అల్-మాఇదా · 26/120
అనువాదం ఉచ్చారణ — అల్-మాఇదా
قَالَ فَإِنَّهَا مُحَرَّمَةٌ عَلَيْهِمْ ۛ أَرْبَعِينَ سَنَةً ۛ يَتِيهُونَ فِي الْأَرْضِ ۚ فَلَا تَأْسَ عَلَى الْقَوْمِ الْفَاسِقِينَ ۝٢٦
Qaala fa innahaa muhar ramatun `alaihim arba`eena sanah; yateehoona fil ard; falaa taasa `alal qawmil faasiqeen
📖 తెలుగులో
(అల్లాహ్) అన్నాడు: ఇక నిశ్చయంగా ఆ భూమి వారి కొరకు నలభై సంవత్సరాల వరకు నిషేధింపబడింది. వారు దేశదిమ్మరులై ఈ భూమిలో తిరుగుతూ ఉంటారు. కావున అవిధేయులైన జనులను గురించి నీవు చింతించకు
🎧 వినండి

📜 వచనం 24-28 — అల్-మాఇదా

24قَالُوا يَا مُوسَىٰ إِنَّا لَن نَّدْخُلَهَا أَبَدًا مَّا دَامُوا فِيهَا ۖ فَاذْهَبْ أَنتَ وَرَبُّكَ فَقَاتِلَا إِنَّا هَاهُنَا قَاعِدُونَ
వారన్నారు: ఓ మూసా! వారు అందు ఉన్నంత వరకు మేము అందులో ఎన్నటికీ ప్రవేశించము. కావున నీవు మరియు నీ ప్రభువు పోయి పోరాడండి, మేము నిశ్చయంగా, ఇక్కడే కూర్చుని ఉంటాము
25قَالَ رَبِّ إِنِّي لَا أَمْلِكُ إِلَّا نَفْسِي وَأَخِي ۖ فَافْرُقْ بَيْنَنَا وَبَيْنَ الْقَوْمِ الْفَاسِقِينَ
(దానికి మూసా) అన్నాడు: ఓ నా ప్రభూ! నాకు నాపై మరియు నా సోదరునిపై మాత్రమే అధికారం గలదు. కావున నీవు మా మధ్య మరియు ఈ అవిధేయుల మధ్య తీర్పు చేయి (మమ్మల్ని ఈ అవిదేయుల నుండి దూరం చేయి)
26قَالَ فَإِنَّهَا مُحَرَّمَةٌ عَلَيْهِمْ ۛ أَرْبَعِينَ سَنَةً ۛ يَتِيهُونَ فِي الْأَرْضِ ۚ فَلَا تَأْسَ عَلَى الْقَوْمِ الْفَاسِقِينَ
(అల్లాహ్) అన్నాడు: ఇక నిశ్చయంగా ఆ భూమి వారి కొరకు నలభై సంవత్సరాల వరకు నిషేధింపబడింది. వారు దేశదిమ్మరులై ఈ భూమిలో తిరుగుతూ ఉంటారు. కావున అవిధేయులైన జనులను గురించి నీవు చింతించకు
27۞ وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ ابْنَيْ آدَمَ بِالْحَقِّ إِذْ قَرَّبَا قُرْبَانًا فَتُقُبِّلَ مِنْ أَحَدِهِمَا وَلَمْ يُتَقَبَّلْ مِنَ الْآخَرِ قَالَ لَأَقْتُلَنَّكَ ۖ قَالَ إِنَّمَا يَتَقَبَّلُ اللَّهُ مِنَ الْمُتَّقِينَ
మరియు వారికి ఆదమ్ యొక్క ఇద్దరు కుమారుల (హాబిల్ మరియు ఖాబిల్ ల) యథార్థ కథను వినిపించు. వారిద్దరు (అల్లాహ్ కు) బలి (ఖుర్బానీ) ఇచ్చి నప్పుడు ఒకని (హాబిల్) బలి స్వీకరించ బడింది మరియు రెండవ వాని (ఖాబీల్) బలి స్వీకరించ బడలేదు. (ఖాబీల్) అన్నాడు: నిశ్చయంగా నేను నిన్ను చంపుతాను." (దానికి హాబీల్) అన్నాడు: నిశ్చయంగా, అల్లాహ్ భయభక్తులు గలవారి (బలినే) స్వీకరిస్తాడు
28لَئِن بَسَطتَ إِلَيَّ يَدَكَ لِتَقْتُلَنِي مَا أَنَا بِبَاسِطٍ يَدِيَ إِلَيْكَ لِأَقْتُلَكَ ۖ إِنِّي أَخَافُ اللَّهَ رَبَّ الْعَالَمِينَ
ఒకవేళ నీవు నన్ను చంపటానికి నీ చేయి నా వైపుకు ఎత్తినా! నేను నిన్ను చంపటానికి నా చేయి నీ వైపుకు ఎత్తను. (ఎందుకంటే) నిశ్చయంగా, నేను సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్ కు భయపడుతున్నాను
అల్-మాఇదాఖురాన్ సూచిక
120వచనం
MedinanRevelation
26వచనం

అనువాదం — అల్-మాఇదా 26

సూరా అల్-మాఇదా వచనం 26 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (అల్లాహ్) అన్నాడు: ఇక నిశ్చయంగా ఆ భూమి వారి కొరకు నలభై సంవత్సరాల…

సూరా వచనం 26/120 — అల్-మాఇదా المائدة (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-మాఇదా వినండి, అల్-మాఇదా అనువాదం, అల్-మాఇదా mp3, అల్-మాఇదా pdf. వచనం 24–28. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers