ఆల్-ఇమ్రాన్ · 92/200
అనువాదం ఉచ్చారణ — ఆల్-ఇమ్రాన్
لَن تَنَالُوا الْبِرَّ حَتَّىٰ تُنفِقُوا مِمَّا تُحِبُّونَ ۚ وَمَا تُنفِقُوا مِن شَيْءٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ ۝٩٢
Lan tanaalul birra hattaa tunfiqoo mimmaa tuhibboon; wa maa tunfiqoo min shai`in fa innal laaha bihee `Aleem
📖 తెలుగులో
మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంత వరకు మీరు పుణ్యాత్ములు (ధర్మనిష్ఠాపరులు) కాలేరు. మరియు మీరు ఏమి ఖర్చుపెట్టినా అది అల్లాహ్ కు తప్పక తెలుస్తుంది

🎧 వినండి


📜 వచనం 90-94 — ఆల్-ఇమ్రాన్

90إِنَّ الَّذِينَ كَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ ثُمَّ ازْدَادُوا كُفْرًا لَّن تُقْبَلَ تَوْبَتُهُمْ وَأُولَٰئِكَ هُمُ الضَّالُّونَ
(అయితే) నిశ్చయంగా, విశ్వసించిన తరువాత ఎవరు సత్యతిరస్కార వైఖరిని అవలంబిస్తారో మరియు తమ సత్యతిరస్కార వైఖరిని పెంచుకుంటారో, వారి పశ్చాత్తాపం ఏ మాత్రం అంగీకరించబడదు మరియు అలాంటి వారే మార్గభ్రష్టులైన వారు
91إِنَّ الَّذِينَ كَفَرُوا وَمَاتُوا وَهُمْ كُفَّارٌ فَلَن يُقْبَلَ مِنْ أَحَدِهِم مِّلْءُ الْأَرْضِ ذَهَبًا وَلَوِ افْتَدَىٰ بِهِ ۗ أُولَٰئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ
నిశ్చయంగా, ఎవరైతే సత్యతిరస్కారులై, ఆ సత్యతిరస్కార స్థితిలోనే మృతి చెందుతారో! వారు భూగోళమంత బంగారం పాపపరిహారంగా ఇవ్వదలిచినా అది అంగీకరించబడదు. అలాంటి వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. మరియు వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు
92لَن تَنَالُوا الْبِرَّ حَتَّىٰ تُنفِقُوا مِمَّا تُحِبُّونَ ۚ وَمَا تُنفِقُوا مِن شَيْءٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ
మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంత వరకు మీరు పుణ్యాత్ములు (ధర్మనిష్ఠాపరులు) కాలేరు. మరియు మీరు ఏమి ఖర్చుపెట్టినా అది అల్లాహ్ కు తప్పక తెలుస్తుంది
93۞ كُلُّ الطَّعَامِ كَانَ حِلًّا لِّبَنِي إِسْرَائِيلَ إِلَّا مَا حَرَّمَ إِسْرَائِيلُ عَلَىٰ نَفْسِهِ مِن قَبْلِ أَن تُنَزَّلَ التَّوْرَاةُ ۗ قُلْ فَأْتُوا بِالتَّوْرَاةِ فَاتْلُوهَا إِن كُنتُمْ صَادِقِينَ
ఆహార పదార్థాలన్నీ ఇస్రాయీల్ సంతతివారికి ధర్మసమ్మతమైనవిగానే ఉండేవి. కాని, తౌరాత్ అవతరణకు పూర్వం ఇస్రాయీల్ (యఅఖూబ్) తనకు తాను కొన్ని వస్తువులను నిషేధించుకున్నాడు. వారితో ఇట్లను: మీరు సత్యవంతులే అయితే, తౌరాత్ ను తీసుకొని రండి మరియు దానిని చదవండి
94فَمَنِ افْتَرَىٰ عَلَى اللَّهِ الْكَذِبَ مِن بَعْدِ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
కావున దీని తర్వాత కూడా ఎవడైనా అబద్ధాన్ని కల్పించి దానిని అల్లాహ్ కు ఆపాదిస్తే, అలాంటి వారు, వారే దుర్మార్గులు
ఆల్-ఇమ్రాన్ఖురాన్ సూచిక
200వచనం
MedinanRevelation
92వచనం

అనువాదం — ఆల్-ఇమ్రాన్ 92

సూరా ఆల్-ఇమ్రాన్ వచనం 92 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంత వరకు…

సూరా వచనం 92/200 — ఆల్-ఇమ్రాన్ آل عمران (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: ఆల్-ఇమ్రాన్ వినండి, ఆల్-ఇమ్రాన్ అనువాదం, ఆల్-ఇమ్రాన్ mp3, ఆల్-ఇమ్రాన్ pdf. వచనం 90–94. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers