సూరా అష్-షమ్స్ అరబిక్ మరియు తెలుగు

సూరా అష్-షమ్స్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (15 వచనం — مكية). అష్-షమ్స్ వినండి, అష్-షమ్స్ అనువాదం, అష్-షమ్స్ mp3, అష్-షమ్స్ pdf.

సూరా అష్-షమ్స్ చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
وَالشَّمْسِ وَضُحَاهَا ۝١
📖 అనువాదం వచనం 1
సూర్యుని మరియు దాని ఎండ సాక్షిగా
وَالْقَمَرِ إِذَا تَلَاهَا ۝٢
📖 అనువాదం వచనం 2
దాని వెనుక వచ్చే చంద్రుని సాక్షిగా
وَالنَّهَارِ إِذَا جَلَّاهَا ۝٣
📖 అనువాదం వచనం 3
ప్రకాశించే పగటి సాక్షిగా
وَاللَّيْلِ إِذَا يَغْشَاهَا ۝٤
📖 అనువాదం వచనం 4
దానిని క్రమ్ముకునే, రాత్రి సాక్షిగా
وَالسَّمَاءِ وَمَا بَنَاهَا ۝٥
📖 అనువాదం వచనం 5
ఆకాశం మరియు దానిని నిర్మించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా
وَالْأَرْضِ وَمَا طَحَاهَا ۝٦
📖 అనువాదం వచనం 6
భూమి మరియు దానిని విస్తరింపజేసిన ఆయన సాక్షిగా
وَنَفْسٍ وَمَا سَوَّاهَا ۝٧
📖 అనువాదం వచనం 7
మానవ ఆత్మ మరియు దానిని తీర్చిదిద్దిన ఆయన సాక్షిగా
فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَاهَا ۝٨
📖 అనువాదం వచనం 8
ఆ తరువాత ఆయనే దానికి దుష్టతనాన్ని మరియు దైవభీతిని తెలియజేశాడు
قَدْ أَفْلَحَ مَن زَكَّاهَا ۝٩
📖 అనువాదం వచనం 9
వాస్తవానికి తన ఆత్మను శుద్ధపరచుకున్నవాడే సఫలుడవుతాడు
وَقَدْ خَابَ مَن دَسَّاهَا ۝١٠
📖 అనువాదం వచనం 10
మరియు వాస్తవానికి దానిని అణగ ద్రొక్కిన వాడే విఫలుడవుతాడు
كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَاهَا ۝١١
📖 అనువాదం వచనం 11
సమూద్ జాతి తలబిరుసుతనంతో (ప్రవక్తను) అసత్యవాదుడవని తిరస్కరించింది; తమలోని పరమ దుష్టుడు (ఆ దుష్కార్యం చేయటానికి) లేచినప్పుడు
إِذِ انبَعَثَ أَشْقَاهَا ۝١٢
📖 అనువాదం వచనం 12
అల్లాహ్ సందేశహరుడు (సాలిహ్) వారితో: ఈ ఆడ ఒంటె అల్లాహ్ కు చెందింది. కాబట్టి దీనిని (నీళ్ళు) త్రాగనివ్వండి!" అని అన్నాడు
فَقَالَ لَهُمْ رَسُولُ اللَّهِ نَاقَةَ اللَّهِ وَسُقْيَاهَا ۝١٣
📖 అనువాదం వచనం 13
అయినా వారు అతని (సాలిహ్) మాటను అబద్ధమని తిరస్కరించారు. మరియు దాని (ఆ ఒంటె) వెనక మోకాలి నరాన్ని కోసి, కుంటిదాన్ని చేసి చంపారు
فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُم بِذَنبِهِمْ فَسَوَّاهَا ۝١٤
📖 అనువాదం వచనం 14
కాబట్టి వారి ప్రభువు వారి పాపానికి పర్యవసానంగా వారి మీద మహా విపత్తును పంపి వారందరినీ నాశనం చేశాడు
وَلَا يَخَافُ عُقْبَاهَا ۝١٥
📖 అనువాదం వచనం 15
మరియు ఆయన (అల్లాహ్) దాని పర్యవసానాన్ని గురించి భయపడలేదు
← 90 అష్-షమ్స్ (91/114) 92 →
చదవండి సూరా అష్-షమ్స్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

91الشمس Ash-Shams 📚 15 వచనం مكية

వచనానికి వచనం – సూరా అష్-షమ్స్ — 15 వచనం




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers