మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్: ఓ నా ప్రభూ! నీవు మృతులను ఎలా సజీవులుగా చేస్తావో నాకు చూపు!" అని అన్నప్పుడు, (అల్లాహ్) అన్నాడు: ఏమీ? నీకు విశ్వాసం లేదా?" దానికి (ఇబ్రాహీమ్): ఉంది, కానీ నా మనస్సు తృప్తి కొరకు అడుగు తున్నాను!" అని అన్నాడు. అపుడు (అల్లాహ్): నాలుగు పక్షులను తీసుకో, వాటిని బాగా మచ్చిక చేసుకో! తరువాత (వాటిని కోసి) ఒక్కొక్కదాని ఒక్కొక్క భాగాన్ని, ఒక్కొక్క కొండపై పెట్టి రా, మళ్ళీ వాటిని రమ్మని పిలువు, అవి నీ వద్దకు ఎగురుకుంటూ వస్తాయి. కాబట్టి నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు అని తెలుసుకో!"అని అన్నాడు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
और (ऐ रसूल) वह वाकेया भी याद करो जब इबराहीम ने (खुदा से) दरख्वास्त की कि ऐ मेरे परवरदिगार तू मुझे भी तो दिखा दे कि तू मुर्दों को क्योंकर ज़िन्दा करता है ख़ुदा ने फ़रमाया क्या तुम्हें (इसका) यक़ीन नहीं इबराहीम ने अर्ज़ की (क्यों नहीं) यक़ीन तो है मगर ऑंख से देखना इसलिए चाहता हूं कि मेरे दिल को पूरा इत्मिनान हो जाए फ़रमाया (अगर ये चाहते हो) तो चार परिन्दे लो और उनको अपने पास मॅगवा लो और टुकड़े टुकड़े कर डालो फिर हर पहाड़ पर उनका एक एक टुकड़ा रख दो उसके बाद उनको बुलाओ (फिर देखो तो क्यों कर वह सब के सब तुम्हारे पास दौड़े हुए आते हैं और समझ रखो कि ख़ुदा बेशक ग़ालिब और हिकमत वाला है
لِّيَطْمَئِنَّ (లియత్మఇన్న): నా హృదయం శాంతి పొందడానికి, నెమ్మదించడానికి.
فَصُرْهُنَّ (ఫసుర్హున్న): వాటిని నీ వైపు తిప్పుకో, ముక్కలు ముక్కలుగా కోయి.
جُزْءًا (జుజ్అన్): ఒక భాగం, ఒక ముక్క.
سَعْيًا (సఅ్యన్): వేగంగా నడుస్తూ, పరుగెత్తుతూ.
عَزِيزٌ (అజీజున్): సర్వశక్తిమంతుడు, ఎవరూ ఆయనను ఓడించలేరు.
حَكِيمٌ (హకీమున్): మహా వివేకవంతుడు, సర్వజ్ఞాని.
ఆయత్ వివరణ:
ఓ ప్రవక్తా! జ్ఞాపకం చేసుకో, ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తన ప్రభువును ఇలా అడిగారు: "నా ప్రభూ! మృతులను ఎలా బ్రతికిస్తావో నాకు చూపించు." అప్పుడు అల్లాహ్ ఆయనను ఇలా ప్రశ్నించాడు: "ఏమీ? నువ్వు ఇంకా విశ్వసించలేదా?" అందుకు ఇబ్రాహీమ్ ఇలా అన్నారు: "అవును ప్రభూ! నేను విశ్వసించాను. కానీ నా హృదయం పూర్తిగా శాంతి పొందాలని, నా విశ్వాసం మరింత దృఢపడాలని ఈ విధంగా అడుగుతున్నాను." అప్పుడు అల్లాహ్ ఆయనకు ఆజ్ఞ ఇచ్చాడు: "నాలుగు పక్షులను తీసుకో, వాటిని నీ దగ్గరకు తిప్పుకో, తరువాత వాటిని ముక్కలు ముక్కలుగా కోయి, ప్రతి కొండపై ఒక ముక్క పెట్టు. ఆ తరువాత వాటిని పిలువు, అవి వేగంగా నీ దగ్గరకు వస్తాయి." ఇబ్రాహీమ్ అలా చేశారు. ప్రతి ముక్క తిరిగి దాని శరీరంతో కలిసిపోయింది, పక్షులు తిరిగి జీవం పొంది వేగంగా ఆయన దగ్గరకు వచ్చాయి. ఇది అల్లాహ్ శక్తికి స్పష్టమైన రుజువు. గుర్తుంచుకో, అల్లాహ్ సర్వశక్తిమంతుడు — ఏదీ ఆయనను ఓడించలేదు, ఆయన ఏది చేయాలన్నా చేయగలడు. ఆయన మహా వివేకవంతుడు — ఆయన మాటల్లో, చేష్టల్లో, శాసనాల్లో, విధిలో సంపూర్ణ జ్ఞానం ఉంది.
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
విశ్వాసం మరియు దృఢ విశ్వాసం మధ్య తేడా: ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఇప్పటికే విశ్వసించారు, కానీ హృదయ శాంతి కోసం, విశ్వాసాన్ని ప్రత్యక్షంగా చూసి మరింత బలపరుచుకోవడానికి అడిగారు. ఇది విశ్వాసులకు ఒక గొప్ప పాఠం — విశ్వాసాన్ని పెంచుకోవడానికి, అల్లాహ్ను మరింత దగ్గరగా తెలుసుకోవడానికి ప్రయత్నించడం మంచిది.
