అజ్-జుమర్ · 73/75
అనువాదం ఉచ్చారణ — సూరా అజ్-జుమర్
وَسِيقَ الَّذِينَ اتَّقَوْا رَبَّهُمْ إِلَى الْجَنَّةِ زُمَرًا ۖ حَتَّىٰ إِذَا جَاءُوهَا وَفُتِحَتْ أَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَا سَلَامٌ عَلَيْكُمْ طِبْتُمْ فَادْخُلُوهَا خَالِدِينَ ۝٧٣
Wa seeqal lazeenat taqaw Rabbahum ilal Jannati zumaran hattaaa izaa jaaa`oohaa wa futihat abwaabuhaa wa qaala lahum khazanatuhaa salaamun `alaikum tibtum fadkhuloohaa khaalideen
📖 తెలుగులో
మరియు తమ ప్రభువు పట్ల భయభక్తులు గలవారు గుంపులు గుంపులుగా స్వర్గం వైపునకు తీసుకొని పోబడతారు. చివరకు వారు దాని దగ్గరికి వచ్చినప్పుడు, దాని ద్వారాలు తెరువ బడతాయి మరియు దాని రక్షకులు వారితో అంటారు: మీకు శాంతి కలుగు గాక (సలాం)! మీరు మంచిగా ప్రవర్తించారు, కావున ఇందులో శాశ్వతంగా ఉండటానికి ప్రవేశించండి

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 71-75 — సూరా అజ్-జుమర్

71وَسِيقَ الَّذِينَ كَفَرُوا إِلَىٰ جَهَنَّمَ زُمَرًا ۖ حَتَّىٰ إِذَا جَاءُوهَا فُتِحَتْ أَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَا أَلَمْ يَأْتِكُمْ رُسُلٌ مِّنكُمْ يَتْلُونَ عَلَيْكُمْ آيَاتِ رَبِّكُمْ وَيُنذِرُونَكُمْ لِقَاءَ يَوْمِكُمْ هَٰذَا ۚ قَالُوا بَلَىٰ وَلَٰكِنْ حَقَّتْ كَلِمَةُ الْعَذَابِ عَلَى الْكَافِرِينَ
సత్యాన్ని తిరస్కరించిన వారు గుంపులు గుంపులుగా నరకం వైపునకు తోలబడతారు. చివరకు వారు దాని వద్దకు వచ్చినపుడు, దాని ద్వారాలు తెరువబడతాయి మరియు వారితో దాని రక్షకులు ఇలా అంటారు: ఏమీ? మీలో నుండి, మీ ప్రభువు సూచనలను వినిపించే సందేశహరులు మీ వద్దకు రాలేదా? మరియు వారు మిమ్మల్ని ఈనాటి మీ సమావేశాన్ని గురించి హెచ్చరించలేదా?" వారంటారు: అవును (హెచ్చరించారు)!" కాని (అప్పటికే) సత్యతిరస్కారులపై శిక్షా నిర్ణయం తీసుకోబడి ఉంటుంది
72قِيلَ ادْخُلُوا أَبْوَابَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۖ فَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِينَ
వారితో ఇలా అనబడుతుంది: నరక ద్వారాలలోనికి ప్రవేశించండి, ఇక్కడ మీరు శాశ్వతంగా ఉంటారు. గర్విష్ఠుల నివాస స్థలం ఎంత చెడ్డది
73وَسِيقَ الَّذِينَ اتَّقَوْا رَبَّهُمْ إِلَى الْجَنَّةِ زُمَرًا ۖ حَتَّىٰ إِذَا جَاءُوهَا وَفُتِحَتْ أَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَا سَلَامٌ عَلَيْكُمْ طِبْتُمْ فَادْخُلُوهَا خَالِدِينَ
మరియు తమ ప్రభువు పట్ల భయభక్తులు గలవారు గుంపులు గుంపులుగా స్వర్గం వైపునకు తీసుకొని పోబడతారు. చివరకు వారు దాని దగ్గరికి వచ్చినప్పుడు, దాని ద్వారాలు తెరువ బడతాయి మరియు దాని రక్షకులు వారితో అంటారు: మీకు శాంతి కలుగు గాక (సలాం)! మీరు మంచిగా ప్రవర్తించారు, కావున ఇందులో శాశ్వతంగా ఉండటానికి ప్రవేశించండి
74وَقَالُوا الْحَمْدُ لِلَّهِ الَّذِي صَدَقَنَا وَعْدَهُ وَأَوْرَثَنَا الْأَرْضَ نَتَبَوَّأُ مِنَ الْجَنَّةِ حَيْثُ نَشَاءُ ۖ فَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ
మరియు వారంటారు: మాకు చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు మరియు ఆయనే మమ్మల్ని ఈ నేలకు వారసులుగా చేశాడు. స్వర్గంలో మేము కోరిన చోట స్థిరనివాసం ఏర్పరచుకోగలము! సత్కార్యాలు చేసేవారి ప్రతిఫలం ఎంత ఉత్తమమైనది
75وَتَرَى الْمَلَائِكَةَ حَافِّينَ مِنْ حَوْلِ الْعَرْشِ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ ۖ وَقُضِيَ بَيْنَهُم بِالْحَقِّ وَقِيلَ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
మరియు దైవదూతలను తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన సింహాసనాన్ని (అర్ష్ ను) అన్ని వైపుల నుండి చుట్టుకొని ఉండటాన్ని నీవు చూస్తావు. మరియు వారి (సర్వ ప్రాణుల) మధ్య న్యాయంగా తీర్పు చేయబడుతుంది మరియు : సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ యే సమస్త లోకాలకు ప్రభువు." అని పలుకబడుతుంది
అజ్-జుమర్ఖురాన్ సూచిక
75వచనం
MeccanRevelation
73వచనం

అనువాదం — అజ్-జుమర్ 73

సూరా అజ్-జుమర్ వచనం 73 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు తమ ప్రభువు పట్ల భయభక్తులు గలవారు గుంపులు గుంపులుగా స్వర్గం వైపునకు…

సూరా వచనం 73/75 — సూరా అజ్-జుమర్ الزمر (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అజ్-జుమర్ వినండి, సూరా అజ్-జుమర్ అనువాదం, సూరా అజ్-జుమర్ mp3, సూరా అజ్-జుమర్ pdf. వచనం 71–75. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers