Yaaa ayyuhal lazeena aamanoo laa tattakhizoo bitaanatam min doonikum laa yaaloonakum khabaalanw waddoo maa `anittum qad badatil baghdaaa`u min afwaahihim; wa maa tukhfee sudooruhum akbar; qad baiyannaa lakumul Aayaati in kuntum ta`qiloon
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
ఓ విశ్వాసులారా! మీరు మీ వారిని (విశ్వాసులను) తప్ప ఇతరులను మీ సన్నిహిత స్నేహితులుగా చేసుకోకండి. వారు మీకు హాని కలిగించే ఏ అవకాశాన్నైనా ఉపయోగించు కోవటానికి వెనుకాడరు. వారు మిమ్మల్ని ఇబ్బందిలో చూడగోరుతున్నారు. మరియు వారి ఈర్ష్య వారి నోళ్ళ నుండి బయటపడుతున్నది. కాని వారి హృదయాలలో దాచుకున్నది దాని కంటే తీవ్రమైనది. వాస్తవానికి మేము ఈ సూచనలను మీకు స్పష్టం చేశాము. మీరు అర్థం చేసుకోగలిగితే (ఎంత బాగుండేది)
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
ऐ ईमानदारों अपने (मोमिनीन) के सिवा (गैरो को) अपना राज़दार न बनाओ (क्योंकि) ये गैर लोग तुम्हारी बरबादी में कुछ उठा नहीं रखेंगे (बल्कि जितना ज्यादा तकलीफ़) में पड़ोगे उतना ही ये लोग ख़ुश होंगे दुश्मनी तो उनके मुंह से टपकती है और जो (बुग़ज़ व हसद) उनके दिलों में भरा है वह कहीं उससे बढ़कर है हमने तुमसे (अपने) एहकाम साफ़ साफ़ बयान कर दिये अगर तुम समझ रखते हो
مَا تُخْفِي صُدُورُهُمْ: వారి హృదయాలు దాచుకున్నది.
أَكْبَرُ: మరింత పెద్దది, మరింత తీవ్రమైనది.
ఆయత్ యొక్క వివరణ:
ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసం తెచ్చుకున్నారు కాబట్టి, మీ సమాజానికి వెలుపల ఉన్నవారిని—అనగా విశ్వాసులు కానివారిని—మీ అంతరంగిక ఆప్తులుగా, రహస్యాలు పంచుకునే సన్నిహితులుగా చేసుకోకండి. వారు మీకు హాని కలిగించడంలో ఎన్నడూ ఆగరు, వెనుకాడరు. మీకు ఏదైనా కష్టం కలిగితే, మీరు నష్టపోతే వారు సంతోషిస్తారు, అలాంటి పరిస్థితినే కోరుకుంటారు. వారి నోళ్ల నుండి ద్వేషం, శత్రుత్వం స్పష్టంగా బయటపడుతున్నాయి—మీ మతాన్ని నిందించడం, మీ మధ్య చీలిక తెచ్చడం, మీ రహస్యాలు బయటపెట్టడం వంటివి. కానీ వారి హృదయాల్లో దాగి ఉన్న ద్వేషం, శత్రుత్వం ఇంకా చాలా పెద్దది, మరింత తీవ్రమైనది. ఓ విశ్వాసులారా! మీ ప్రపంచ, పరలోక ప్రయోజనాలను సాధించడానికి అవసరమైన స్పష్టమైన ఆధారాలను, సూచనలను మేము మీకు వివరించాము—మీరు గ్రహించి, ఆలోచించి, జాగ్రత్తపడేవారైతే.
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
విశ్వాసులు తమ విశ్వాస సమాజాన్ని, సోదరభావాన్ని గౌరవించాలి; విశ్వాసం కానివారిని అంతరంగిక రహస్యాలకు నిలయంగా చేసుకోకూడదు.
ఇస్లాం ముస్లింల భద్రత, ఐక్యత, సమాజ శ్రేయస్సుపై ఎంతో శ్రద్ధ చూపుతుంది—ఇది ఇస్లాం యొక్క సౌందర్యం.
శత్రువుల ద్వేషం కొన్నిసార్లు మాటల్లో, ప్రవర్తనలో బయటపడుతుంది; వివేకవంతులు దానిని గుర్తించి ముందుజాగ్రత్త తీసుకుంటారు.
