Wa kazaalika ba`asnaahum liyatasaaa`aloo bainahum; qaala qaaa`ilum minhum kam labistum qaaloo labisnaa yawman aw ba`da yawm; qaaloo Rabbukum a`almu bimaa labistum fab`asooo ahadakum biwariqikum haazihee ilal madeenati falyanzur ayyuhaaa azkaa ta`aaman falyaatikum birizqim minhu walyatalattaf wa laa yush`iranna bikum ahadaa
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
మరియు ఈ విధంగా (ఉన్న తరువాత), వారు ఒకరినొకరు ప్రశ్నించుకోవటానికి మేము వారిని (నిద్ర నుండి) లేపాము. వారిలో నుండి ఒకడు మాట్లాడుతూ ఇలా అన్నాడు: మీరు ఈ స్థితిలో ఎంత కాలమున్నారు?" వారన్నారు: మేము ఒక దినమో లేదా అంతకంటే తక్కువనో ఈ స్థితిలో ఉన్నాము." (మరికొందరు) ఇలా అన్నారు: మీరెంత కాలమున్నారో మీ ప్రభువుకే తెలుసు! మీలో ఒకనికి నాణ్యం (డబ్బు) ఇచ్చి పట్టణానికి పంపండి. అతడు అక్కడ శ్రేష్ఠమైన ఆహారాన్ని వెతికి, దానినే మీ కొరకు తినటానికి తెస్తాడు. అతడు జాగ్రత్తగా వ్యవహరించాలి మరియు మీ గురించి ఎవ్వడికీ తెలియనివ్వ గూడదు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
और (जिस तरह अपनी कुदरत से उनको सुलाया) उसी तरह (अपनी कुदरत से) उनको (जगा) उठाया ताकि आपस में कुछ पूछ गछ करें (ग़रज़) उनमें एक बोलने वाला बोल उठा कि (भई आख़िर इस ग़ार में) तुम कितनी मुद्दत ठहरे कहने लगे (अरे ठहरे क्या बस) एक दिन से भी कम उसके बाद कहने लगे कि जितनी देर तुम ग़ार में ठहरे उसको तुम्हारे परवरदिगार ही (कुछ तुम से) बेहतर जानता है (अच्छा) तो अब अपने में से किसी को अपना ये रुपया देकर शहर की तरफ भेजो तो वह (जाकर) देखभाल ले कि वहाँ कौन सा खाना बहुत अच्छा है फिर उसमें से (ज़रुरत भर) खाना तुम्हारे वास्ते ले आए और उसे चाहिए कि वह आहिस्ता चुपके से आ जाए और किसी को तुम्हारी ख़बर न होने दे
بَعَثْنَاهُمْ — మేము వారిని లేపాము (నిద్ర నుండి మేల్కొలిపాము).
لِيَتَسَاءَلُوا — వారు పరస్పరం ప్రశ్నించుకోవడానికి.
لَبِثْتُمْ — మీరు ఎంతకాలం ఉన్నారు (గడిపారు).
وَرِقِكُمْ — మీ వెండి నాణేలు (ధనం).
أَزْكَىٰ طَعَامًا — ఏ ఆహారం పవిత్రమైనది (హలాల్ మరియు శుభ్రమైనది).
وَلْيَتَلَطَّفْ — మరియు అతను మృదువుగా, జాగ్రత్తగా వ్యవహరించాలి.
وَلَا يُشْعِرَنَّ بِكُمْ أَحَدًا — మరియు మీ గురించి ఎవరికీ తెలియనివ్వకూడదు.
ఆయత్ వ్యాఖ్యానం:
మేము వారిని దీర్ఘకాలం నిద్రపోయేలా చేసినట్లే, అదే విధంగా మేము వారిని మేల్కొలిపాము — వారు తమలో తాము ఒకరినొకరు ప్రశ్నించుకోవడానికి. అప్పుడు వారిలో ఒకరు అడిగారు: "మీరు ఇక్కడ ఎంతకాలం గడిపారు?" అందుకు కొందరు: "మేము ఒక రోజు లేదా ఒక రోజులో కొంత భాగం ఉన్నాము" అని జవాబిచ్చారు. ఎందుకంటే వారు గుహలోకి ఉదయం ప్రవేశించారు, మేల్కొన్నప్పుడు సూర్యుడు కనిపించడంతో ఒక రోజు లేదా అంతకంటే తక్కువ కాలం అనుకున్నారు. అయితే ఈ విషయంలో వారికి సందేహం కలిగింది, కాబట్టి వారిలో కొందరు ఇలా అన్నారు: "మీరు ఎంతకాలం ఉన్నారో మీ ప్రభువుకే బాగా తెలుసు. ఈ విషయాన్ని అల్లాహ్కే వదిలేయండి, మనకు ముఖ్యమైన పని చేద్దాం." తరువాత వారు ఇలా సూచించారు: "మీలో ఒకరిని ఈ వెండి నాణేలతో పట్టణానికి పంపండి. అక్కడ ఏ ఆహారం హలాల్గా, పవిత్రంగా, శుభ్రంగా ఉందో చూసి, దాని నుండి మీకు కొంత ఆహారం తీసుకురావాలి. అతను చాలా జాగ్రత్తగా, మృదువుగా వ్యవహరించాలి — కొనుగోలు చేసేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు, ఎవరితోనూ మాట్లాడేటప్పుడు ఎటువంటి అనుమానం కలగకుండా ఉండాలి. మరియు మీ గురించి, మీ స్థలం గురించి ఎవరికీ తెలియనివ్వకూడదు." ఎందుకంటే వారి కాలంలోని ప్రజలు, ప్రత్యేకించి రాజు, వారిని హింసించేవారు; వారి గురించి తెలిస్తే ప్రమాదం ఉంటుందని వారు భయపడ్డారు.
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
అల్లాహ్ శక్తి అపారమైనది: ఆయన ఇష్టప్రకారం మనుషులను దీర్ఘకాలం నిద్రపోయేలా చేయగలడు, మేల్కొలపగలడు. ఇది ఆయన సర్వశక్తిమంతుడని రుజువు చేస్తుంది.
తెలియని విషయాలను అల్లాహ్కే వదిలేయడం: మనకు పూర్తిగా తెలియని విషయాలలో "అల్లాహ్కే బాగా తెలుసు" అని చెప్పి, ఆయనపై నమ్మకం ఉంచాలి. ఇది విశ్వాసుల లక్షణం.
హలాల్ మరియు పవిత్రమైన ఆహారం వెతకడం: ఆహారం విషయంలో హలాల్, తయ్యిబ్ (పవిత్రం, శుభ్రం) అయినది ఎంచుకోవాలి. ఇది ఇస
మరియు ఈ విధంగా (ఉన్న తరువాత), వారు ఒకరినొకరు ప్రశ్నించుకోవటానికి మేము వారిని (నిద్ర నుండి) లేపాము. వారిలో నుండి ఒకడు మాట్లాడుతూ ఇలా అన్నాడు: మీరు ఈ స్థితిలో ఎంత కాలమున్నారు?" వారన్నారు: మేము ఒక దినమో లేదా అంతకంటే తక్కువనో ఈ స్థితిలో ఉన్నాము." (మరికొందరు) ఇలా అన్నారు: మీరెంత కాలమున్నారో మీ ప్రభువుకే తెలుసు! మీలో ఒకనికి నాణ్యం (డబ్బు) ఇచ్చి పట్టణానికి పంపండి. అతడు అక్కడ శ్రేష్ఠమైన ఆహారాన్ని వెతికి, దానినే మీ కొరకు తినటానికి తెస్తాడు. అతడు జాగ్రత్తగా వ్యవహరించాలి మరియు మీ గురించి ఎవ్వడికీ తెలియనివ్వ గూడదు