అల్లాహ్ శక్తిపై పూర్తి నమ్మకం: మృతులను బ్రతికించడం అల్లాహ్కు ఎంతో సులభం. ఆయన ఒక మాట అన్నా, ఒక ఆజ్ఞ ఇచ్చినా, చనిపోయినవి కూడా తిరిగి జీవం పొందుతాయి. ఈ సంఘటన ప్రళయ దినాన మృతులను తిరిగి లేపడం నిజమని న
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్: ఓ నా ప్రభూ! నీవు మృతులను ఎలా సజీవులుగా చేస్తావో నాకు చూపు!" అని అన్నప్పుడు, (అల్లాహ్) అన్నాడు: ఏమీ? నీకు విశ్వాసం లేదా?" దానికి (ఇబ్రాహీమ్): ఉంది, కానీ నా మనస్సు తృప్తి కొరకు అడుగు తున్నాను!" అని అన్నాడు. అపుడు (అల్లాహ్): నాలుగు పక్షులను తీసుకో, వాటిని బాగా మచ్చిక చేసుకో! తరువాత (వాటిని కోసి) ఒక్కొక్కదాని ఒక్కొక్క భాగాన్ని, ఒక్కొక్క కొండపై పెట్టి రా, మళ్ళీ వాటిని రమ్మని పిలువు, అవి నీ వద్దకు ఎగురుకుంటూ వస్తాయి. కాబట్టి నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు అని తెలుసుకో!"అని అన్నాడు
ఏమీ? అల్లాహ్ (తన అనుగ్రహంతో) సామ్రాజ్యం ఇచ్చిన తరువాత, ఇబ్రాహీమ్ తో అతని ప్రభువు (అల్లాహ్) ను గురించి వాదించిన వ్యక్తి (నమ్రూద్) విషయం నీకు తెలియదా? ఇబ్రాహీమ్: జీవన్మరణాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయో! ఆయనే నా ప్రభువు." అని అన్నప్పుడు, అతడు: చావుబ్రతుకులు రెండూ నా ఆధీనంలోనే ఉన్నాయి." అని అన్నాడు. అప్పుడు ఇబ్రాహీమ్: సరే! అల్లాహ్ సూర్యుణ్ణి తూర్పు నుండి ఉదయింపజేస్తాడు; అయితే నీవు (సూర్యుణ్ణి) పడమర నుండి ఉదయింపజెయ్యి." అని అన్నాడు. దానితో ఆ సత్యతిరస్కారి చికాకు పడ్డాడు. మరియు అల్లాహ్ దుర్మార్గం అవలంబించిన ప్రజలకు సన్మార్గం చూపడు
లేక! ఒక వ్యక్తి ఇండ్ల కప్పులన్నీ కూలిపోయి, పాడుపడిన (తలక్రిందులై బోర్లా పడిన) నగరం మీదుగా పోతూ: వాస్తవానికి! నశించిపోయిన ఈ నగరానికి అల్లాహ్ తిరిగి ఏ విధంగా జీవం పోయగలడు?" అని అన్నాడు. అప్పుడు అల్లాహ్ అతనిని మరణింపజేసి నూరు సంవత్సరాల తరువాత తిరిగి బ్రతికింపజేసి: ఈ స్థితిలో నీవు ఎంతకాలముంటివి?" అని అడిగాడు. అతడు: ఒక దినమో, లేక ఒక దినములో కొంత భాగమో!" అని అన్నాడు. దానికి ఆయన: కాదు, నీవు ఇక్కడ ఈ (మరణించిన) స్థితిలో, నూరు సంవత్సరాలు ఉంటివి. ఇక నీ అన్నపానీయాల వైపు చూడు, వాటిలో ఏ మార్పూ లేదు. ఇంకా నీవు నా గాడిదను కూడా చూడు! మేము ప్రజల కొరకు నిన్ను దృష్టాంతంగా చేయదలిచాము. ఇక ఆ (గాడిద) ఎముకలను చూడు, ఏ విధంగా వాటిని ఉద్ధరించి తిరిగి వాటిపై మాంసం కప్పుతామో!" అని అన్నాడు. ఇవి అతనికి స్పష్టంగా తెలిసిన తరువాత అతడు: నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడని నాకు (ఇప్పుడు) తెలిసింది!" అని అన్నాడు
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్: ఓ నా ప్రభూ! నీవు మృతులను ఎలా సజీవులుగా చేస్తావో నాకు చూపు!" అని అన్నప్పుడు, (అల్లాహ్) అన్నాడు: ఏమీ? నీకు విశ్వాసం లేదా?" దానికి (ఇబ్రాహీమ్): ఉంది, కానీ నా మనస్సు తృప్తి కొరకు అడుగు తున్నాను!" అని అన్నాడు. అపుడు (అల్లాహ్): నాలుగు పక్షులను తీసుకో, వాటిని బాగా మచ్చిక చేసుకో! తరువాత (వాటిని కోసి) ఒక్కొక్కదాని ఒక్కొక్క భాగాన్ని, ఒక్కొక్క కొండపై పెట్టి రా, మళ్ళీ వాటిని రమ్మని పిలువు, అవి నీ వద్దకు ఎగురుకుంటూ వస్తాయి. కాబట్టి నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు అని తెలుసుకో!"అని అన్నాడు
అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసేవారి ఉపమానం: ఆ విత్తనం వలే ఉంటుంది, దేని నుండి అయితే ఏడు వెన్నులు పుట్టి ప్రతి వెన్నులో నూరేసి గింజలు ఉంటాయో! మరియు అల్లాహ్ తాను కోరిన వారికి హెచ్చుగా నొసంగుతాడు. మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు
ఎవరైతే, అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని వ్యయం చేసి, ఆ తరువాత తాము చేసిన ఉపకారాన్ని చెప్పుకుంటూ మరియు వారిని బాధిస్తూ ఉండరో, అలాంటి వారి ప్రతిఫలం, వారి ప్రభువు వద్ద ఉంది. మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.