Wa lammaa jaaa`a Moosa limeeqaatinaa wa kallamahoo Rabbuhoo qaala Rabbi arineee anzur ilaik; qaala lan taraanee wa laakininzur ilal jabali fa inistaqarra makaanahoo faswfa taraanee; falammaa tajallaa Rabbuhoo liljabali ja`alahoo dakkanw wa kharra Moosaa sa`iqaa; falammaaa afaaqa qaala Subhaanaka tubtu ilaika wa ana awwalul mu`mineen
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
మరియు మూసా మేము నిర్ణయించిన సమయానికి (మా నిర్ణీత చోటుకు) వచ్చినపుడు, అతని ప్రభువు అతనితో మాట్లాడాడు. (మూసా) అన్నాడు: ఓ నా ప్రభూ! నాకు నీ దర్శన భాగ్యమివ్వు (కనిపించు). నేను నిన్ను చూడదలచాను!" (అల్లాహ్) అన్నాడు: నీవు నన్ను (ఏ మాత్రం) చూడలేవు! కాని ఈ పర్వతం వైపుకు చూడు! ఒకవేళ అది తన స్థానంలో స్థిరంగా ఉండగలిగితే, అప్పుడు నీవు నన్ను చూడగలవనుకో!" అతని ప్రభువు ఆ కొండపై తన తేజస్సును ప్రసరింపజేయగా అది భస్మమై పోయింది మరియు మూసా స్పృహ తప్పి పడిపోయాడు. తెలివి వచ్చిన తరువాత (మూసా) అన్నాడు: నీవు సర్వలోపాలకు అతీతుడవు, నేను పశ్చాత్తాపంతో నీ వైపుకు మరలు తున్నాను మరియు నేను విశ్వసించేవారిలో మొట్టమొదటి వాడను
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
और जब मूसा हमारा वायदा पूरा करते (कोहेतूर पर) आए और उनका परवरदिगार उनसे हम कलाम हुआ तो मूसा ने अर्ज़ किया कि ख़ुदाया तू मेझे अपनी एक झलक दिखला दे कि मैं तूझे देखँ ख़ुदा ने फरमाया तुम मुझे हरगिज़ नहीं देख सकते मगर हॉ उस पहाड़ की तरफ देखो (हम उस पर अपनी तजल्ली डालते हैं) पस अगर (पहाड़) अपनी जगह पर क़ायम रहे तो समझना कि अनक़रीब मुझे भी देख लोगे (वरना नहीं) फिर जब उनके परवरदिगार ने पहाड़ पर तजल्ली डाली तो उसको चकनाचूर कर दिया और मूसा बेहोश होकर गिर पड़े फिर जब होश में आए तो कहने लगे ख़ुदा वन्दा तू (देखने दिखाने से) पाक व पाकीज़ा है-मैने तेरी बारगाह में तौबा की और मै सब से पहले तेरी अदम रवायत का यक़ीन करता हूँ
سُبْحَانَكَ (సుబ్హానక): నీవు పవిత్రుడవు, నీకు తగని లోపాలన్నిటి నుండి నీవు ముక్తుడవు.
ఆయత్ వ్యాఖ్యానం:
మూసా (అలైహిస్సలాం) మేము నిర్ణయించిన నలభై రాత్రుల సమయం పూర్తయిన తర్వాత, ఆ స్థలానికి వచ్చినప్పుడు, అల్లాహ్ తన వాణి ద్వారా ఆయనతో మాట్లాడాడు — ఆజ్ఞలు, నిషేధాలు, ఉపదేశాలను అందించాడు. ఆ దివ్య సంభాషణను విన్న మూసా (అలైహిస్సలాం) హృదయం అల్లాహ్ దర్శనం కోసం తీవ్రంగా ఆశించింది. అందుకే ఆయన "నా ప్రభూ! నీ దర్శనం నాకు ప్రసాదించు, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను" అని వేడుకున్నాడు.
అల్లాహ్ సమాధానమిచ్చాడు: "ఇహలోక జీవితంలో నీవు నన్ను చూడలేవు — మానవుడిగా నీకు ఆ శక్తి లేదు. కానీ ఆ పర్వతం వైపు చూడు. నేను దానిపై నా దివ్యత్వాన్ని ప్రకటించినప్పుడు అది తన స్థానంలో నిలిచి ఉంటే, అప్పుడు నీవు నన్ను చూడగలవు." అల్లాహ్కు తెలుసు — పర్వతం ఆ దివ్య ప్రకాశాన్ని తట్టుకోలేదని. ఆయన తన జ్యోతిని పర్వతంపై ప్రకటించినప్పుడు, ఆ పర్వతం నేలమట్టమైపోయింది, ధూళిగా మారిపోయింది. ఆ భయంకర దృశ్యాన్ని చూసి మూసా (అలైహిస్సలాం) మూర్ఛపోయి కూలిపోయాడు.
ఆయన స్పృహలోకి వచ్చినప్పుడు ఇలా ప్రార్థించాడు: "నా ప్రభూ! నీవు సర్వలోపాలకు అతీతుడవు, పవిత్రుడవు. నేను ఇహలోకంలో నీ దర్శనం కోరినందుకు పశ్చాత్తాపపడుతున్నాను, నీ వైపు మరలుతున్నాను. నా జాతి ప్రజలలో నీ ఏకత్వాన్ని విశ్వసించిన మొదటి వ్యక్తిని నేనే."
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
అల్లాహ్ తన ప్రవక్తలతో ప్రత్యక్షంగా మాట్లాడే శక్తి కలిగినవాడు — ఇది ఆయన సర్వశక్తిమంతుడని తెలియజేస్తుంది.
మానవుడు ఇహలోకంలో అల్లాహ్ను చూడలేడు; ఆ దర్శనం పరలోకంలో విశ్వాసులకు లభించే అత్యున్నత బహుమతి. ఇది విశ్వాసుల హృదయాలలో పరలోకం పట్ల ఆశను పెంచుతుంది.
మూసా (అలైహిస్సలాం) లాంటి గొప్ప ప్రవక్త కూడా తన కోరికను మించిన విషయంలో పశ్చాత్తాపపడి అల్లాహ్ వై
మరియు మూసా మేము నిర్ణయించిన సమయానికి (మా నిర్ణీత చోటుకు) వచ్చినపుడు, అతని ప్రభువు అతనితో మాట్లాడాడు. (మూసా) అన్నాడు: ఓ నా ప్రభూ! నాకు నీ దర్శన భాగ్యమివ్వు (కనిపించు). నేను నిన్ను చూడదలచాను!" (అల్లాహ్) అన్నాడు: నీవు నన్ను (ఏ మాత్రం) చూడలేవు! కాని ఈ పర్వతం వైపుకు చూడు! ఒకవేళ అది తన స్థానంలో స్థిరంగా ఉండగలిగితే, అప్పుడు నీవు నన్ను చూడగలవనుకో!" అతని ప్రభువు ఆ కొండపై తన తేజస్సును ప్రసరింపజేయగా అది భస్మమై పోయింది మరియు మూసా స్పృహ తప్పి పడిపోయాడు. తెలివి వచ్చిన తరువాత (మూసా) అన్నాడు: నీవు సర్వలోపాలకు అతీతుడవు, నేను పశ్చాత్తాపంతో నీ వైపుకు మరలు తున్నాను మరియు నేను విశ్వసించేవారిలో మొట్టమొదటి వాడను
మరియు మేము మిమ్మల్ని ఫిర్ఔన్ జాతి వారి నుండి విముక్తి కలిగించిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి). వారు మిమ్మల్ని ఘోర బాధకు గురిచేస్తూ ఉన్నారు. మీ కుమారులను చంపి, మీ స్త్రీలను సజీవులుగా వదులుతూ ఉన్నారు. మరియు ఇందు మీ ప్రభువు తరఫు నుండి మీకొక గొప్ప పరీక్ష ఉండింది
మరియు మేము మూసా కొరకు (సినాయి కొండపై) ముప్పై రాత్రుల (గడువు) నిర్ణయించాము. తరువాత పది (రాత్రులు) పొడిగించాము. ఈ విధంగా అతని ప్రభువు నిర్ణయించిన నలభై రాత్రుల గుడువ పూర్తయ్యింది. మూసా తన సోదరుడగు హారూన్ తో అన్నాడు: నీవు నా జాతి ప్రజలలో నాకు ప్రాతినిథ్యం వహించు మరియు సంస్కరణకు పాటు పడు మరియు అరాచకాలు చేసేవారి మార్గాన్ని అనుసరించకు
మరియు మూసా మేము నిర్ణయించిన సమయానికి (మా నిర్ణీత చోటుకు) వచ్చినపుడు, అతని ప్రభువు అతనితో మాట్లాడాడు. (మూసా) అన్నాడు: ఓ నా ప్రభూ! నాకు నీ దర్శన భాగ్యమివ్వు (కనిపించు). నేను నిన్ను చూడదలచాను!" (అల్లాహ్) అన్నాడు: నీవు నన్ను (ఏ మాత్రం) చూడలేవు! కాని ఈ పర్వతం వైపుకు చూడు! ఒకవేళ అది తన స్థానంలో స్థిరంగా ఉండగలిగితే, అప్పుడు నీవు నన్ను చూడగలవనుకో!" అతని ప్రభువు ఆ కొండపై తన తేజస్సును ప్రసరింపజేయగా అది భస్మమై పోయింది మరియు మూసా స్పృహ తప్పి పడిపోయాడు. తెలివి వచ్చిన తరువాత (మూసా) అన్నాడు: నీవు సర్వలోపాలకు అతీతుడవు, నేను పశ్చాత్తాపంతో నీ వైపుకు మరలు తున్నాను మరియు నేను విశ్వసించేవారిలో మొట్టమొదటి వాడను
(అల్లాహ్) అన్నాడు: ఓ మూసా ప్రవక్త పదవికి మరియు సంభాషించటానికి - నిశ్చయంగా, నేను ప్రజలందరిలో, నిన్ను ఎన్నుకున్నాను. కావున నేను నీకిచ్చిన దానిని తీసుకొని, కృతజ్ఞులలో చేరు
మరియు మేము అతని కొరకు, ఫలకాల మీద ప్రతి విధమైన ఉపదేశాన్ని ప్రతి వ్యవహారానికి సంబంధించిన వివరాలను వ్రాసి ఇచ్చి, అతనితో (మూసాతో) అన్నాము: వీటిని గట్టిగా పట్టుకో! మరియు వీటి ఉత్తమ ఉపదేశాలను అనుసరించమని నీ జాతి వారిని ఆజ్ఞాపించు. త్వరలోనే నేను అవిధేయుల (ఫాసిఖూన్ ల) నివాసాన్ని మీకు చూపుతాను
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.