్ళీ వాటిని రమ్మని పిలువు, అవి నీ వద్దకు ఎగురుకుంటూ వస్తాయి. కాబట్టి నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు అని తెలుసుకో!"అని అన్నాడు
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.