అల్-హజ్ · 35/78
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-హజ్
الَّذِينَ إِذَا ذُكِرَ اللَّهُ وَجِلَتْ قُلُوبُهُمْ وَالصَّابِرِينَ عَلَىٰ مَا أَصَابَهُمْ وَالْمُقِيمِي الصَّلَاةِ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ ۝٣٥
Allazeena izaa zukiral laahu wajilat quloobuhum wassaabireena `alaa maaa asaabahum walmuqeemis Salaati wa mimmaa razaqnaahum yunfiqoon
📖 తెలుగులో
(వారికి) ఎవరి హృదయాలైతే, అల్లాహ్ పేరు ఉచ్ఛరించబడినప్పుడు భయంతో వణికి పోతాయో మరియు ఆపదలలో సహనం వహిస్తారో మరియు నమాజ్ స్థాపిస్తారో మరియు వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఇతరులపై ఖర్చు చేస్తారో

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 33-37 — సూరా అల్-హజ్

33لَكُمْ فِيهَا مَنَافِعُ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ثُمَّ مَحِلُّهَا إِلَى الْبَيْتِ الْعَتِيقِ
ఒక నిర్ణీత కాలం వరకు మీకు వాటిలో (ఈ పశువులలో) లాభాలున్నాయి. ఆ తరువాత వాటి గమ్యస్థానం ప్రాచీన గృహమే (కఅబహ్ యే)
34وَلِكُلِّ أُمَّةٍ جَعَلْنَا مَنسَكًا لِّيَذْكُرُوا اسْمَ اللَّهِ عَلَىٰ مَا رَزَقَهُم مِّن بَهِيمَةِ الْأَنْعَامِ ۗ فَإِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ فَلَهُ أَسْلِمُوا ۗ وَبَشِّرِ الْمُخْبِتِينَ
మరియు ప్రతి సమాజానికి మేము ధర్మ ఆచారాలు (ఖుర్బానీ పద్ధతి) నియమించి ఉన్నాము. మేము వారి జీవనోపాధి కొరకు ప్రసాదించిన పశువులను, వారు(వధించేటప్పుడు) అల్లాహ్ పేరును ఉచ్ఛరించాలి. ఎందుకంటే మీరందరి ఆరాధ్య దైవం ఆ ఏకైక దేవుడు (అల్లాహ్)! కావున మీరు ఆయనకు మాత్రమే విధేయులై (ముస్లింలై) ఉండండి. మరియు వినయ విధేయతలు గలవారికి శుభవార్తనివ్వు
35الَّذِينَ إِذَا ذُكِرَ اللَّهُ وَجِلَتْ قُلُوبُهُمْ وَالصَّابِرِينَ عَلَىٰ مَا أَصَابَهُمْ وَالْمُقِيمِي الصَّلَاةِ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ
(వారికి) ఎవరి హృదయాలైతే, అల్లాహ్ పేరు ఉచ్ఛరించబడినప్పుడు భయంతో వణికి పోతాయో మరియు ఆపదలలో సహనం వహిస్తారో మరియు నమాజ్ స్థాపిస్తారో మరియు వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఇతరులపై ఖర్చు చేస్తారో
36وَالْبُدْنَ جَعَلْنَاهَا لَكُم مِّن شَعَائِرِ اللَّهِ لَكُمْ فِيهَا خَيْرٌ ۖ فَاذْكُرُوا اسْمَ اللَّهِ عَلَيْهَا صَوَافَّ ۖ فَإِذَا وَجَبَتْ جُنُوبُهَا فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْقَانِعَ وَالْمُعْتَرَّ ۚ كَذَٰلِكَ سَخَّرْنَاهَا لَكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ
ఖుర్బానీ పశువులను, మేము మీ కొరకు అల్లాహ్ చిహ్నాలుగా చేశాము; మీకు వాటిలో మేలున్నది. కావున వాటిని (ఖుర్బానీ కొరకు) నిలబెట్టి వాటిపై అల్లాహ్ పేరును ఉచ్ఛరించండి. అవి (ప్రాణం విడిచి) ప్రక్కల మీద పడిపోయిన తరువాత మీరు వాటిని తినండి. మరియు యాచించని పేదలకు మరియు యాచించే పేదలకు కూడా తినిపించండి. ఈ విధంగా మేము వాటిని మీకు ఉపయుక్తంగా చేశాము, బహుశా మీరు కృతజ్ఞులవు తారేమోనని
37لَن يَنَالَ اللَّهَ لُحُومُهَا وَلَا دِمَاؤُهَا وَلَٰكِن يَنَالُهُ التَّقْوَىٰ مِنكُمْ ۚ كَذَٰلِكَ سَخَّرَهَا لَكُمْ لِتُكَبِّرُوا اللَّهَ عَلَىٰ مَا هَدَاكُمْ ۗ وَبَشِّرِ الْمُحْسِنِينَ
వాటి మాంసం గానీ, వాటి రక్తం గానీ అల్లాహ్ కు చేరవు! కానీ మీ భయభక్తులే ఆయనకు చేరుతాయి. మీకు సన్మార్గం చూపినందుకు, మీరు అల్లాహ్ ఘనతను కొనియాడటానికి, ఈ విధంగా ఆయన వాటిని మీకు వశపరిచాడు. సజ్జనులకు శుభవార్తను వినిపించు
అల్-హజ్ఖురాన్ సూచిక
78వచనం
MedinanRevelation
35వచనం

అనువాదం — అల్-హజ్ 35

సూరా అల్-హజ్ వచనం 35 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (వారికి) ఎవరి హృదయాలైతే, అల్లాహ్ పేరు ఉచ్ఛరించబడినప్పుడు భయంతో వణికి పోతాయో మరియు…

సూరా వచనం 35/78 — సూరా అల్-హజ్ الحج (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-హజ్ వినండి, సూరా అల్-హజ్ అనువాదం, సూరా అల్-హజ్ mp3, సూరా అల్-హజ్ pdf. వచనం 33–37. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers