సూరా అద్-దారియాత్ అరబిక్ మరియు తెలుగు

సూరా అద్-దారియాత్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (60 వచనం — مكية). అద్-దారియాత్ వినండి, అద్-దారియాత్ అనువాదం, అద్-దారియాత్ mp3, అద్-దారియాత్ pdf.

సూరా అద్-దారియాత్ చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
وَالذَّارِيَاتِ ذَرْوًا ۝١
📖 అనువాదం వచనం 1
దుమ్ము ఎగురవేసే వాటి (గాలుల) సాక్షిగా
فَالْحَامِلَاتِ وِقْرًا ۝٢
📖 అనువాదం వచనం 2
మరియు (నీటి) భారాన్ని మోసే (మేఘాల)
فَالْجَارِيَاتِ يُسْرًا ۝٣
📖 అనువాదం వచనం 3
మరియు సముద్రంలో సులభంగా తేలియాడే (ఓడల)
فَالْمُقَسِّمَاتِ أَمْرًا ۝٤
📖 అనువాదం వచనం 4
మరియు (ఆయన) ఆజ్ఞతో (అనుగ్రహాలను) పంచిపెట్టే (దేవదూతల సాక్షిగా)
إِنَّمَا تُوعَدُونَ لَصَادِقٌ ۝٥
📖 అనువాదం వచనం 5
నిశ్చయంగా, మీకు చేయబడ్డ వాగ్దానం సత్యం
وَإِنَّ الدِّينَ لَوَاقِعٌ ۝٦
📖 అనువాదం వచనం 6
మరియు నిశ్చయంగా తీర్పు రానున్నది
وَالسَّمَاءِ ذَاتِ الْحُبُكِ ۝٧
📖 అనువాదం వచనం 7
మార్గాలతో నిండిన ఆకాశం సాక్షిగా
إِنَّكُمْ لَفِي قَوْلٍ مُّخْتَلِفٍ ۝٨
📖 అనువాదం వచనం 8
నిశ్చయంగా, మీరు భేదాభిప్రాయాలలో పడి ఉన్నారు
يُؤْفَكُ عَنْهُ مَنْ أُفِكَ ۝٩
📖 అనువాదం వచనం 9
(సత్యం నుండి) మరలింపబడిన వాడే, మోసగింపబడిన వాడు
قُتِلَ الْخَرَّاصُونَ ۝١٠
📖 అనువాదం వచనం 10
ఆధారం లేని అభిప్రాయాలు గలవారే నాశనం చేయబడేవారు
الَّذِينَ هُمْ فِي غَمْرَةٍ سَاهُونَ ۝١١
📖 అనువాదం వచనం 11
ఎవరైతే నిర్లక్ష్యంలో పడి అశ్రద్ధగా ఉన్నారో
يَسْأَلُونَ أَيَّانَ يَوْمُ الدِّينِ ۝١٢
📖 అనువాదం వచనం 12
వారు ఇలా అడుగుతున్నారు: తీర్పుదినం ఎప్పుడు రానున్నది
يَوْمَ هُمْ عَلَى النَّارِ يُفْتَنُونَ ۝١٣
📖 అనువాదం వచనం 13
ఆ దినమున, వారు అగ్నితో దహింపబడతారు (పరీక్షింపబడతారు)
ذُوقُوا فِتْنَتَكُمْ هَٰذَا الَّذِي كُنتُم بِهِ تَسْتَعْجِلُونَ ۝١٤
📖 అనువాదం వచనం 14
(వారితో ఇలా అనబడుతుంది): మీ పరీక్షను రుచి చూడండి! మీరు దీని కొరకే తొందర పెట్టేవారు
إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَعُيُونٍ ۝١٥
📖 అనువాదం వచనం 15
నిశ్చయంగా, దైవభీతి గలవారు చెలమలు గల స్వర్గవనాలలో ఉంటారు
آخِذِينَ مَا آتَاهُمْ رَبُّهُمْ ۚ إِنَّهُمْ كَانُوا قَبْلَ ذَٰلِكَ مُحْسِنِينَ ۝١٦
📖 అనువాదం వచనం 16
తమ ప్రభువు తమకు ప్రసాదించిన వాటితో సంతోషపడుతూ! నిశ్చయంగా వారు అంతకు పూర్వం సజ్జనులై ఉండేవారు
كَانُوا قَلِيلًا مِّنَ اللَّيْلِ مَا يَهْجَعُونَ ۝١٧
📖 అనువాదం వచనం 17
వారు రాత్రివేళలో చాలా తక్కువగా నిద్రపోయేవారు
وَبِالْأَسْحَارِ هُمْ يَسْتَغْفِرُونَ ۝١٨
📖 అనువాదం వచనం 18
మరియు వారు రాత్రి చివరి ఘడియలలో క్షమాపణ వేడుకునే వారు
وَفِي أَمْوَالِهِمْ حَقٌّ لِّلسَّائِلِ وَالْمَحْرُومِ ۝١٩
📖 అనువాదం వచనం 19
మరియు వారి సంపదలో యాచించే వారికి మరియు ఆవశ్యకత గలవారికి హక్కు ఉంటుంది
وَفِي الْأَرْضِ آيَاتٌ لِّلْمُوقِنِينَ ۝٢٠
📖 అనువాదం వచనం 20
మరియు భూమిలో కూడా నమ్మేవారి కొరకు ఎన్నో నిదర్శనాలు (ఆయాత్) ఉన్నాయి
وَفِي أَنفُسِكُمْ ۚ أَفَلَا تُبْصِرُونَ ۝٢١
📖 అనువాదం వచనం 21
మరియు స్వయంగా మీలో కూడా ఉన్నాయి. ఏమీ? మీరు చూడలేరా
وَفِي السَّمَاءِ رِزْقُكُمْ وَمَا تُوعَدُونَ ۝٢٢
📖 అనువాదం వచనం 22
మరియు ఆకాశంలో మీ జీవనోపాధి మరియు మీకు వాగ్దానం చేయబడినది ఉంది
فَوَرَبِّ السَّمَاءِ وَالْأَرْضِ إِنَّهُ لَحَقٌّ مِّثْلَ مَا أَنَّكُمْ تَنطِقُونَ ۝٢٣
📖 అనువాదం వచనం 23
కావున భూమ్యాకాశాల ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, ఇది సత్యం; ఏ విధంగానైతే మీరు మాట్లాడగలిగేది (సత్యమో)
هَلْ أَتَاكَ حَدِيثُ ضَيْفِ إِبْرَاهِيمَ الْمُكْرَمِينَ ۝٢٤
📖 అనువాదం వచనం 24
ఏమీ? ఇబ్రాహీమ్ యొక్క గౌరవనీయులైన అతిథుల గాథ నీకు చేరిందా
إِذْ دَخَلُوا عَلَيْهِ فَقَالُوا سَلَامًا ۖ قَالَ سَلَامٌ قَوْمٌ مُّنكَرُونَ ۝٢٥
📖 అనువాదం వచనం 25
వారు అతని వద్దకు వచ్చినపుడు: మీకు సలాం!" అని అన్నారు. అతను: మీకూ సలాం!" అని జవాబిచ్చి : మీరు పరిచయం లేని (కొత్త) వారుగా ఉన్నారు." అని అన్నాడు
فَرَاغَ إِلَىٰ أَهْلِهِ فَجَاءَ بِعِجْلٍ سَمِينٍ ۝٢٦
📖 అనువాదం వచనం 26
తరువాత అతను తన ఇంటిలోకి పోయి బలిసిన (వేయించిన) ఒక ఆవు దూడను తీసుకొని వచ్చాడు
فَقَرَّبَهُ إِلَيْهِمْ قَالَ أَلَا تَأْكُلُونَ ۝٢٧
📖 అనువాదం వచనం 27
దానిని వారి ముందుకు జరిపి: ఏమీ? మీరెందుకు తినటం లేదు?" అని అడిగాడు
فَأَوْجَسَ مِنْهُمْ خِيفَةً ۖ قَالُوا لَا تَخَفْ ۖ وَبَشَّرُوهُ بِغُلَامٍ عَلِيمٍ ۝٢٨
📖 అనువాదం వచనం 28
(వారు తినకుండా ఉండటం చూసి), వారి నుండి భయపడ్డాడు. వారన్నారు: భయపడకు!" మరియు వారు అతనికి జ్ఞానవంతుడైన కుమారుని శుభవార్తనిచ్చారు
فَأَقْبَلَتِ امْرَأَتُهُ فِي صَرَّةٍ فَصَكَّتْ وَجْهَهَا وَقَالَتْ عَجُوزٌ عَقِيمٌ ۝٢٩
📖 అనువాదం వచనం 29
అప్పుడతని భార్య అరుస్తూ వారి ముందుకు వచ్చి, తన చేతిని నుదుటి మీద కొట్టుకుంటూ: నేను ముసలిదాన్ని, గొడ్రాలను కదా!" అని అన్నది
قَالُوا كَذَٰلِكِ قَالَ رَبُّكِ ۖ إِنَّهُ هُوَ الْحَكِيمُ الْعَلِيمُ ۝٣٠
📖 అనువాదం వచనం 30
వారన్నారు: నీ ప్రభువు ఇలాగే అన్నాడు! నిశ్చయంగా, ఆయన మహావివేకవంతుడు, సర్వజ్ఞుడు
۞ قَالَ فَمَا خَطْبُكُمْ أَيُّهَا الْمُرْسَلُونَ ۝٣١
📖 అనువాదం వచనం 31
(ఇబ్రాహీమ్) అడిగాడు: ఓ సందేశహరులారా (ఓ దేవదూతలారా)! అయితే మీరు వచ్చిన కారణమేమిటి
قَالُوا إِنَّا أُرْسِلْنَا إِلَىٰ قَوْمٍ مُّجْرِمِينَ ۝٣٢
📖 అనువాదం వచనం 32
వారన్నారు: వాస్తవానికి, మేము నేరస్థులైన జనుల వైపునకు పంపబడ్డాము
لِنُرْسِلَ عَلَيْهِمْ حِجَارَةً مِّن طِينٍ ۝٣٣
📖 అనువాదం వచనం 33
వారి మీద (కాల్చబడిన) మట్టి రాళ్ళను కురిపించటం కోసం
مُّسَوَّمَةً عِندَ رَبِّكَ لِلْمُسْرِفِينَ ۝٣٤
📖 అనువాదం వచనం 34
నీ ప్రభువు తరఫు నుండి గుర్తు వేయబడిన (రాళ్ళు); మితిమీరి ప్రవర్తించేవారి కొరకు
فَأَخْرَجْنَا مَن كَانَ فِيهَا مِنَ الْمُؤْمِنِينَ ۝٣٥
📖 అనువాదం వచనం 35
అప్పుడు మేము అందులో ఉన్న విశ్వాసులందరినీ బయటికి తీశాము
فَمَا وَجَدْنَا فِيهَا غَيْرَ بَيْتٍ مِّنَ الْمُسْلِمِينَ ۝٣٦
📖 అనువాదం వచనం 36
మేము అందు ఒక్క గృహం తప్ప! ఇతర విధేయుల (ముస్లింల) గృహాన్ని చూడలేదు
وَتَرَكْنَا فِيهَا آيَةً لِّلَّذِينَ يَخَافُونَ الْعَذَابَ الْأَلِيمَ ۝٣٧
📖 అనువాదం వచనం 37
మరియు బాధాకరమైన శిక్షకు భయపడేవారి కొరకు, మేము అక్కడ ఒక సూచన (ఆయత్) ను వదలి పెట్టాము
وَفِي مُوسَىٰ إِذْ أَرْسَلْنَاهُ إِلَىٰ فِرْعَوْنَ بِسُلْطَانٍ مُّبِينٍ ۝٣٨
📖 అనువాదం వచనం 38
ఇక మూసా (గాథలో) కూడా (ఒక సూచన వుంది) మేము అతనిని ఫిర్ఔన్ వద్దకు స్పష్టమైన ప్రమాణంతో పంపినపుడు
فَتَوَلَّىٰ بِرُكْنِهِ وَقَالَ سَاحِرٌ أَوْ مَجْنُونٌ ۝٣٩
📖 అనువాదం వచనం 39
అతడు (ఫిర్ఔన్) తన సభాసదులతో సహా మరలిపోతూ, ఇలా అన్నాడు: ఇతడు మాంత్రికుడు లేదా పిచ్చివాడు
فَأَخَذْنَاهُ وَجُنُودَهُ فَنَبَذْنَاهُمْ فِي الْيَمِّ وَهُوَ مُلِيمٌ ۝٤٠
📖 అనువాదం వచనం 40
కావున మేము అతనిని మరియు అతని సైనికులను పట్టుకొని, వారందరినీ సముద్రంలో ముంచి వేశాము మరియు దానికి అతడే నిందితుడు
وَفِي عَادٍ إِذْ أَرْسَلْنَا عَلَيْهِمُ الرِّيحَ الْعَقِيمَ ۝٤١
📖 అనువాదం వచనం 41
ఇక ఆద్ జాతి వారిలో కూడా (ఒక సూచన వుంది): మేము వారిపై వినాశకరమైన గాలిని పంపినప్పుడు
مَا تَذَرُ مِن شَيْءٍ أَتَتْ عَلَيْهِ إِلَّا جَعَلَتْهُ كَالرَّمِيمِ ۝٤٢
📖 అనువాదం వచనం 42
అది దేని పైనయితే వీచిందో, దానిని క్షీణింపజేయకుండా వదలలేదు
وَفِي ثَمُودَ إِذْ قِيلَ لَهُمْ تَمَتَّعُوا حَتَّىٰ حِينٍ ۝٤٣
📖 అనువాదం వచనం 43
మరియు సమూద్ జాతి వారి గాథలో కూడా (ఒక సూచన ఉంది). వారితో: కొంతకాలం మీరు సుఖసంతోషాలను అనుభవించండి." అని అన్నాము
فَعَتَوْا عَنْ أَمْرِ رَبِّهِمْ فَأَخَذَتْهُمُ الصَّاعِقَةُ وَهُمْ يَنظُرُونَ ۝٤٤
📖 అనువాదం వచనం 44
అప్పుడు వారు తమ ప్రభువు ఆజ్ఞను ఉపేక్షించారు. కావున వారు చూస్తూ ఉండగానే ఒక పెద్ద పిడుగు వారి మీద విరుచుకు పడింది
فَمَا اسْتَطَاعُوا مِن قِيَامٍ وَمَا كَانُوا مُنتَصِرِينَ ۝٤٥
📖 అనువాదం వచనం 45
అప్పుడు వారికి లేచి నిలబడే శక్తి కూడా లేకపోయింది మరియు వారు తమను తాము కూడా కాపాడు కోలేక పోయారు
وَقَوْمَ نُوحٍ مِّن قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا قَوْمًا فَاسِقِينَ ۝٤٦
📖 అనువాదం వచనం 46
మరియు దీనికి ముందు నూహ్ జాతి వారిని కూడా (నాశనం చేశాము). నిశ్చయంగా, వారు కూడా అవిధేయులు
وَالسَّمَاءَ بَنَيْنَاهَا بِأَيْدٍ وَإِنَّا لَمُوسِعُونَ ۝٤٧
📖 అనువాదం వచనం 47
మరియు ఆకాశాన్ని మేము (మా) చేతులతో నిర్మించాము. మరియు నిశ్చయంగా, మేమే దానిని విస్తరింపజేయ గలవారము
وَالْأَرْضَ فَرَشْنَاهَا فَنِعْمَ الْمَاهِدُونَ ۝٤٨
📖 అనువాదం వచనం 48
మరియు భూమిని మేము పరుపుగా చేశాము, మేమే చక్కగా పరిచేవారము
وَمِن كُلِّ شَيْءٍ خَلَقْنَا زَوْجَيْنِ لَعَلَّكُمْ تَذَكَّرُونَ ۝٤٩
📖 అనువాదం వచనం 49
మరియు మేము ప్రతిదానిని జంటలుగా సృష్టించాము, మీరు గ్రహించాలని
فَفِرُّوا إِلَى اللَّهِ ۖ إِنِّي لَكُم مِّنْهُ نَذِيرٌ مُّبِينٌ ۝٥٠
📖 అనువాదం వచనం 50
కావున మీరు అల్లాహ్ వైపునకు పరుగెత్తండి. నిశ్చయంగా, నేను (ముహమ్మద్) ఆయన తరఫు నుండి మీకు స్పష్టంగా హెచ్చరిక చేసేవాడిని మాత్రమే
وَلَا تَجْعَلُوا مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ ۖ إِنِّي لَكُم مِّنْهُ نَذِيرٌ مُّبِينٌ ۝٥١
📖 అనువాదం వచనం 51
మరియు మీరు అల్లాహ్ కు సాటిగా ఇతర దైవాన్ని నిలుపకండి! నిశ్చయంగా, నేను (ముహమ్మద్) ఆయన తరఫు నుండి మీకు స్పష్టంగా హెచ్చరిక చేసేవాడిని మాత్రమే
كَذَٰلِكَ مَا أَتَى الَّذِينَ مِن قَبْلِهِم مِّن رَّسُولٍ إِلَّا قَالُوا سَاحِرٌ أَوْ مَجْنُونٌ ۝٥٢
📖 అనువాదం వచనం 52
ఇదే విధంగా, వారికి పూర్వం గడిచిన వారి వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వారు: ఇతను మాంత్రికుడు లేదా పిచ్చివాడు." అని అనకుండా ఉండలేదు
أَتَوَاصَوْا بِهِ ۚ بَلْ هُمْ قَوْمٌ طَاغُونَ ۝٥٣
📖 అనువాదం వచనం 53
ఏమీ? దీనిని (ఇలా పలుకుటను) వారు ఒకరికొకరు వారసత్వంగా ఇచ్చుకున్నారా? అలా కాదు! అసలు వారు తలబిరుసుతనంతో ప్రవర్తించే జనం
فَتَوَلَّ عَنْهُمْ فَمَا أَنتَ بِمَلُومٍ ۝٥٤
📖 అనువాదం వచనం 54
కావున నీవు వారి నుండి మరలిపో, ఇక నీపై ఎలాంటి నింద లేదు
وَذَكِّرْ فَإِنَّ الذِّكْرَىٰ تَنفَعُ الْمُؤْمِنِينَ ۝٥٥
📖 అనువాదం వచనం 55
మరియు వారిని ఉపదేశిస్తూ వుండు, నిశ్చయంగా, ఉపదేశం విశ్వాసులకు ప్రయోజనకర మవుతుంది
وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ ۝٥٦
📖 అనువాదం వచనం 56
మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే
مَا أُرِيدُ مِنْهُم مِّن رِّزْقٍ وَمَا أُرِيدُ أَن يُطْعِمُونِ ۝٥٧
📖 అనువాదం వచనం 57
నేను వారి నుండి ఎలాంటి జీవనోపాధిని కోరటం లేదు మరియు వారు నాకు ఆహారం పెట్టాలని కూడా కోరటం లేదు
إِنَّ اللَّهَ هُوَ الرَّزَّاقُ ذُو الْقُوَّةِ الْمَتِينُ ۝٥٨
📖 అనువాదం వచనం 58
నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే ఉపాధి ప్రదాత, మహా బలవంతుడు, స్థైర్యం గలవాడు
فَإِنَّ لِلَّذِينَ ظَلَمُوا ذَنُوبًا مِّثْلَ ذَنُوبِ أَصْحَابِهِمْ فَلَا يَسْتَعْجِلُونِ ۝٥٩
📖 అనువాదం వచనం 59
కావున నిశ్చయంగా, దుర్మార్గానికి పాల్పడినవారి పాపాలు వారి (పూర్వ) స్నేహితుల పాపాల వంటివే! కావున వారు నా (శిక్ష కొరకు) తొందర పెట్టనవసరం లేదు
فَوَيْلٌ لِّلَّذِينَ كَفَرُوا مِن يَوْمِهِمُ الَّذِي يُوعَدُونَ ۝٦٠
📖 అనువాదం వచనం 60
కావున సత్యతిరస్కారులకు వినాశం గలదు - వారికి వాగ్దానం చేయబడిన - ఆ దినమున
← 50 అద్-దారియాత్ (51/114) 52 →
చదవండి సూరా అద్-దారియాత్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

51الذاريات Adh-Dhariyat 📚 60 వచనం مكية

వచనానికి వచనం – సూరా అద్-దారియాత్ — 60 వచనం




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers