లుఖ్మాన్ · 16/34
అనువాదం ఉచ్చారణ — సూరా లుఖ్మాన్
يَا بُنَيَّ إِنَّهَا إِن تَكُ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ فَتَكُن فِي صَخْرَةٍ أَوْ فِي السَّمَاوَاتِ أَوْ فِي الْأَرْضِ يَأْتِ بِهَا اللَّهُ ۚ إِنَّ اللَّهَ لَطِيفٌ خَبِيرٌ ۝١٦
Ya bunaiya innahaaa in taku misqaala habbatim min khardalin fatakun fee sakhratin aw fis samaawaati aw fil ardi yaati bihal laa; innal laaha lateefun Khabeer
📖 తెలుగులో
ఓ నా కుమారా! ఒకవేళ నీ కర్మ ఆవగింజంత ఉండి, అది ఒక పెద్ద రాతిబండలో గానీ, ఆకాశంలో గానీ లేదా భూమిలో గానీ దాగివున్నా, అల్లాహ్ దానిని తప్పక (వెలుగులోకి) తెస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ ఎంతో సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 14-18 — సూరా లుఖ్మాన్

14وَوَصَّيْنَا الْإِنسَانَ بِوَالِدَيْهِ حَمَلَتْهُ أُمُّهُ وَهْنًا عَلَىٰ وَهْنٍ وَفِصَالُهُ فِي عَامَيْنِ أَنِ اشْكُرْ لِي وَلِوَالِدَيْكَ إِلَيَّ الْمَصِيرُ
మరియు (అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు): మేము మానవునకు తన తల్లిదండ్రుల యెడల మంచితనంతో మెలగటం విధిగా జేశాము. అతని తల్లి అతనిని బలహీనతపై బలహీనతను సహిస్తూ (తన గర్భంలో) భరిస్తుంది మరియు ఆ బిడ్డ చనుపాలు మాన్పించే గడువు రెండు సంవత్సరాలు. నీవు నాకు మరియు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞుడవై ఉండు. నీకు నా వైపునకే మరలి రావలసి ఉన్నది
15وَإِن جَاهَدَاكَ عَلَىٰ أَن تُشْرِكَ بِي مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ فَلَا تُطِعْهُمَا ۖ وَصَاحِبْهُمَا فِي الدُّنْيَا مَعْرُوفًا ۖ وَاتَّبِعْ سَبِيلَ مَنْ أَنَابَ إِلَيَّ ۚ ثُمَّ إِلَيَّ مَرْجِعُكُمْ فَأُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ
మరియు ఒకవేళ వారిరువురు - నీవు ఎరగని దానిని - నాకు (అల్లాహ్ కు) భాగస్వామిగా చేర్చమని, నిన్ను బలవంతం చేస్తే, వారి మాటను నీవు ఏ మాత్రం వినకు. మరియు ఇహలోక విషయాలలో ధర్మసమ్మతమైన వాటిలో వారికి తోడుగా ఉండు. మరియు పశ్చాత్తాపంతో నా వైపుకు మరలేవాని మార్గాన్ని అనుసరించు. తరువాత మీరంతా నా వైపునకే మరలి రావలసి ఉన్నది. అప్పుడు నేను మీరు చేసే కర్మలను గురించి మీకు తెలుపుతాను
16يَا بُنَيَّ إِنَّهَا إِن تَكُ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ فَتَكُن فِي صَخْرَةٍ أَوْ فِي السَّمَاوَاتِ أَوْ فِي الْأَرْضِ يَأْتِ بِهَا اللَّهُ ۚ إِنَّ اللَّهَ لَطِيفٌ خَبِيرٌ
ఓ నా కుమారా! ఒకవేళ నీ కర్మ ఆవగింజంత ఉండి, అది ఒక పెద్ద రాతిబండలో గానీ, ఆకాశంలో గానీ లేదా భూమిలో గానీ దాగివున్నా, అల్లాహ్ దానిని తప్పక (వెలుగులోకి) తెస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ ఎంతో సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు
17يَا بُنَيَّ أَقِمِ الصَّلَاةَ وَأْمُرْ بِالْمَعْرُوفِ وَانْهَ عَنِ الْمُنكَرِ وَاصْبِرْ عَلَىٰ مَا أَصَابَكَ ۖ إِنَّ ذَٰلِكَ مِنْ عَزْمِ الْأُمُورِ
ఓ నా కుమారా! నమాజ్ స్థాపించు మరియు ధర్మాన్ని ఆదేశించు మరియు అధర్మాన్ని నిషేధించు, ఆపదలో సహనం వహించు. నిశ్చయంగా, ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన విషయాలు
18وَلَا تُصَعِّرْ خَدَّكَ لِلنَّاسِ وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا ۖ إِنَّ اللَّهَ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُورٍ
మరియు నీ చెంపలను గర్వంతో ప్రజల యెదుట ఉబ్బించకు. మరియు భూమిపై అహంకారంతో నడవకు. నిశ్చయంగా, అల్లాహ్ డాంబికాలు చెప్పుకొని, విర్రవీగే వాడంటే ఇష్టపడడు
లుఖ్మాన్ఖురాన్ సూచిక
34వచనం
MeccanRevelation
16వచనం

అనువాదం — లుఖ్మాన్ 16

సూరా లుఖ్మాన్ వచనం 16 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఓ నా కుమారా! ఒకవేళ నీ కర్మ ఆవగింజంత ఉండి, అది ఒక…

సూరా వచనం 16/34 — సూరా లుఖ్మాన్ لقمان (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా లుఖ్మాన్ వినండి, సూరా లుఖ్మాన్ అనువాదం, సూరా లుఖ్మాన్ mp3, సూరా లుఖ్మాన్ pdf. వచనం 14–18. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers