At taaa`iboonal `aabidoonal haamidoonas saaa`ihoonar raaki`oonas saajidoonal aamiroona bilma`roofi wannaahoona `anil munkari walhaafizoona lihudoodil laah; wa bashshiril mu`mineen
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
(వీరే అల్లాహ్ ముందు) పశ్చాత్తాప పడేవారు, ఆయనను ఆరాధించేవారు, స్తుతించేవారు (అల్లాహ్ మార్గంలో) సంచరించేవారు (ఉపవాసాలు చేసేవారు). ఆయన సన్నిధిలో వంగే (రుకూఉ చేసే) వారు, సాష్టాంగం (సజ్దా) చేసేవారు, ధర్మమును ఆదేశించేవారు మరియు ఆధర్మమును నిషేధించేవారు మరియు అల్లాహ్ విధించిన హద్దును పాటించేవారు కూడాను. మరియు విశ్వాసులకు శుభవార్త తెలుపు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
(ये लोग) तौबा करने वाले इबादत गुज़ार (ख़ुदा की) हम्दो सना (तारीफ़) करने वाले (उस की राह में) सफर करने वाले रूकूउ करने वाले सजदा करने वाले नेक काम का हुक्म करने वाले और बुरे काम से रोकने वाले और ख़ुदा की (मुक़र्रर की हुई) हदो को निगाह रखने वाले हैं और (ऐ रसूल) उन मोमिनीन को (बेहिश्त की) ख़ुशख़बरी दे दो
ఈ ఆయత్లో అల్లాహ్ తన విశ్వాసుల లక్షణాలను వివరిస్తున్నాడు. ఈ లక్షణాలు కలిగినవారికే పరలోకంలో గొప్ప ప్రతిఫలం, అల్లాహ్ సంతృప్తి, స్వర్గం లభిస్తాయి.
వారు ఇలా ఉంటారు: తమ తప్పులకు పశ్చాత్తాపం చెంది, అల్లాహ్ అసహ్యించుకున్న వాటిని విడిచిపెట్టి, ఆయన ప్రేమించే వైపు తిరిగేవారు. కేవలం అల్లాహ్ ఒక్కడినే ఆరాధిస్తూ, ఆయన పట్ల వినయంతో, విధేయతతో జీవిస్తారు. సుఖదుఃఖాల్లో, మంచిచెడ్డల్లో అల్లాహ్ను స్తుతిస్తూ ఉంటారు. భోగభాగ్యాలను విడిచి ఉపవాసాలు ఉండి, తమ మనసును శుద్ధి చేసుకుంటారు. నమాజులో వంగి, సాష్టాంగం చేస్తూ అల్లాహ్ ముందు తమ నిమ్నతను చాటుకుంటారు. ప్రజలను మంచి పనుల వైపు, విశ్వాసం వైపు పిలుస్తారు; చెడు పనుల నుండి, షిర్క్ (అల్లాహ్కు భాగస్వాములను కల్పించడం) నుండి వారిని నిషేధిస్తారు. అల్లాహ్ నిర్ణయించిన హద్దులను జాగ్రత్తగా కాపాడుకుంటారు; ఆయన ఆజ్ఞలను పాటిస్తారు, నిషేధాలను విడిచిపెడతారు.
ఓ ప్రవక్తా! ఈ లక్షణాలు కలిగిన విశ్వాసులకు ఇహలోకంలోనూ, పరలోకంలోనూ సంతోషాన్ని కలిగించే శుభవార్తను అందించండి. వారికి అల్లాహ్ సంతృప్తి, ఆయన స్వర్గం లభిస్తాయి.
(వీరే అల్లాహ్ ముందు) పశ్చాత్తాప పడేవారు, ఆయనను ఆరాధించేవారు, స్తుతించేవారు (అల్లాహ్ మార్గంలో) సంచరించేవారు (ఉపవాసాలు చేసేవారు). ఆయన సన్నిధిలో వంగే (రుకూఉ చేసే) వారు, సాష్టాంగం (సజ్దా) చేసేవారు, ధర్మమును ఆదేశించేవారు మరియు ఆధర్మమును నిషేధించేవారు మరియు అల్లాహ్ విధించిన హద్దును పాటించేవారు కూడాను. మరియు విశ్వాసులకు శుభవార్త తెలుపు
వారి హృదయాలు ముక్కలైపోయి (వారు చనిపోయి) నంత వరకు, వారు కట్టిన కట్టడం వారి హృదయాలలో కలతలు పుట్టిస్తూ ఉంటుంది. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు
నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసుల నుండి వారి ప్రాణాలను వారి సంపదలను కొన్నాడు. కాబట్టి నిశ్చయంగా, వారి కొరకు స్వర్గముంది. వారు అల్లాహ్ మార్గంలో పోరాడి (తమ శత్రువులను) చంపుతారు మరియు చంపబడతారు. మరియు ఇది తౌరాత్, ఇంజీల్ మరియు ఖుర్ఆన్ లలో, ఆయన (అల్లాహ్) చేసిన వాగ్దానం, సత్యమైనది. మరియు తన వాగ్దానాన్ని నెరవేర్చటంలో అల్లాహ్ ను మించిన వాడు ఎవడు? కావున మీరు ఆయనతో చేసిన వ్యాపారానికి సంతోషపడండి. మరియు ఇదే ఆ గొప్ప విజయం
(వీరే అల్లాహ్ ముందు) పశ్చాత్తాప పడేవారు, ఆయనను ఆరాధించేవారు, స్తుతించేవారు (అల్లాహ్ మార్గంలో) సంచరించేవారు (ఉపవాసాలు చేసేవారు). ఆయన సన్నిధిలో వంగే (రుకూఉ చేసే) వారు, సాష్టాంగం (సజ్దా) చేసేవారు, ధర్మమును ఆదేశించేవారు మరియు ఆధర్మమును నిషేధించేవారు మరియు అల్లాహ్ విధించిన హద్దును పాటించేవారు కూడాను. మరియు విశ్వాసులకు శుభవార్త తెలుపు
అల్లాహ్ కు సాటి కల్పించే వారు (ముష్రికులు), దగ్గరి బంధువులైనా, వారు నరకవాసులని వ్యక్తమైన తరువాత కూడా, ప్రవక్తకు మరియు విశ్వాసులకు వారి క్షమాపణకై ప్రార్థించటం తగదు
మరియు ఇబ్రాహీమ్ తన తండ్రి క్షమాపణ కొరకు ప్రార్థించింది కేవలం అతను అతడి (తన తండ్రి)తో చేసిన వాగ్దానం వల్లనే. కాని అతనికి, అతడు (తన తండ్రి) నిశ్చయంగా అల్లాహ్ కు శత్రువని స్పష్టమైనప్పుడు, అతను (ఇబ్రాహీమ్) అతడిని విడనాడాడు. వాస్తవానికి ఇబ్రాహీమ్ వినయ విధేయతలతో (అల్లాహ్ ను) అర్థించేవాడు, సహనశీలుడు
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.