La sourate Al-Infitar en Telugu
ఆకాశం చీల్చబడినప్పుడు |
మరియు నక్షత్రాలు చెదిరి పోయినప్పుడు |
మరియు సముద్రాలు పొంగి పొరలి పోయినప్పుడు |
మరియు సమాధులు పెళ్ళగింప (తెరువ) బడినప్పుడు |
ప్రతి వ్యక్తికి తాను చేసి పంపుకున్నది మరియు వెనుక వదలి పెట్టింది అంతా తెలిసి పోతుంది |
يَا أَيُّهَا الْإِنسَانُ مَا غَرَّكَ بِرَبِّكَ الْكَرِيمِ(6) ఓ మానవుడా! పరమదాత అయిన నీ ప్రభువును గురించి, ఏ విషయం నిన్ను ఏమరుపాటుకు గురి చేసింది |
ఆయనే నిన్ను సృష్టించాడు, తరువాత ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు మరియు నిన్ను తగిన ప్రమాణంలో రూపొందించాడు |
తాను తలచిన ఆకారంలో నిన్ను మలిచాడు |
అలా కాదు! వాస్తవానికి మీరు (పరలోక) తీర్పును అబద్ధమని తిరస్కరిస్తున్నారు |
మరియు, నిశ్చయంగా! మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండేవారు (దేవదూతలు) ఉన్నారు |
వారు, గౌరవనీయులైన లేఖకులు |
మీరు చేసేదంతా తెలుసుకునేవారు |
నిశ్చయంగా పుణ్యాత్ములు సుఖసంతోషాలలో తేలియాడుతూ ఉంటారు |
మరియు నిశ్చయంగా, దుష్టులు భగభగ మండే నరకాగ్నిలో ఉంటారు |
తీర్పు దినమున వారు అందులో ప్రవేశిస్తారు |
మరియు వారు దాని నుండి ఎంత మాత్రం తప్పించుకోలేరు |
మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది |
అవును మరి! ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది |
يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌ لِّنَفْسٍ شَيْئًا ۖ وَالْأَمْرُ يَوْمَئِذٍ لِّلَّهِ(19) ఆ దినమున ఏ మానవునికి కూడా ఇతరునికి ఎలాంటి సహాయం చేసే అధికారం ఉండదు. మరియు ఆ రోజు నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ కే ఉంటుంది |
Plus de sourates en Telugu :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Infitar : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Infitar complète en haute qualité.















Donnez-nous une invitation valide