Summa antum haaa`ulaaa`i taqtuloona anfusakum wa tukhrijoona fareeqam minkum min diyaarihim tazaaharoona `alaihim bil ismi wal`udwaani wa iny yaatookum usaaraa tufaadoohum wahuwa muharramun `alaikum ikhraajuhum; afatu` mi-noona biba`dil Kitaabi wa takfuroona biba`d; famaa jazaaa`u mai yaf`alu zaalika minkum illaa khizyun fil hayaatid-dunyaa wa yawmal qiyaamati yuraddoona ilaaa ashaddil `azaab; wa mal laahu bighaafilin `ammaa ta`maloon
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
ఆ తరువాత మీరో ఒకరినొకరు చంపుకునే వారు. మరియు మీరు మీలోని ఒక వర్గం వారిని వారి ఇండ్ల నుండి తరిమేవారు. మరియు వారికి అన్యాయం చేయటంలోనూ మరియు వారిపై దౌర్జన్యం చేయటంలోనూ, (వారి విరోధులకు) తోడ్పడేవారు. మరియు వారు (శతృవుల చేతిలో) ఖైదీలై మీ వద్దకు వచ్చినపుడు మీరు వారిని విమోచనాధనం ఇచ్చి విడిపించేవారు. మరియు (వాస్తవానికి) వారిని తరమటం మీకు నిషిద్ధం చేయబడింది. ఏమీ? మీరు గ్రంథంలోని కొన్ని విషయాలను విశ్వసించి, మరి కొన్నింటిని తిరస్కరిస్తారా? మీలో ఇలా చేసే వారికి, ఇహలోక జీవితంలో అవమానమూ మరియు పునరుత్థాన దినమున మిమ్మల్ని కఠిన శిక్షకు గురి చేయటం తప్ప మరెలాంటి ప్రతిఫలం ఉంటుంది? మరియు అల్లాహ్ మీ కర్మల విషయంలో నిర్లక్షంగా లేడు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
(कि हाँ ऐसा हुआ था) फिर वही लोग तो तुम हो कि आपस में एक दूसरे को क़त्ल करते हो और अपनों से एक जत्थे के नाहक़ और ज़बरदस्ती हिमायती बनकर दूसरे को शहर बदर करते हो (और लुत्फ़ तो ये है कि) अगर वही लोग क़ैदी बनकर तम्हारे पास (मदद माँगने) आए तो उनको तावान देकर छुड़ा लेते हो हालाँकि उनका निकालना ही तुम पर हराम किया गया था तो फिर क्या तुम (किताबे खुदा की) बाज़ बातों पर ईमान रखते हो और बाज़ से इन्कार करते हो पस तुम में से जो लोग ऐसा करें उनकी सज़ा इसके सिवा और कुछ नहीं कि ज़िन्दगी भर की रूसवाई हो और (आख़िरकार) क़यामत के दिन सख्त अज़ाब की तरफ लौटा दिये जाए और जो कुछ तुम लोग करते हो खुदा उससे ग़ाफ़िल नहीं है
تَظَاهَرُونَ: ఒకరికి వ్యతిరేకంగా ఇతరుల సహాయంతో కలిసి దాడి చేయడం, సహకరించడం.
أُسَارَى: ఖైదీలు, బందీలు (ఏకవచనం: అసీర్).
تُفَادُوهُمْ: వారిని విడిపించడానికి ప్రతిఫలం (ఫిద్యా) చెల్లించి విమోచించడం.
خِزْيٌ: అవమానం, పరాభవం, సిగ్గుకరమైన శిక్ష.
ఆయత్ వివరణ:
అల్లాహ్ ఇజ్రాయీలు సంతతి వారిని ఉద్దేశించి చెబుతున్నాడు: మీరు మీ మధ్య ఒకరినొకరు చంపుకుంటున్నారు, మీలోని ఒక వర్గాన్ని వారి ఇళ్ళ నుండి వెలివేస్తున్నారు. శత్రువుల సహాయంతో మీ స్వంత సోదరులపై పాపం మరియు అతిక్రమణతో దాడి చేస్తున్నారు. కానీ వారు శత్రువుల చేతుల్లో బందీలుగా మీ వద్దకు వచ్చినప్పుడు, మీరు ఫిద్యా (ప్రతిఫలం) చెల్లించి వారిని విడిపిస్తారు. అయితే వారిని వారి ఇళ్ళ నుండి వెలివేయడం మీపై నిషేధించబడింది. మీరు గ్రంథంలోని కొంత భాగాన్ని విశ్వసిస్తారు, కొంత భాగాన్ని తిరస్కరిస్తారు. ఇలా చేసే వారికి ఇహలోక జీవితంలో అవమానం తప్ప మరే శిక్షా లేదు. పరలోక దినాన వారు అత్యంత కఠినమైన శిక్ష వైపు తిరిగి పంపబడతారు. మీరు చేసే కార్యాల గురించి అల్లాహ్ అసలు నిర్లక్ష్యంగా లేడు.
ఈ ఆయత్ యూదుల చరిత్రలోని ఒక విచిత్రమైన వైరుధ్యాన్ని ఎత్తిచూపుతుంది. వారు తౌరాత్ గ్రంథంలోని కొన్ని ఆదేశాలను పాటిస్తూ, మరికొన్ని ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. బందీలను విడిపించడం గురించిన ఆదేశాన్ని పాటిస్తూనే, రక్తపాతం మరియు సోదరులను వెలివేయడం వంటి నిషేధాలను ధిక్కరిస్తున్నారు. ఇది గ్రంథంలోని కొంత భాగంపై విశ్వాసం, మరికొంత భాగంపై అవిశ్వాసం కలిగి ఉండటమే. ఇలాంటి ద్వంద్వ ప్రవర్తనకు ఇహలోకంలో అవమానం, పరలోకంలో కఠిన శిక్ష తప్ప మరేదీ లేదు. అల్లాహ్ ఎవరి కార్యాల గురించీ అజాగ్రత్తగా లేడు — ప్రతి చిన్న కార్యానికీ లెక్క ఉంటుంది.
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
గ్రంథ విశ్వాసం సమగ్రంగా ఉండాలి: దైవ గ్రంథాలలోని కొన్ని ఆదేశాలను మాత్రమే పాటించి, మరికొన్నింటిని విస్మరించడం లేదా తిరస్కరించడం సరైన విధానం కాదు. విశ్వాసం పూర్తిగా, సమగ్రంగా ఉండాలి.
సోదరభావం మరియు ఐక్యత: విశ్వాసులందరూ ఒకే శరీరం వంటివారు. ఒకరినొకరు చంపుకోవడం, వెలివేయడం అనేది ఆత్మహత్య వంటిది. ఇస్లాం ఐక్యతను, సోదరభావాన్ని బలంగా ప్రోత్సహిస్తుంది.
ద్వంద్వ ప్రమాణాలు నిషిద్ధం: ఒకే విషయంలో రెండు రకాల నియమాలు పాటించడం — తనకు అనుకూలమైనప్పుడు ఒకటి, వ్యతిరేకమైనప్పుడు మరొకటి — ఇది అన్యాయం మరియు ప
ఆ తరువాత మీరో ఒకరినొకరు చంపుకునే వారు. మరియు మీరు మీలోని ఒక వర్గం వారిని వారి ఇండ్ల నుండి తరిమేవారు. మరియు వారికి అన్యాయం చేయటంలోనూ మరియు వారిపై దౌర్జన్యం చేయటంలోనూ, (వారి విరోధులకు) తోడ్పడేవారు. మరియు వారు (శతృవుల చేతిలో) ఖైదీలై మీ వద్దకు వచ్చినపుడు మీరు వారిని విమోచనాధనం ఇచ్చి విడిపించేవారు. మరియు (వాస్తవానికి) వారిని తరమటం మీకు నిషిద్ధం చేయబడింది. ఏమీ? మీరు గ్రంథంలోని కొన్ని విషయాలను విశ్వసించి, మరి కొన్నింటిని తిరస్కరిస్తారా? మీలో ఇలా చేసే వారికి, ఇహలోక జీవితంలో అవమానమూ మరియు పునరుత్థాన దినమున మిమ్మల్ని కఠిన శిక్షకు గురి చేయటం తప్ప మరెలాంటి ప్రతిఫలం ఉంటుంది? మరియు అల్లాహ్ మీ కర్మల విషయంలో నిర్లక్షంగా లేడు
మరియు మేము ఇస్రాయీలు సంతతి వారి నుండి ఇలా తీసుకున్న వాగ్దానం (జ్ఞప్తికి తెచ్చుకోండి): మీరు అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించకూడదు. మరియు తల్లిదండ్రులను, బంధువులను, అనాథులను, యాచించని పేదవారిని ఆదరించాలి. మరియు ప్రజలను సహృదయంతో పలకరించాలి, నమాజ్ ను స్థాపించాలి మరియు జకాత్ ఇవ్వాని." అటు పిమ్మట మీలో కొందరు తప్ప, మిగతా వారంతా (తమ వాగ్దానం నుండి) తిరిగి పోయారు. మీరంతా విముఖులైపోయే వారే
మరియు మేము మీ నుండి తీసుకున్న మరొక వాగ్దానాన్ని (జ్ఞాపకం చేసుకోండి); మీరు మీ (తోటివారి) రక్తాన్ని చిందిచగూడదని మరియు మీ వారిని, వారి ఇండ్ల నుండి పారద్రోల గూడదని! అప్పుడు మీరు దానికి ఒప్పుకున్నారు. మరియు దానికి స్వయంగా మీరే సాక్షులు
ఆ తరువాత మీరో ఒకరినొకరు చంపుకునే వారు. మరియు మీరు మీలోని ఒక వర్గం వారిని వారి ఇండ్ల నుండి తరిమేవారు. మరియు వారికి అన్యాయం చేయటంలోనూ మరియు వారిపై దౌర్జన్యం చేయటంలోనూ, (వారి విరోధులకు) తోడ్పడేవారు. మరియు వారు (శతృవుల చేతిలో) ఖైదీలై మీ వద్దకు వచ్చినపుడు మీరు వారిని విమోచనాధనం ఇచ్చి విడిపించేవారు. మరియు (వాస్తవానికి) వారిని తరమటం మీకు నిషిద్ధం చేయబడింది. ఏమీ? మీరు గ్రంథంలోని కొన్ని విషయాలను విశ్వసించి, మరి కొన్నింటిని తిరస్కరిస్తారా? మీలో ఇలా చేసే వారికి, ఇహలోక జీవితంలో అవమానమూ మరియు పునరుత్థాన దినమున మిమ్మల్ని కఠిన శిక్షకు గురి చేయటం తప్ప మరెలాంటి ప్రతిఫలం ఉంటుంది? మరియు అల్లాహ్ మీ కర్మల విషయంలో నిర్లక్షంగా లేడు
మరియు వాస్తవంగా మేము మూసాకు గ్రంథాన్ని (తౌరాత్ ను) ప్రసాదించాము మరియు అతని తర్వాత వరుసగా ప్రవక్తలను పంపాము. మరియు మర్యమ్ కుమారుడైన ఈసాకు (ఏసుకు) స్పష్టమైన సూచనలను ఇచ్చాము మరియు పరిశుద్ధాత్మ (రూహుల్ ఖుదుస్) తో అతనిని బలపరిచాము. ఏమీ? మీ మనోవాంఛలకు ప్రతికూలంగా ఉన్న దాన్ని తీసుకుని ఏ ప్రవక్త అయినా మీ వద్దకు వస్తే, మీరు వారి పట్ల దురహంకారంతో ప్రవర్తించలేదా? వారిలో కొందరిని మీరు అసత్యవాదులన్నారు, మరి కొందరిని చంపారు
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.