Wa`lamooo anna feekum Rasoolal laah; law yutee`ukum fee kaseerim minal amrila`anittum wa laakinnal laaha habbaba ilaikumul eemaana wa zaiyanahoo fee quloobikum wa karraha ilaikumul kufra walfusooqa wal`isyaan; ulaaaika humur raashidoon
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
మరియు మీ మధ్య అల్లాహ్ యొక్క సందేశహరుడు ఉన్నాడనే విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ అతన చాలా విషయాలలో మీ మాటనే వింటే మీరే ఆపదలో పడవచ్చు. కానీ అల్లాహ్ మీకు విశ్వాసం పట్ల ప్రేమ కలిగించాడు మరియు దానిని మీ హృదయాలకు ఆకర్షణీయమైనదిగా చేశాడు. మరియు సత్యతిరస్కారాన్ని, అవిధేయతను మరియు దుర్నడతను (ఆజ్ఞోల్లంఘనను) మీకు అసహ్యకరమైనదిగా చేశాడు. అలాంటి వారే సరైన మార్గదర్శకత్వం పొందినవారు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
और जान रखो कि तुम में ख़ुदा के पैग़म्बर (मौजूद) हैं बहुत सी बातें ऐसी हैं कि अगर रसूल उनमें तुम्हारा कहा मान लिया करें तो (उलटे) तुम ही मुश्किल में पड़ जाओ लेकिन ख़ुदा ने तुम्हें ईमान की मोहब्बत दे दी है और उसको तुम्हारे दिलों में उमदा कर दिखाया है और कुफ़्र और बदकारी और नाफ़रमानी से तुमको बेज़ार कर दिया है यही लोग ख़ुदा के फ़ज़ल व एहसान से राहे हिदायत पर हैं
الْعِصْيَانَ (అల్-ఇస్యాన్): అన్ని రకాల పాపాలు, అల్లాహ్ ఆజ్ఞలను ఉల్లంఘించడం.
الرَّاشِدُونَ (అర్-రాషిదూన్): సన్మార్గంలో నడిచేవారు, సరైన మార్గాన్ని పొందినవారు.
ఆయత్ యొక్క వివరణ:
ఓ విశ్వాసులారా! మీ మధ్య అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉన్నారని గుర్తుంచుకోండి. ఆయనకు దైవవాణి (వహీ) అవతరిస్తుంది. కాబట్టి మీరు అబద్ధం చెప్పకండి — ఒకవేళ అబద్ధం చెబితే, దైవవాణి ద్వారా ఆయనకు తెలిసిపోతుంది, మీరు అవమానానికి గురవుతారు. ఆయన మీ కంటే మీ ప్రయోజనాలను బాగా ఎరిగినవారు. మీరు సూచించే విషయాల్లో చాలా వాటిలో ఆయన మీ మాట విని నడుచుకుంటే, మీరు తప్పక కష్టాల్లో, నష్టాల్లో పడిపోయేవారు. కానీ అల్లాహ్ తన అనుగ్రహంతో విశ్వాసాన్ని మీకు ప్రియమైనదిగా చేసాడు, దానిని మీ హృదయాల్లో అలంకరించాడు — అందుకే మీరు విశ్వసించారు. అలాగే అవిశ్వాసాన్ని, విధేయతను విడిచిపెట్టడాన్ని, పాపాలను మీకు అసహ్యకరమైనవిగా చేసాడు. ఈ లక్షణాలతో ఉన్నవారే సన్మార్గంలో నడిచేవారు, సత్యమార్గాన్ని పొందినవారు.
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల గౌరవం: ప్రవక్త (స.అ.వ.) మన మధ్య ఉన్నారని, ఆయన మాటలే మనకు మార్గదర్శకమని తెలుసుకోవాలి. ఆయన సూచనలు మన ప్రయోజనం కోసమే.
విశ్వాసం అల్లాహ్ ప్రసాదించిన వరం: విశ్వాసం కేవలం మన ప్రయత్నం మాత్రమే కాదు — అది అల్లాహ్ మన హృదయాల్లో ప్రియమైనదిగా, అందంగా చేసిన మహా అనుగ్రహం. ఇది మనం కృతజ్ఞతతో గుర్తించాల్సిన విషయం.
పాపాల పట్ల అసహ్యం కలగడం: నిజమైన విశ్వాసి హృదయంలో అవిశ్వాసం, అవిధేయత, పాపం పట్ల అసహ్యం ఉంటుంది. ఇది అల్లాహ్ హృదయాల్లో చేసిన మార్పు — ఇది విశ్వాసి గుర్తు.
సన్మార్గం అల్లాహ్ చూపే మార్గం: ఈ లక్షణాలు కలిగినవారే నిజమైన సన్మార్గులని, వారే విజయం పొందినవారని ఈ ఆ
మరియు మీ మధ్య అల్లాహ్ యొక్క సందేశహరుడు ఉన్నాడనే విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ అతన చాలా విషయాలలో మీ మాటనే వింటే మీరే ఆపదలో పడవచ్చు. కానీ అల్లాహ్ మీకు విశ్వాసం పట్ల ప్రేమ కలిగించాడు మరియు దానిని మీ హృదయాలకు ఆకర్షణీయమైనదిగా చేశాడు. మరియు సత్యతిరస్కారాన్ని, అవిధేయతను మరియు దుర్నడతను (ఆజ్ఞోల్లంఘనను) మీకు అసహ్యకరమైనదిగా చేశాడు. అలాంటి వారే సరైన మార్గదర్శకత్వం పొందినవారు
ఓ విశ్వాసులారా! ఎవడైనా ఒక అవిధేయుడు (ఫాసిఖ్), మీ వద్దకు ఏదైనా వార్త తెస్తే, మీరు - మీకు తెలియకుండానే జనులకు నష్టం కలిగించి, మీరు చేసిన దానికి పశ్చాత్తాప పడవలసిన స్థితి రాకముందే - నిజానిజాలను విచారించి తెలుసుకోండి
మరియు మీ మధ్య అల్లాహ్ యొక్క సందేశహరుడు ఉన్నాడనే విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ అతన చాలా విషయాలలో మీ మాటనే వింటే మీరే ఆపదలో పడవచ్చు. కానీ అల్లాహ్ మీకు విశ్వాసం పట్ల ప్రేమ కలిగించాడు మరియు దానిని మీ హృదయాలకు ఆకర్షణీయమైనదిగా చేశాడు. మరియు సత్యతిరస్కారాన్ని, అవిధేయతను మరియు దుర్నడతను (ఆజ్ఞోల్లంఘనను) మీకు అసహ్యకరమైనదిగా చేశాడు. అలాంటి వారే సరైన మార్గదర్శకత్వం పొందినవారు
మరియు ఒకవేళ విశ్వాసులలోని రెండు వర్గాల వారు పరస్పరం కలహించుకుంటే, వారిద్దరి మధ్య సంధి చేయించండి. కాని ఒకవేళ, వారిలోని ఒక వర్గం వారు రెండవ వర్గం వారిపై దౌర్జన్యం చేస్తే, దౌర్జన్యం చేసిన వారు, అల్లాహ్ ఆజ్ఞ వైపునకు మరలే వరకు, వారికి వ్యతిరేకంగా పోరాడండి. తరువాత వారు మరలి వస్తే, వారి మధ్య న్యాయంగా సంధి చేయించండి మరియు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. నిశ్చయంగా, అల్లాహ్ నిష్పక్షపాతంగా వ్యవహరించే వారిని ప్రేమిస్తాడు
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.