అల్లాహ్ తన ఆయత్లను, ఆధారాలను స్పష్టంగా వివరించాడు—మనం ఆలోచించి, అర్థం చేసుకుని, ఆచరించాలి.
ఈ ఆయత్ ముస్లింలను ఐక్యంగా ఉండమని, తమ మధ్య విభేదాలు సృష్టించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండమని బోధిస్తుంది.
ఇస్లాం శాంతి, భద్రత, వివేకం, దూరదృష్టి యొక్క మతం—ఇది ప్రతి ముస్లిం జీవితంలో ఆచరించదగిన మార్గదర్శనం.
ఓ విశ్వాసులారా! మీరు మీ వారిని (విశ్వాసులను) తప్ప ఇతరులను మీ సన్నిహిత స్నేహితులుగా చేసుకోకండి. వారు మీకు హాని కలిగించే ఏ అవకాశాన్నైనా ఉపయోగించు కోవటానికి వెనుకాడరు. వారు మిమ్మల్ని ఇబ్బందిలో చూడగోరుతున్నారు. మరియు వారి ఈర్ష్య వారి నోళ్ళ నుండి బయటపడుతున్నది. కాని వారి హృదయాలలో దాచుకున్నది దాని కంటే తీవ్రమైనది. వాస్తవానికి మేము ఈ సూచనలను మీకు స్పష్టం చేశాము. మీరు అర్థం చేసుకోగలిగితే (ఎంత బాగుండేది)
నిశ్చయంగా, సత్యతిరస్కారానికి పాల్పబడిన వారికి, వారి సంపద గానీ, వారి సంతానం గానీ, అల్లాహ్ ముందు ఏమీ పనికి రావు. మరియు అలాంటివారు నరకాగ్ని వాసులే. అందు వారు శాశ్వతంగా ఉంటారు
వారు ఈ ఇహలోక జీవితంలో చేస్తున్న ధన వ్యయాన్ని, తమకు తాము అన్యాయం చేసుకున్నవారి పొలాలపై వీచి వాటిని సమూలంగా నాశనం చేసే, మంచు గాలితో పోల్చవచ్చు. మరియు అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు. కానీ వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు
ఓ విశ్వాసులారా! మీరు మీ వారిని (విశ్వాసులను) తప్ప ఇతరులను మీ సన్నిహిత స్నేహితులుగా చేసుకోకండి. వారు మీకు హాని కలిగించే ఏ అవకాశాన్నైనా ఉపయోగించు కోవటానికి వెనుకాడరు. వారు మిమ్మల్ని ఇబ్బందిలో చూడగోరుతున్నారు. మరియు వారి ఈర్ష్య వారి నోళ్ళ నుండి బయటపడుతున్నది. కాని వారి హృదయాలలో దాచుకున్నది దాని కంటే తీవ్రమైనది. వాస్తవానికి మేము ఈ సూచనలను మీకు స్పష్టం చేశాము. మీరు అర్థం చేసుకోగలిగితే (ఎంత బాగుండేది)
అవును! మీరైతే వారిని ప్రేమిస్తున్నారు. కాని వారు మిమ్మల్ని ప్రేమించటం లేదు. మరియు మీరు దివ్యగ్రంథాలన్నింటినీ విశ్వసిస్తున్నారు. వారు మీతో కలసినపుడు: మేము విశ్వసించాము." అని అంటారు. కాని వేరుగా ఉన్నప్పుడు, మీ ఎడల ఉన్న క్రోదావేశం వల్ల తమ వ్రేళ్ళను కొరుక్కుంటారు. వారితో: మీ క్రోధావేశంలో మీరే మాడి చావండి. నిశ్చయంగా, హృదయాలలో దాగి ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు." అని అను
మీకేదైనా మేలు కలిగితే వారికది దుఃఖం కలిగిస్తుంది మరియు మీకేదైనా కీడు కలిగితే వారికది సంతోషం కలిగిస్తుంది. మరియు మీరు సహనం వహించి దైవభీతి కలిగి ఉంటే, వారి కుట్ర మీకెలాంటి నష్టం కలిగించ జాలదు. నిశ్చయంగా, అల్లాహ్ వారు చేసే దానినంతా పరివేష్టించి ఉన్నాడు
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.