మరియు వారు (ఆ గుహలోని) ఒక విశాలమైన భాగంలో (నిద్రిస్తూ) ఉన్నప్పుడు; సూర్యుడు ఉదయించే టప్పుడు, (ఎండ) వారి గుహ నుండి కుడి ప్రక్కకు వాలి పోవటాన్ని మరియు అస్తమించేటప్పుడు (ఎండ) ఎడమ ప్రక్కకు తొలగి పోవటాన్ని నీవు చూసి ఉంటావు. ఇది అల్లాహ్ సూచనలలో ఒకటి. అల్లాహ్ మార్గదర్శకత్వం చేసినవాడే సన్మార్గం పొందుతాడు. ఆయన మార్గభ్రష్టత్వంలో వదలిన వాడికి సరైన మార్గం చూపే సంరక్షకుడిని నీవు పొందలేవు
మరియు వారు నిద్రపోతున్నప్పటికీ, నీవు వారిని మేల్కొని ఉన్నారనే భావించి ఉంటావు! మరియు మేము వారిని కుడి ప్రక్కకు మరియు ఎడమ ప్రక్కకు మరలించే వారము. మరియు వారి కుక్క గుహద్వారం వద్ద తన ముందు కాళ్ళను చాచి పడి ఉండెను. ఒకవేళ నీవు వారిని తొంగిచూసి ఉంటే, నీవు తప్పక వెనుదిరిగి పారిపోయే వాడవు మరియు వారిని గురించి భయకంపితుడవై పోయేవాడవు
మరియు ఈ విధంగా (ఉన్న తరువాత), వారు ఒకరినొకరు ప్రశ్నించుకోవటానికి మేము వారిని (నిద్ర నుండి) లేపాము. వారిలో నుండి ఒకడు మాట్లాడుతూ ఇలా అన్నాడు: మీరు ఈ స్థితిలో ఎంత కాలమున్నారు?" వారన్నారు: మేము ఒక దినమో లేదా అంతకంటే తక్కువనో ఈ స్థితిలో ఉన్నాము." (మరికొందరు) ఇలా అన్నారు: మీరెంత కాలమున్నారో మీ ప్రభువుకే తెలుసు! మీలో ఒకనికి నాణ్యం (డబ్బు) ఇచ్చి పట్టణానికి పంపండి. అతడు అక్కడ శ్రేష్ఠమైన ఆహారాన్ని వెతికి, దానినే మీ కొరకు తినటానికి తెస్తాడు. అతడు జాగ్రత్తగా వ్యవహరించాలి మరియు మీ గురించి ఎవ్వడికీ తెలియనివ్వ గూడదు
ఒకవేళ వారు మిమ్మల్ని గుర్తు పడితే, వారు తప్పక మిమ్మల్ని రాళ్ళు రువ్వి చంపుతారు లేదా (బలవంతంగా) మిమ్మల్ని వారి మతంలోకి త్రిప్పుకుంటారు, అలాంటప్పుడు మీరు ఎలాంటి సాఫల్యం పొందలేరు
మరియు ఈ విధంగా అల్లాహ్ వాగ్దానం సత్యమని చివరి ఘడియ నిశ్చయమని, అది రావటంలో ఎలాంటి సందేహం లేదని తెలుసుకోవటానికి, ఆ యువకుల విషయం ప్రజలకు తెలియజేశాము. అప్పుడు వారు (ప్రజలు) వారి (గుహవాసుల) విషయాన్ని తీసుకొని పరస్పరం వాదులాడుకున్న విషయం (జ్ఞాపకం చేసుకోండి!) వారిలో కొందరన్నారు: వారి కొరకు ఒక స్మారక భవనం నిర్మించాలి." వారి విషయం వారి ప్రభువుకే తెలుసు. ఆ వ్యవహారంలో పైచేయి (ప్రాబల్యం) ఉన్నవారు: వారి స్మారకంగా ఒక మస్జిద్ ను నిర్మించాలి." అని అన్నారు
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.