Illaa tansuroohu faqad nasarahul laahu iz akhrajahul lazeena kafaroo saaniyasnaini iz humaa filghaari iz yaqoolu lisaahibihee la tahzan innnal laaha ma`anaa fa anzalallaahu sakeenatahoo `alaihi wa aiyadahoo bijunoodil lam tarawhaa wa ja`ala kalimatal lazeena kafarus suflaa; wa Kalimatul laahi hiyal `ulyaa; wallaahu `Azeezun Hakeem
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
ఒకవేళ మీరు అతనికి (ప్రవక్తకు) సహాయం చేయకపోతే ఏం ఫర్వాలేదు! (అల్లాహ్ అతనికి తప్పక సహాయం చేస్తాడు). ఏ విధంగానైతే, సత్యతిరస్కారులు అతనిని పారద్రోలి నపుడు, అల్లాహ్ అతనికి సహాయం చేశాడో! అప్పుడు అతను ఇద్దరిలో రెండవ వాడిగా (సౌర్) గుహలో ఉన్నప్పుడు అతను తన తోటి వానితో (అబూ బక్ర్ తో): నీవు దుఃఖ పడకు, నిశ్చయంగా అల్లాహ్ మనతో ఉన్నాడు!" అని అన్నాడు. అప్పుడు అల్లాహ్! అతనిపై తన తరఫు నుండి మనశ్శాంతిని అవతరింపజేశాడు. అతనిని మీకు కనిపించని (దైవదూతల) దళాలతో సహాయం చేసి సత్యతిరస్కారుల మాటను కించపరచాడు. మరియు అల్లాహ్ మాట సదా సర్వోన్నతమైనదే. మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహో వివేచనాపరుడు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
अगर तुम उस रसूल की मदद न करोगे तो (कुछ परवाह् नहीं ख़ुदा मददगार है) उसने तो अपने रसूल की उस वक्त मदद की जब उसकी कुफ्फ़ार (मक्का) ने (घर से) निकल बाहर किया उस वक्त सिर्फ (दो आदमी थे) दूसरे रसूल थे जब वह दोनो ग़ार (सौर) में थे जब अपने साथी को (उसकी गिरिया व ज़ारी (रोने) पर) समझा रहे थे कि घबराओ नहीं ख़ुदा यक़ीनन हमारे साथ है तो ख़ुदा ने उन पर अपनी (तरफ से) तसकीन नाज़िल फरमाई और (फ़रिश्तों के) ऐसे लश्कर से उनकी मदद की जिनको तुम लोगों ने देखा तक नहीं और ख़ुदा ने काफिरों की बात नीची कर दिखाई और ख़ुदा ही का बोल बाला है और ख़ुदा तो ग़ालिब हिकमत वाला है
الْغَارِ (అల్గార్): గుహ. ఇక్కడ మక్కాలోని సౌర్ పర్వతంలోని గుహను సూచిస్తుంది.
سَكِينَتَهُ (సకీనతహు): ప్రశాంతత, మనశ్శాంతి.
أَيَّدَهُ (అయ్యదహు): అతనిని బలపరిచాడు, ఆదుకున్నాడు.
كَلِمَةَ الَّذِينَ كَفَرُوا (కలిమతల్లజీన కఫరూ): అవిశ్వాసుల మాట, వారి పిలుపు.
السُّفْلَى (అస్సుఫ్లా): అధమమైనది, తక్కువైనది.
الْعُلْيَا (అల్ఉల్యా): ఉన్నతమైనది, గొప్పది.
عَزِيزٌ (అజీజున్): సర్వశక్తిమంతుడు, ఎవరూ ఓడించలేని వాడు.
حَكِيمٌ (హకీమున్): వివేకవంతుడు, జ్ఞాని.
ఆయత్ వ్యాఖ్యానం:
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు సహాయం చేయకపోయినా, జిహాద్ కోసం ఆయన పిలుపునిచ్చినప్పుడు మీరు స్పందించకపోయినా, అల్లాహ్ తన ప్రవక్తను ఎప్పుడూ ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు. గుర్తుంచుకోండి, అవిశ్వాసులు ఆయనను మక్కా నుండి వెళ్ళగొట్టిన సమయంలో, ఆయనకు ఎవరూ తోడుగా లేని స్థితిలో, కేవలం ఇద్దరే — ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) — సౌర్ పర్వతంలోని గుహలో దాక్కున్నప్పుడు అల్లాహ్ ఆయనకు సహాయం చేశాడు. ఆ సమయంలో శత్రువులు దగ్గరకు వచ్చేస్తున్నారని అబూ బక్ర్ ఆందోళన చెందుతుండగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయనతో ఇలా అన్నారు: "భయపడకు, ఆందోళన చెందకు! నిశ్చయంగా అల్లాహ్ మనతో ఉన్నాడు — తన రక్షణతో, తన సహాయంతో." అప్పుడు అల్లాహ్ తన ప్రవక్త హృదయంపై ప్రశాంతతను అవతరింపజేశాడు, మరియు మీరు చూడలేని సైన్యాలతో — అంటే దేవదూతలతో — ఆయనను బలపరిచాడు. ఆ దేవదూతలే శత్రువుల కళ్ళకు గుహ కనిపించకుండా చేశారు, వారి హృదయాల్లో భయాన్ని నింపారు. అల్లాహ్ అవిశ్వాసుల మాటను — అంటే వారి అవిశ్వాస పిలుపును — అధమం చేశాడు, తక్కువ చేశాడు. మరియు అల్లాహ్ మాట — అంటే ఇస్లాం పిలుపు — అదే సర్వోన్నతమైనది, గొప్పది. అల్లాహ్ సర్వశక్తిమంతుడు, ఎవరూ ఆయనను ఓడించలేరు; ఆయన సర్వజ్ఞాని, తన సృష్టి యొక్క పనులను, విధిని, శాసనాన్ని వివేకంతో నిర్వహించేవాడు.
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
అల్లాహ్ తన ప్రవక్తను ఆదుకున్నాడు, ఎవరి సహాయం లేకుండానే ఆయనను విజయవంతం చేశాడు. ఇది అల్లాహ్ యొక్క శక్తిని, ఆయన వాగ్దానం నెరవేరుతుందని నమ్మకాన్ని పెంచ
ఒకవేళ మీరు అతనికి (ప్రవక్తకు) సహాయం చేయకపోతే ఏం ఫర్వాలేదు! (అల్లాహ్ అతనికి తప్పక సహాయం చేస్తాడు). ఏ విధంగానైతే, సత్యతిరస్కారులు అతనిని పారద్రోలి నపుడు, అల్లాహ్ అతనికి సహాయం చేశాడో! అప్పుడు అతను ఇద్దరిలో రెండవ వాడిగా (సౌర్) గుహలో ఉన్నప్పుడు అతను తన తోటి వానితో (అబూ బక్ర్ తో): నీవు దుఃఖ పడకు, నిశ్చయంగా అల్లాహ్ మనతో ఉన్నాడు!" అని అన్నాడు. అప్పుడు అల్లాహ్! అతనిపై తన తరఫు నుండి మనశ్శాంతిని అవతరింపజేశాడు. అతనిని మీకు కనిపించని (దైవదూతల) దళాలతో సహాయం చేసి సత్యతిరస్కారుల మాటను కించపరచాడు. మరియు అల్లాహ్ మాట సదా సర్వోన్నతమైనదే. మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహో వివేచనాపరుడు
ఓ విశ్వాసులారా! మీకేమయింది? మీతో: అల్లాహ్ మార్గంలో బయలు దేరండి." అని చెప్పినపుడు మీరు భూమికి అతుక్కొని పోతున్నారేమిటి? ఏమీ? మీరు పరలోకాన్ని వదలి, ఇహలోక జీవితంతోనే తృప్తి పడదలచుకున్నారా? కాని ఇహలోక జీవిత సుఖం పరలోక (జీవిత సుఖాల ముందు) ఎంతో అల్పమైనది
మీరు బయలు దేరకపోతే, ఆయన మీకు బాధాకరమైన శిక్షను విధిస్తాడు. మరియు మీకు బదులుగా మరొక జాతిని మీ స్థానంలో తెస్తాడు. మరియు మీరు ఆయనకు ఎలాంటి నష్టం కలిగించలేరు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు
ఒకవేళ మీరు అతనికి (ప్రవక్తకు) సహాయం చేయకపోతే ఏం ఫర్వాలేదు! (అల్లాహ్ అతనికి తప్పక సహాయం చేస్తాడు). ఏ విధంగానైతే, సత్యతిరస్కారులు అతనిని పారద్రోలి నపుడు, అల్లాహ్ అతనికి సహాయం చేశాడో! అప్పుడు అతను ఇద్దరిలో రెండవ వాడిగా (సౌర్) గుహలో ఉన్నప్పుడు అతను తన తోటి వానితో (అబూ బక్ర్ తో): నీవు దుఃఖ పడకు, నిశ్చయంగా అల్లాహ్ మనతో ఉన్నాడు!" అని అన్నాడు. అప్పుడు అల్లాహ్! అతనిపై తన తరఫు నుండి మనశ్శాంతిని అవతరింపజేశాడు. అతనిని మీకు కనిపించని (దైవదూతల) దళాలతో సహాయం చేసి సత్యతిరస్కారుల మాటను కించపరచాడు. మరియు అల్లాహ్ మాట సదా సర్వోన్నతమైనదే. మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహో వివేచనాపరుడు
తేలికగానైనా సరే, బరువుగా నైనా సరే బయలుదేరండి. మరియు మీ సంపదలతో మరియు మీ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడండి. ఒకవేళ మీరిది తెలుసుకో గలిగితే, ఇది మీకెంతో ఉత్తమమైనది
అది తొందరగా దొరికే లాభం మరియు సులభమైన ప్రయాణం అయితే వారు తప్పక నీ వెంట వెళ్ళేవారు. కాని వారికది (తబూక్ ప్రయాణం) చాలా కష్టమైనదిగా (దూరమైనదిగా) అనిపించింది. కావున వారు అల్లాహ్ పై ప్రమాణం చేస్తూ అంటున్నారు: మేము రాగల స్థితిలో ఉంటే తప్పక మీ వెంట వచ్చి ఉండేవారము." (ఈ విధంగా అబద్ధమాడి) వారు తమను తాము నాశనం చేసుకుంటున్నారు. మరియు వారు అబద్ధమాడుతున్నారని అల్లాహ్ కు బాగా తెలుసు
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.