Fahazamoohum bi iznillaahi wa qatala Daawoodu jaaloota wa aataahul laahulmulka Wal Hikmata wa `allamahoo mimmaa yashaaa`; wa law laa daf`ullaahin naasa ba`dahum biba`dil lafasadatil ardu wa laakinnal laaha zoo fadlin `alal`aalameen
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
ఆ తరువాత వారు, అల్లాహ్ అనుమతితో వారిని (సత్యతిరస్కారులను) ఓడించారు. మరియు దావూద్, జాలూత్ ను సంహరించాడు మరియు అల్లాహ్ అతనికి (దావూద్ కు) రాజ్యాధికారం మరియు జ్ఞానం ప్రసాదించి, తాను కోరిన విషయాలను అతనికి బోధించాడు. ఈ విధంగా అల్లాహ్ ప్రజలను, ఒకరి నుండి మరొకరిని కాపాడకుంటే, భూమిలో కల్లోలం వ్యాపించి ఉండేది. కానీ అల్లాహ్ సమస్త లోకాల మీద ఎంతో అనుగ్రహం గలవాడు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
फिर तो उन लोगों ने ख़ुदा के हुक्म से दुशमनों को शिकस्त दी और दाऊद ने जालूत को क़त्ल किया और ख़ुदा ने उनको सल्तनत व तदबीर तम्द्दुन अता की और इल्म व हुनर जो चाहा उन्हें गोया घोल के पिला दिया और अगर ख़ुदा बाज़ लोगों के ज़रिए से बाज़ का दफाए (शर) न करता तो तमाम रुए ज़मीन पर फ़साद फैल जाता मगर ख़ुदा तो सारे जहाँन के लोगों पर फज़ल व रहम करता है
దావూద్ (అలైహిస్సలాం) జాలూత్ను ఎదుర్కొన్న సమయంలో, అల్లాహ్ అనుమతితో విశ్వాసుల సైన్యం శత్రువులను ఓడించింది. దావూద్ (అలైహిస్సలాం) జాలూత్ను హతమార్చాడు. ఈ విజయం తరువాత అల్లాహ్ దావూద్కు రాజ్యాధికారాన్ని మరియు ప్రవక్తత్వాన్ని ప్రసాదించాడు. అంతకుముందు ఇస్రాయీలు సంతతిలో రాజ్యం ఒక వంశంలో, ప్రవక్తత్వం మరొక వంశంలో ఉండేది. కానీ దావూద్కు రెండూ ఒకేసారి ప్రసాదించబడ్డాయి. అల్లాహ్ అతనికి తాను కోరిన విజ్ఞానాన్ని — ముఖ్యంగా కవచాలు తయారు చేసే నైపుణ్యాన్ని — నేర్పాడు. దావూద్ తన చేతి కృషితో జీవించేవాడు.
ఇక అల్లాహ్ యొక్క సున్నత్ (సాంప్రదాయం) ఏమిటంటే — దుర్మార్గులను, అక్రమారులను మంచివారి ద్వారా అణచివేయడం. ఒకవేళ అల్లాహ్ మనుషులలో కొందరి ద్వారా మరికొందరిని నివారించకపోతే, దుర్మార్గులు, అవిశ్వాసులు భూమిపై విజృంభించి, అరాచకం, హింస, భ్రష్టత్వం వ్యాపించి ఉండేది. కానీ అల్లాహ్ తన అనుగ్రహంతో సర్వలోకాలను రక్షిస్తున్నాడు. ఆయన సమస్త సృష్టికి ఉపకారం చేసేవాడు.
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
అల్లాహ్ అనుమతి లేకుండా ఏ విజయమూ సాధ్యం కాదు. కాబట్టి విజయం కోసం మనం అల్లాహ్నే వేడుకోవాలి.
అల్లాహ్ తన దాసులలో తాను కోరిన వారికి రాజ్యం, జ్ఞానం, ప్రవక్తత్వం వంటి గౌరవాలను ప్రసాదిస్తాడు. ఆయన ఇచ్చేవాడు, ఎవరూ ఆయనను అడ్డుకోలేరు.
ఆ తరువాత వారు, అల్లాహ్ అనుమతితో వారిని (సత్యతిరస్కారులను) ఓడించారు. మరియు దావూద్, జాలూత్ ను సంహరించాడు మరియు అల్లాహ్ అతనికి (దావూద్ కు) రాజ్యాధికారం మరియు జ్ఞానం ప్రసాదించి, తాను కోరిన విషయాలను అతనికి బోధించాడు. ఈ విధంగా అల్లాహ్ ప్రజలను, ఒకరి నుండి మరొకరిని కాపాడకుంటే, భూమిలో కల్లోలం వ్యాపించి ఉండేది. కానీ అల్లాహ్ సమస్త లోకాల మీద ఎంతో అనుగ్రహం గలవాడు
ఆ పిదప `తాలూత్ (సౌల్) తన సైన్యంతో బయలు దేరుతూ అన్నాడు: నిశ్చయంగా, అల్లాహ్ ఒక నది ద్వారా మిమ్మల్ని పరీక్షించబోతున్నాడు. దాని నుండి నీరు త్రాగిన వాడు నా వాడు కాడు. మరియు నది నీటిని రుచి చూడని వాడు నిశ్చయంగా నా వాడు, కాని చేతితో గుక్కెడు త్రాగితే పర్వాలేదు." అయితే వారిలో కొందరు తప్ప అందరూ దాని నుండి (కడుపు నిండా నీరు) త్రాగారు. అతను మరియు అతని వెంట విశ్వాసులు ఆ నదిని దాటిన తరువాత వారన్నారు: జాలూత్ తో మరియు అతని సైన్యంతో పోరాడే శక్తి ఈరోజు మాలో లేదు." (కానీ ఒక రోజున) అల్లాహ్ ను కలవడం తప్పదని భావించిన వారన్నారు: అల్లాహ్ అనుమతితో, ఒక చిన్న వర్గం ఒక పెద్ద వర్గాన్ని జయించటం ఎన్నో సార్లు జరిగింది. మరియు అల్లాహ్ స్థైర్యం గలవారితోనే ఉంటాడు
జాలూత్ (గోలియత్) మరియు అతని సైన్యాన్ని ఎదుర్కొనటానికి బయలు దేరి, వారు: ఓ మా ప్రభూ! మాకు (ధైర్య) స్థైర్యాలను ప్రసాదించు, మా పాదాలను స్థిరంగా నిలపు. మరియు సత్యతిరస్కారులకు విరుద్ధంగా (పోరాడటానికి) మాకు సహాయపడు." అని ప్రార్థించారు
ఆ తరువాత వారు, అల్లాహ్ అనుమతితో వారిని (సత్యతిరస్కారులను) ఓడించారు. మరియు దావూద్, జాలూత్ ను సంహరించాడు మరియు అల్లాహ్ అతనికి (దావూద్ కు) రాజ్యాధికారం మరియు జ్ఞానం ప్రసాదించి, తాను కోరిన విషయాలను అతనికి బోధించాడు. ఈ విధంగా అల్లాహ్ ప్రజలను, ఒకరి నుండి మరొకరిని కాపాడకుంటే, భూమిలో కల్లోలం వ్యాపించి ఉండేది. కానీ అల్లాహ్ సమస్త లోకాల మీద ఎంతో అనుగ్రహం గలవాడు
ఆ సందేశహరులు! మేము వారిలో కొందరికి మరికొందరిపై ఆధిక్యత నిచ్చాము. వారిలో కొందరితో అల్లాహ్ (నేరుగా) మాట్లాడాడు. మరికొందరిని (గౌరవనీయమైన) ఉన్నత స్థానాలకు ఎత్తాడు. మరియు మర్యమ్ కుమారుడు ఈసా (ఏసు)కు మేము స్పష్టమైన సూచనలు ప్రసాదించి, అతనిని పరిశుద్ధాత్మ (జిబ్రీల్) సహాయంతో బలపరిచాము. మరియు - అల్లాహ్ తలుచుకుంటే - ఈ ప్రవక్తల తరువాత వచ్చిన ప్రజలు, వారికి స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాత కూడా పరస్పరం కలహించుకునేవారు కాదు. కానీ, వారు పరస్పర విభేదాలకు లోనయ్యారు. కావున వారిలో కొందరు విశ్వాసులయ్యారు మరికొందరు సత్యతిరస్కారులు అయ్యారు. మరియు అల్లాహ్ తలుచుకుంటే వారు పరస్పరం కలహించుకునేవారు కాదు, కాని అల్లాహ్ తాను కోరిందే చేస్తాడు
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.