Wa maa yastawil bahraani haaza `azbun furaatun saaa`ighun sharaabuhoo wa haazaa milhun ujaaj; wa min kullin taakuloona lahman tariyyanw wa tastakhrijoona hilyatan talbasoonahaa wa taral fulka feehi mawaakhira litabtaghoo min fadlihee wa la`allakm tashkuroon
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
రెండు సముద్రాలు సరిసమానం కాజాలవు. వాటిలోని ఒకదాని (నీరు) రుచికరమైనది, దాహం తీర్చేది మరియు త్రాగటానికి మధురమైనది. రెండోదాని (నీరు) ఉప్పుగానూ, చేదుగానూ ఉన్నది. అయినా వాటిలో ప్రతి ఒక్క దాని నుండి మీరు తాజా మాంసం తింటున్నారు మరియు ఆభరణాలు తీసి ధరిస్తున్నారు. మరియు నీవు చూస్తున్నావు, ఓడలు వాటిని చీల్చుతూ పోవటాన్ని; (వాటిలో) మీరు, ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు మీరు ఆయనకు కృతజ్ఞులై ఉండటానికి
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
(उसकी कुदरत देखो) दो समन्दर बावजूद मिल जाने के यकसाँ नहीं हो जाते ये (एक तो) मीठा खुश ज़ाएका कि उसका पीना सुवारत (ख़ुश्गवार) है और ये (दूसरा) खारी कड़ुवा है और (इस इख़तेलाफ पर भी) तुम लोग दोनों से (मछली का) तरो ताज़ा गोश्त (यकसाँ) खाते हो और (अपने लिए ज़ेवरात (मोती वग़ैरह) निकालते हो जिन्हें तुम पहनते हो और तुम देखते हो कि कश्तियां दरिया में (पानी को) फाड़ती चली जाती हैं ताकि उसके फज्ल (व करम तिजारत) की तलाश करो और ताकि तुम लोग शुक्र करो
అల్లాహ్ తన శక్తి మరియు కృపను చూపుతూ, రెండు రకాల సముద్రాలు ఒకటి కావని తెలియజేస్తున్నాడు. ఒకటి తీయని నీరు కలది, దానిని త్రాగడం సులభం, దాహాన్ని తీరుస్తుంది. మరొకటి ఉప్పగా, చేదుగా ఉండే నీరు కలది, దానిని త్రాగలేము. అయినప్పటికీ, ఈ రెండు సముద్రాల నుండి మీరు తాజా చేపల మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు. అలాగే వాటి నుండి ముత్యాలు, పగడాలు వంటి అలంకరణ వస్తువులను తీసి ధరిస్తారు. ఓడలు ఆ నీటిలో నీటిని చీల్చుకుంటూ ముందుకు వెనుకకు సాగుతూ కనిపిస్తాయి. ఇది అల్లాహ్ అనుగ్రహాన్ని (వ్యాపారం మొదలైన వాటి ద్వారా) పొందడానికి, మరియు మీరు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడానికి. ఇందులో అల్లాహ్ ఏకత్వానికి, ఆయన శక్తికి స్పష్టమైన సూచన ఉంది.
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
అల్లాహ్ సృష్టిలో వైవిధ్యం మరియు ఏకత్వం రెండూ కనిపిస్తాయి; ఇది ఆయన మహిమను గుర్తించడానికి దారి చూపుతుంది.
అల్లాహ్ మనకు ఇచ్చిన ఆహారం, అలంకరణ, ప్రయాణ సౌకర్యాలు అన్నీ ఆయన కృపా కటాక్షాలే.
ఈ నిమిత్తాలను ఆలోచించి, అల్లాహ్ పట్ల కృతజ్ఞత చూపడం ప్రతి విశ్వాసి కర్తవ్యం.
ఇస్లాం ప్రకృతిని, దాని వనరులను ఆస్వాదించమని, వాటిని ఉపయోగించుకోమని ప్రోత్సహిస్తుంది; ఇది మనల్ని అల్లాహ్ వైపు మరింత దగ్గర చేస్తుంది.
ఈ ఆయత్ మనలో కృతజ్ఞత, విశ్వాసం, మరియు అల్లాహ్ మీద ఆధారపడే భావనను పెంచుతుంది.
రెండు సముద్రాలు సరిసమానం కాజాలవు. వాటిలోని ఒకదాని (నీరు) రుచికరమైనది, దాహం తీర్చేది మరియు త్రాగటానికి మధురమైనది. రెండోదాని (నీరు) ఉప్పుగానూ, చేదుగానూ ఉన్నది. అయినా వాటిలో ప్రతి ఒక్క దాని నుండి మీరు తాజా మాంసం తింటున్నారు మరియు ఆభరణాలు తీసి ధరిస్తున్నారు. మరియు నీవు చూస్తున్నావు, ఓడలు వాటిని చీల్చుతూ పోవటాన్ని; (వాటిలో) మీరు, ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు మీరు ఆయనకు కృతజ్ఞులై ఉండటానికి
గౌరవాన్ని కాంక్షించు వాడు తెలుసు కోవాలి, గౌరవమంతా అల్లాహ్ కే చెందుతుందని! మంచి ప్రవచనాన్నీ ఆయన వైపునకు ఎక్కి పోతాయి. మరియు సత్కర్మ దానిని పైకి ఎత్తుతుంది. మరియు ఎవరైతే చెడు కుట్రలు పన్నుతారో! వారికి కఠిన శిక్ష ఉంటుంది. మరియు అలాంటి వారి కుట్ర, అదే! నశించి పోతుంది
మరియు అల్లాహ్ మిమ్మల్ని మట్టితో సృష్టించాడు. తరువాత ఇంద్రియ బిందువుతో, ఆ తరువాత మిమ్మల్ని (ఆడ-మగ) జంటలుగా చేశాడు. మరియు ఏ స్త్రీ కూడా ఆయనకు తెలియకుండా గర్భం దాల్చజాలదు మరియు ప్రసవించనూ జాలదు. గ్రంథంలో వ్రాయబడనిదే, పెరుగుతున్న వాడి వయస్సు పెరగనూ జాలదు మరియు ఎవని వయస్సు తరగనూ జాలదు. నిశ్చయంగా, ఇదంతా అల్లాహ్ కు ఎంతో సులభం
రెండు సముద్రాలు సరిసమానం కాజాలవు. వాటిలోని ఒకదాని (నీరు) రుచికరమైనది, దాహం తీర్చేది మరియు త్రాగటానికి మధురమైనది. రెండోదాని (నీరు) ఉప్పుగానూ, చేదుగానూ ఉన్నది. అయినా వాటిలో ప్రతి ఒక్క దాని నుండి మీరు తాజా మాంసం తింటున్నారు మరియు ఆభరణాలు తీసి ధరిస్తున్నారు. మరియు నీవు చూస్తున్నావు, ఓడలు వాటిని చీల్చుతూ పోవటాన్ని; (వాటిలో) మీరు, ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు మీరు ఆయనకు కృతజ్ఞులై ఉండటానికి
ఆయనే రాత్రిని పగటిలోకి ప్రవేశింప జేస్తున్నాడు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింప జేస్తున్నాడు మరియు సూర్యచంద్రులను నియమబద్ధులుగా చేసి ఉన్నాడు. అవి తమ తమ పరిధిలో, నిర్ణీత వ్యవధిలో తిరుగుతూ ఉన్నాయి. ఆయనే అల్లాహ్! మీ ప్రభువు, విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే! మరియు ఆయనను వదలి మీరు వేడుకునే వారు, ఖర్జూర బీజంపై నున్న పొరకు కూడా యజమానులు కారు
మీరు వారిని వేడుకొన్నప్పటికీ, వారు మీ ప్రార్థనలను వినలేరు, ఒకవేళ విన్నా, వారు మీకు జవాబివ్వలేరు. మరియు పునరుత్థాన దినమున మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు తిరస్కరిస్తారు. మరియు (సత్యాన్ని) గురించి నీకు ఆ సర్వం తెలిసినవాడు తెలిపినట్లు మరెవ్వరూ తెలుపజాలరు
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.