అన్-నిసా · 48/176
అనువాదం ఉచ్చారణ — సూరా అన్-నిసా
إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ ۚ وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدِ افْتَرَىٰ إِثْمًا عَظِيمًا ۝٤٨
Innal laaha laa yaghfiru ai yushraka bihee wa yaghfiru maa doona zaalika limai yashaaa`; wa mai yushrik billaahi faqadif taraaa isman `azeemaa
📖 తెలుగులో
నిశ్చయంగా, అల్లాహ్ తనకు భాగస్వామిని (సాటిని) కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించడు. మరియు అది తప్ప దేనిని (ఏ పాపాన్ని) అయినా, ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ కు భాగస్వాములను కల్పించినవాడే, వాస్తవానికి మహాపాపం చేసిన వాడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 46-50 — సూరా అన్-నిసా

46مِّنَ الَّذِينَ هَادُوا يُحَرِّفُونَ الْكَلِمَ عَن مَّوَاضِعِهِ وَيَقُولُونَ سَمِعْنَا وَعَصَيْنَا وَاسْمَعْ غَيْرَ مُسْمَعٍ وَرَاعِنَا لَيًّا بِأَلْسِنَتِهِمْ وَطَعْنًا فِي الدِّينِ ۚ وَلَوْ أَنَّهُمْ قَالُوا سَمِعْنَا وَأَطَعْنَا وَاسْمَعْ وَانظُرْنَا لَكَانَ خَيْرًا لَّهُمْ وَأَقْوَمَ وَلَٰكِن لَّعَنَهُمُ اللَّهُ بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُونَ إِلَّا قَلِيلًا
యూదులలో కొందరు పదాలను వాటి సందర్భాల నుండి తారుమారు చేసి అంటారు: మేము (నీ మాటలను) విన్నాము మరియు ఉల్లంఘించాము (సమి`అనా వ `అ`సయ్ నా)." అనీ; మరియు: విను! నీ మాట వినకబోవు గాక! (వస్ మ `అ `గైర మస్ మ`ఇన్)." అనీ; మరియు (ఓ ముహమ్మద్!) నీవు మా మాట విను (రా`ఇనా) అనీ తమ నాలుకలను మెలి త్రిప్పి సత్యధర్మాన్ని ఎగతాళి చేసే ఉద్దేశ్యంతో అంటారు. కాని అలా కాకుండా: విన్నాము, విధేయులమయ్యాము. (సమి`అనా వ అ`త`అనా)." అనీ; మరియు: మమ్మల్ని విను మరియు మా దిక్కుచూడు / మాకు వ్యవధినివ్వు (వస్ మ`అ వన్`జుర్ నా)," అనీ, అని ఉంటే వారికే మేలై ఉండేది మరియు ఉత్తమమైన పద్ధతిగా ఉండేది. కాని వారి సత్యతిరస్కార వైఖరి వల్ల అల్లాహ్ వారిని శపించాడు (బహిష్కరించాడు). కావున వారిలో కొందరు మాత్రమే విశ్వసించేవారు ఉన్నారు
47يَا أَيُّهَا الَّذِينَ أُوتُوا الْكِتَابَ آمِنُوا بِمَا نَزَّلْنَا مُصَدِّقًا لِّمَا مَعَكُم مِّن قَبْلِ أَن نَّطْمِسَ وُجُوهًا فَنَرُدَّهَا عَلَىٰ أَدْبَارِهَا أَوْ نَلْعَنَهُمْ كَمَا لَعَنَّا أَصْحَابَ السَّبْتِ ۚ وَكَانَ أَمْرُ اللَّهِ مَفْعُولًا
ఓ గ్రంథ ప్రజలారా! మీ వద్ద ఉన్న గ్రంథాన్ని ధృవపరుస్తూ, మేము అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించండి, మేము మీ ముఖాలను వికృతం చేసి వాటిని వెనక్కి త్రిప్పక ముందే (నాశనం చేయక ముందే). లేక మేము సబ్త్ వారిని శపించినట్లుగా (బహిష్కరించినట్లుగా) మిమ్మల్ని కూడా శపించక (బహిష్కరించక) ముందే (దీనిని విశ్వసించండి). ఎందుకంటే! అల్లాహ్ ఆజ్ఞ తప్పకుండా నిర్వహించబడుతుంది
48إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ ۚ وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدِ افْتَرَىٰ إِثْمًا عَظِيمًا
నిశ్చయంగా, అల్లాహ్ తనకు భాగస్వామిని (సాటిని) కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించడు. మరియు అది తప్ప దేనిని (ఏ పాపాన్ని) అయినా, ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ కు భాగస్వాములను కల్పించినవాడే, వాస్తవానికి మహాపాపం చేసిన వాడు
49أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يُزَكُّونَ أَنفُسَهُم ۚ بَلِ اللَّهُ يُزَكِّي مَن يَشَاءُ وَلَا يُظْلَمُونَ فَتِيلًا
ఏమీ? తమను తాము పవిత్రులమని చెప్పుకునేవారిని (యూదులు మరియు క్రైస్తవులను) గురించి నీకు తెలియదా (చూడలేదా)? వాస్తవానికి, అల్లాహ్ తాను కోరిన వారికి మాత్రమే పవిత్రతను ప్రసాదిస్తాడు. మరియు వారికి ఖర్జూర బీజపు చీలికలోని పొర అంత అన్యాయం కూడా చేయబడదు
50انظُرْ كَيْفَ يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ ۖ وَكَفَىٰ بِهِ إِثْمًا مُّبِينًا
చూడండి! వారు అల్లాహ్ ను గురించి ఏ విధమైన అబద్ధాన్ని కల్పిస్తున్నారో? మరియు స్పష్టమైన పాపం, అని చెప్పటానికి ఇది చాలు
అన్-నిసాఖురాన్ సూచిక
176వచనం
MedinanRevelation
48వచనం

అనువాదం — అన్-నిసా 48

సూరా అన్-నిసా వచనం 48 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నిశ్చయంగా, అల్లాహ్ తనకు భాగస్వామిని (సాటిని) కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించడు. మరియు…

సూరా వచనం 48/176 — సూరా అన్-నిసా النساء (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అన్-నిసా వినండి, సూరా అన్-నిసా అనువాదం, సూరా అన్-నిసా mp3, సూరా అన్-నిసా pdf. వచనం 46–50. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers